2020 కరోనా సమయంలో పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా ఉన్న రానా.. ఎట్టకేలకు ప్రముఖ వ్యాపారవేత్త మిహీకా బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకుని తన బ్యాచ్లర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేశాడు. 2020 డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో రానా-మిహీకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల నడుమ మిహీక మెడలో మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచాడు రానా. అయితే తాజాగా ఈ దంపతులకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే రానా తండ్రి కాబోతున్నాడట.
ఆయన సతీమణి మిహీక ఇటీవల గర్భం దాల్చిందని.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రానా అభిమానులు మాత్రం వారసుడు వస్తున్నాడోచ్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా, రానా కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన తన బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలో నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే పలు సినిమాలు సైతం రానా చేతిలో ఉన్నాయి.