AP CM Jagan: తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోకి విపరీతమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా చాలామంది గుర్తింపు పొందారు. ఈ రకంగా గుర్తింపు పొందిన వారిలో పంచ ప్రసాద్ కూడా ఒకరు. తన అద్భుతమైన పంచ్ డైలాగులతో పాటు కామెడీ టైమింగ్…తో స్కిట్ లలో చలరేగిపోతూ ఉంటాడు. జబర్దస్త్ షోలో పంచ్ ప్రసాద్ స్కిట్ లకి విపరీతమైన ఆదరణ ఉంది. కాగా ఎంతో మందిని నవ్వించే పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడవటంతో నిత్యం ఏదో ఒక జబ్బు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉండటంతో…. అనేక ఆర్థిక ఇబ్బందులకు గురై మంచానికి పరిమితమై… తీవ్ర దుర్భర స్థితికి చేరుకోవడం జరిగింది.
పంచ్ ప్రసాద్ సెలబ్రిటీ కావడంతో… అతని పరిస్థితి సోషల్ మీడియాలో చాలా వైరల్ కావడంతో వివిధ సెలబ్రిటీలు కొంతమేర సాయం చేయడం జరిగింది. అయితే జబర్దస్త్ కమెడియన్స్ చాలా వరకు మంత్రి రోజాకి టచ్ లో ఉండటంతో ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో వెంటనే ఆమె స్పందించారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పంచ్ ప్రసాద్ కి కావలసిన వైద్య సదుపాయాలు అన్నిటినీ సీఎంవో కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.
సీఎం జగన్ కూడా త్వరితగితన వైద్యశాయి మన్నించడానికి ఏర్పాటు చేయాలని స్పందించడంతో ఆపరేషన్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించేందుకు సిద్ధం కావడంతో… పంచ్ ప్రసాద్ ఏపీ సీఎం జగన్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ” మీ అందరికీ స్పెషల్ థాంక్స్.. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి రోజా గారు ఇంతకుముందు కూడా నాకు చాలా సాయం చేశారు. ఈసారి నా ఆరోగ్య సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చికిత్సకు కావలసిన డబ్బును సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు చేయించారు. సీఎం జగన్ కు మంత్రి రోజాకు చాలా థాంక్స్ అంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది.