23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

ఆ హీరోయిన్ తో సిద్ధార్థ్ ప్రేమాయ‌ణం.. త్వ‌ర‌లో మోగ‌నున్న‌ పెళ్లి బాజాలు?!

Share

సిద్ధార్థ్‌.. ఈ హీరో గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోగా సత్తా చాటిన సిద్ధార్థ్‌.. వ‌రుస‌ ఫ్లాపులు పడటంతో ఫెయిడ్ అవుట్ హీరోల లిస్టులో చేరిపోయాడు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సిద్ధార్థ్‌.. మళ్లీ హీరోగా నిలదొక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

ఈ సంగతి పక్కన పెడితే.. సిద్ధార్థ్ ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమాయణం నడిపిస్తున్నాడట. త్వరలోనే పెళ్లి బాజాలు కూడా మోగనున్నాయ‌ట‌. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సిద్ధార్థ్‌, అదితి జంటగా `మహాసముద్రం` సినిమాలో నటించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శర్వానంద్ మరో హీరోగా నటించాడు.

Siddharth Aditi Rao Hydari
Siddharth Aditi Rao Hydari

అయితే గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ సిద్ధార్థ్‌, అదితిల మధ్య మంచి స్నేహం ఏర్పడిందట‌. ఆ స్నేహం ఇప్పుడు ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లి వరకు వెళ్ల‌బోతోందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. నేడు అదితి బ‌ర్త్‌డే. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు.

`హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్..నీకలలన్ని నిజం కావాలని కోరుకుంటున్నాను` అని అతిథి రావు తో క్లోజ్‌గా దిగిన ఓ పిక్‌ను షేర్ చేశాడు. అయితే బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌డం ఒకే కానీ.. ఇక్క‌డ `ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్` అని సిద్ధు రాసుకొచ్చాడు. అంటే నా హృదయ యువరాణి అని అర్థం. ఇంకేముంది వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారంటూ.. ఈ విష‌యాన్ని సిద్ధార్థ్ ప‌రోక్షంగానే చెప్ప‌క‌నే చెప్పేశాడ‌ని వార్త‌లు ఊపందుకున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/p/CkQG89oP4Ol/?utm_source=ig_web_copy_link


Share

Related posts

దేవిని మాయం చేసిన మాధవ్.. రాధకి మాధవ్ కుట్ర తెలుస్తుందా.!?

bharani jella

చిరంజీవి బ‌ర్త్‌డే.. ఒక రోజు ముందే రాబోతున్న‌ మెగా ట్రీట్!

kavya N

KGF 2: ఫ‌స్ట్ డే కుమ్మేసిన `కేజీఎఫ్ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా?

kavya N