NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 6 2024 Episode 198: హేమని తప్పించింది నిషికనని అనుమానిస్తున్న జగదాత్రి..

Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights

Jagadhatri April 6 2024 Episode 198:  ఇంట్లో వాళ్లకి చెప్పి ఓపెన్ చెయ్ ధైర్యం లేక ఇలా పారిపోయి వచ్చాను అక్క నన్ను క్షమించు అని హేమ అంటుంది. నేను మాటిస్తున్నాను మీ పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించి మీ పెళ్లి జరిపించే పూజి నాది దయచేసి నా మాట విని మీరు నాతో రండి అని జగదాద్రి అంటుంది. నువ్వు మాట ఇచ్చావు అంటే ప్రపంచమంతా ఏకమై వచ్చిన నీ మాట నిలబెట్టుకుంటావు అక్క నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని హేమ అంటుంది.కానీ నువ్వు ఇంట్లో నుంచి పారిపోవడానికి సహాయం చేసింది ఎవరు అని కేదార్ అడుగుతాడు. నేను బయటపడ్డానని నాకు సహాయం చేసిన వాళ్ల పేరు చెప్పలేను తనని ఆపదలోకి నెట్టలేను సారీ అని అంటుంది.జగదాత్రి వాళ్ళని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights
Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights

యువరాజ్ చాలా మంచి పని చేశాడు దేవా నీ కుటుంబం జోలికి రావాలి అంటే నిన్ను దాటుకొని రావాలి అన్నావు కదా నువ్వే వచ్చి నా కాళ్లు పట్టుకునేలా చేశాను ఇప్పుడేం చేస్తావు చెయ్ నీ కుటుంబాన్ని రక్షించుకుంటావా నా కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడుతావా పార్ట్నర్షిప్ ఇవ్వమంటే రౌడీలతో నేను బిజినెస్ చేయను అంటావా అని మీనన్ ఆ అమ్మాయినిచూస్తాడు.రేయ్ పెళ్లికూతురు ఈ అమ్మాయేనా అని మీ నాన్న అడుగుతాడు. పెళ్లికూతురు ఈ అమ్మాయి కాదన్నా మనవాళ్లు పొరపాటు పడుతూన్నారు అని దేవా అంటాడు. ఏ దేవా యువరాజు కి ఫోన్ చేయరా అని మీనన్ యువరాజ్ కి ఫోన్ చేసి పెళ్లికూతురుని పంపించమంటే ఎవరో అమ్మాయిని పంపించావ్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి బాయ్ మీరు చెప్పేది నేను నిజంగానే పెళ్లి కూతుర్నే పంపించాను అని యువరాజ్ అంటాడు. అవునా అయితే వీడియో కాల్ చేస్తాను చూడు అంటూ వీడియో కాల్ చేసి ఆ అమ్మాయిని చూపెడతాడు మీనన్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మీనన్ నేను అమ్మాయిని కిడ్నాప్ చేసి పంపించాను అని యువరాజ్ అంటాడు. నా ప్లాన్ అంత పాడు చేశావు అని టెన్షన్ పడుతూ ఉంటాడు మీనన్. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights
Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights

జగదాత్రి కేదార్ హేమా వాళ్ళని తీసుకొని వస్తారు. జగదాత్రి వాళ్ళు వచ్చారు అని పార్వతి చెబుతుంది. ఎంత పని చేసావ్ అమ్మ గంట టైం ఉంది అనగా ఇలాంటి పని చేస్తావా ఆ మీనా నినేమీ చేయలేదు కదా అని రమేష్ అంటాడు. మీరు ఆగండి నాన్న అన్న హేమ నావల్ల మీ కుటుంబానికి అవమానం జరిగిందా ఆంటీ నన్ను క్షమించండి కానీ నేను కావాలని పారిపోలేదు మా నాన్నకి చెప్పే ధైర్యం లేక నా ప్రేమను గెలిపించుకోవాలని ఇలాంటి పని చేశాను నన్ను క్షమించండి అని అఖిలాండేశ్వరిని క్షమాపణ కోరుతుంది హేమ. హేమ నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నాకు చెపి ఉండాల్సింది నేను ఏదో ఒకటి చేసి ఆపేవాన్ని గంట టైం ఉంది అనగా పెళ్లి పీటల నుంచి పారిపోతావా మా కుటుంబానికి ఎంత అప్రతిష్ట అని పెళ్లి కొడుకు అంటాడు. నావల్ల బాధపడ్డ మీ అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి అని హేమ అంటుంది.

Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights
Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights

హేమ నువ్వు ఎవరికి భయపడాల్సిన పనిలేదు మీ పెళ్లి జరిపించే పూజి మాది అని దేవా అంటాడు. అంకుల్ నా దగ్గర మీ అంత డబ్బు లేకపోవచ్చు కానీ మంచి ఉద్యోగం ఉంది హేమ అంటే నాకు ప్రాణం తనని బాగా చూసుకుంటాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్ అని కళ్యాణ్ అంటాడు.వీళ్లందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు అఖిలాండేశ్వరి మీరు కడుతున్న అది ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతుందో నేను చూస్తాను అంటూ రమేష్ వెళ్ళిపోతాడు. నువ్వేమీ భయపడకు హేమ నీ పెళ్లి జరిగేంతవరకు మా ఇంట్లోనే ధైర్యంగా ఉండొచ్చు అని దేవా అంటాడు. అమ్మ జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ విషయం గురించి వదిలే అని దేవా అంటాడు. నేను దాని గురించి ఆలోచించట్లేదు దేవా అసలు హేమ ఇంట్లో నుంచి పారిపోవడానికి సహాయం చేసిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తుంది అఖిలాండేశ్వరి. నిషి నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అనే జగదాత్రి పక్కకు తీసుకు వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights
Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights

నిషి హేమను ఇంట్లో నుంచి తప్పించింది నువ్వే అని అఖిలాండేశ్వరి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని జగదాత్రి అంటుంది.నేనేదో తప్పు చేసినట్టు నన్నునిలదీస్తావంటే ఆయన ఆధారం ఏంటి అని నిషిక దబాయిస్తోంది.నిషి మనం వచ్చిన కానుంచి హేమ దగ్గర నువ్వు తప్ప ఇంకెవరూ లేరు స్టోర్ రూమ్ లోకి నువ్వు వెళ్లడం నేను చూశాను నేను స్టోర్ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి చెప్పుల అచ్చులు అక్కడ ఉన్నాయి అవి అన్ని చెప్పుల గుర్తులే నిజం చెప్పు నిషి  అని జగదాత్రి అంటుంది.అవును నేనే చేశాను తను నా ఫ్రెండ్ కాబట్టి సహాయం అడిగితే చేశాను అయితే ఇప్పుడేంటి అని నిషిక అంటుంది. అఖిలాండేశ్వరి ఇంటి కుటుంబాన్ని నడిరోడ్డు మీద పెట్టావని అఖిలాండేసరికి తెలిస్తే మన కుటుంబం మీద ఉన్న గౌరవం పోతుంది నీకు పెళ్లయింది నిషి ఇలాంటి పనులు చేస్తే మన కుటుంబం పరువు ఏమైపోతుంది ఒకసారి ఆలోచించవా అని జగదాత్రి అంటుంది. నీ దగ్గర నీతులు చెప్పించుకునే అంత స్థాయికి దిగజారిపోలేదు అని నిషిక వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights
Jagadhatri Today Episode April 6 2024 Episode 198 highlights

అమ్మ ఇప్పుడు ఎలాగా రమేష్ అంకుల్ డీ ప్రాజెక్ట్ ఎలా కడతారో చూస్తాను అంటూ వెళ్లిపోయాడు అని దేవా అంటాడు. అదే నేను ఆలోచిస్తున్నాను దేవా ఆ స్థలం ఇచ్చింది రమేష్ దాని మీద మనం ఇప్పటికే ఎన్నో లక్షలు పెట్టాము ఇప్పుడు ఆడి ప్రాజెక్ట్ ఆగిపోతే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది అఖిలాండేశ్వరి. ఇంతలో కలెక్టర్ గారు వస్తారు. రండి కలెక్టర్ గారు అని అఖిలాండేశ్వరి ఆహ్వానిస్తుంది. కలెక్టర్ గారు దేవా పార్వతికి ఆల్ ద బెస్ట్ చెబుతాడు. అమ్మ అఖిలాండేశ్వరి గారు మీరు కట్టబోయే డీ ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి వచ్చాను అలాగే హేమ మీ చిన్నబ్బాయి ఎంగేజ్మెంట్ చూసినట్టు ఉంటుంది అని వచ్చాను అని కలెక్టర్ గారు అంటారు.నేను ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను కలెక్టర్ గారు అని అఖిలాండేశ్వరి అంటుంది…

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella