NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

Jagapathi Babu: అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సినీ తారల్లో సౌందర్య ఒకరు. తెలుగు అమ్మాయి కాకపోయినా తన కట్టు బొట్టు నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా కనిపించి అలరించింది. తెలుగు సినీ ప్రియుల మదిలో అందమైన అపురూపంగా నిలిచిపోయింది. ఏ పాత్ర తీసుకున్న అందులో ఒదిగిపోయే గుణం సౌందర్య సొంతం. దాదాపు దశాబ్దన్నర కాలం సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సౌందర్య.. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది.

అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంది. మహానటి సావిత్రి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. కోట్లాది సిని ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. కెరీర్ పీక్‌ స్టేజ్ లో ఉన్న సమయంలో దురదృష్టవశాస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యం మరణించింది. 2004లో బిజెపి కోసం సోదరుడు అమర్నాథ్ తో క‌లిసి ఎన్నికల ప్రచారానికి ఆమె వెళ్తుండగా విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

ఆ ప్ర‌మాదంలో సోదరుడు అమర్నాథ్ తో పాటు సౌందర్య సైతం అక్క‌డిక‌క్క‌డే కాలి బూడిదైపోయింది. 31 ఏళ్లకే కన్నుమూసి చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చింది. అయితే తాజాగా సౌందర్య మరణం పై సీనియ‌ర్‌ హీరో జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో జగపతిబాబు సౌందర్యలది హిట్ పెయిర్ మ‌రియు ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. జ‌గ‌ప‌తి బాబు, సౌంద‌ర్య జంటగా అల్ల‌రి ప్రేమికుడు, పెళ్లి పీట‌లు, బ‌లే బుల్లోడు ఇలా చాలా చిత్రాల్లో నటించారు.

ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ చూసి జ‌గ‌ప‌తి బాబు, సౌంద‌ర్య ప్రేమ‌లో ఉన్నార‌ని.. పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు ఆ వార్త‌లు పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక‌పోతే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌ప‌తి బాబుకు సౌంద‌ర్య గురించి ఓ ప్ర‌శ్న ఎదురైంది. సౌంద‌ర్య లాంటి ఒక మంచి స్నేహితురాలిని కోల్పోయిన‌ప్పుడు మీ మాన‌సిక స్థితి ఎలా ఉంది? అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. జ‌గ‌ప‌తి బాబు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

`నేను ఫిలాసఫీ ఎక్కువ న‌మ్ముతాను. పుట్టిన‌వాళ్ల ఎప్ప‌టికైనా వెళ్లిపోవాల్సిందే. జీవితంలో డబ్బుతో స‌హా ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనిషిని కోల్పోతే తిరిగి తీసుకురావ‌డం అసాధ్యం. అందుకు తప్పకుండా బాధపడాలి. చ‌నిపోతే క‌చ్చితంగా ఏడవాలి అనే రూల్ లేదు. కానీ ఆ వ్యక్తిని మిస్ అవుతున్నామ‌నే బాధ మ‌న‌సులో ఉంటుంది. ఇక సౌందర్య చ‌నిపోయిన‌ప్పుడు ఆమె మరణించిందన్న‌ బాధ క‌న్నా న‌న్ను ఇంకొన్ని విష‌యాలు ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి. ప్రమాదంతో సౌంద‌ర్య‌తో పాటు అమ‌ర్నాథ్ కూడా చ‌నిపోయాడు. వారి మదర్ పరిస్థితి ఏంటి ? అమర్ భార్య పరిస్థితి ఏంటి ? అతని పిల్ల‌ల పరిస్థితి ఏంటి ? ఇవే నా మైండ్ లో తిరిగాయి. సౌంద‌ర్య చనిపోయినందుకు ఏడవలేదు కానీ ఆమె ఫ్యామిలీ ప‌రిస్థితి త‌లుచుకుని చాలా బాధ‌ప‌డ్డాను` అంటూ జ‌గ‌ప‌తి బాబు చెప్పుకొచ్చారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కాస్త వైర‌ల్ గా మారాయి.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N