ఇటీవల ముంబైలో ‘లొల్లపలూజా గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్-2023’ జరిగింది. ఈ ఫెస్టివల్‌కి కే-పాప్ స్టార్ జాక్సన్ వాంగ్ తన ప్రదర్శనను ఇవ్వడానికి దక్షిణ కొరియా నుంచి ముంబైకు వచ్చాడు. జనవరి 28 నుంచి 29 వరకు రెండు రోజులపాటు మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లో బాలీవుల్ సెలబ్రిటీలు అందరూ పాల్గొన్నారు. ఫెస్టివల్ ముగిసిన తర్వాత పాప్ స్టార్ జాక్సన్ వాంగ్‌ను బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఇంటికీ ఆహ్వానించారు. అతనితో కలిసి ఫోటోలు దిగేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా ఎగబడ్డారు. ఇంతకీ ఎవరీ జాక్సన్ వాంగ్? బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఆయనకెందుకంతా క్రేజ్ ఉంది? అతని పాటలకు అంత మంది అభిమానులు ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ క్రింది వివరాలను చదవాల్సిందే.

ఎవరీ జాక్సన్ వాంగ్?
జాక్సన్ వాంగ్.. రాపర్, సింగర్, డాన్యర్, రికార్డ్ ప్రొడ్యూసర్, ఫ్యాషన్ డిజైనర్, మ్యూజిక్ వీడియో డైరెక్టర్. టీమ్ వాంగ్‌కు వ్యవస్థాపకుడు. అలాగే ఫ్యాషన్ బ్రాండ్ టీమ్ వాంగ్ డిజైన్‌కు మెయిన్ డిజైనర్. హాంకాంగ్‌లో పుట్టి పెరిగిన వాంగ్ 2014లో జేవైపీ ఎంటర్‌టైన్‌మెంట్ అనుసంధానమైన ‘కే-పాప్ బాయ్ గ్రూప్, గాట్7’ మ్యూజిక్ బ్యాండ్‌లో చేరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 2019లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం సోలో ఆల్బమ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. మిర్రర్స్ అనే ఆల్బమ్ యునైటెడ్ స్టేట్స్ లోని బిల్‌బోల్డ్ 200లో 32వ స్థానాన్ని దక్కించుకుంది. అతని రెండవ ఆల్బమ్ మ్యాజిక్ మెన్-2022లో లిస్ట్ లో 15వ స్థానాన్ని దక్కించుకుంది.
2021లో వాంగ్ జేవైపీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను విడిచిపెట్టి టీమ్ వాంగ్ ఆధ్వర్యంలో చైనీస్ హిప్ హాప్ గ్రూప్, పాంథెప్యాక్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నాడు. తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఫోర్బ్స్ జాబితాలోనూ జాక్సన్ వాంగ్ కనిపించాడు. అయితే జాక్సన్ వాంగ్ రాపర్ కాక ముందు ‘ఫెన్సర్’గా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్ని ఎన్నో మెడల్స్ గెలిచాడు.

వాంగ్ వ్యక్తిగత జీవితం
జాక్సన్ వాంగ్ 28 మార్చి 1994లో హాంకాంగ్‌లో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇద్దరూ జిమ్నాస్టిక్స్. అందుకే వాంగ్ పదేళ్ల వయసులోనే ఫెన్సింగ్ శిక్షణను ప్రారంభించాడు. 2011లో ఆసియా జూనియర్ క్యాడెట్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మొదటి స్థానంలో గెలుపొందాడు. ఆటలతోపాటు సంగీతంపై కూడా ఇతడికి ఇష్టం ఎక్కువే. మొట్టమొదటి సారిగా కౌలూన్‌లో జరిగిన గ్లోబల్ ఆడిషన్స్ లో పాల్గొని.. ఏకంగా 2 వేల మందిని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు. స్టార్ కింగ్, లా ఆఫ్ ది జంగిల్, హ్యాపీ టుగెదర్, రేడియో స్టార్, ప్రాబ్లెమాటిక్ మెన్, అవర్ నైబర్ హుడ్ ఆర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యూకేషన్, సాటర్డే నైట్ లైవ్ కొరియా వంటి ప్రదర్శనలు ఇచ్చాడు. సంగీత కచేరీలు, షోలు, సిరీస్‌లు నటిస్తూ హ్యూజ్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.

బాలీవుడ్ సెలబ్రిటీల ఇంట వాంగ్ సందడి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కే-పాప్ స్టార్ జాక్సన్ వాంగ్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి డిన్నర్ చేశారు. ఆ తర్వాత అందరితో కలిసి వాంగ్ ఫోటోలు దిగారు. అలాగే బాలీవుడ్ నటి దిశా పటానీతో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు వాంగ్. దిశా పటానీ.. వాంగ్‌కు వీరాభిమాని. తన అభిమాన పాప్ సింగర్‌తో కలిసి ముంబై వీధుల గుండా తిరిగేసింది. బాలీవుడ్ సెలబ్రిటీలతో వాంగ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.