Janaki Kalaganaledu ఆగస్టు 16 ఎపిసోడ్ 659: పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయాం అండి అని జ్ఞానంబ అనడంతో జానకి కలగనలేదు ఈ రోజు ఎపిసోడ్ మొదలవుతుంది… మనం ఆశించినట్టు వాళ్ళు ఉండకపోవడం వాల్ల తప్పు కాదు జ్ఞానం, మనం ఆశించడమే మన తప్పు, అని జ్ఞానాంబ వాళ్ళ ఆయన గోవిందరాజు అంటాడు. వెన్నెల పెళ్లయ్యాక మనం ఇక్కడ ఉండొద్దండి ఏ కాశీకో వెళ్లి ఉందాం అని జ్ఞానాంబ అంటుంది.

ఎందుకలా అంటావు జ్ఞానం అని గోవిందరాజులు అంటాడు. పిల్లల కోసం మనం ఎన్ని త్యాగాలు చేశామండి అవన్నీ మర్చిపోయారా పిల్లలు అని జ్ఞానాంబ అంటుంది. వాళ్లు మాత్రం ఏం చేస్తారు జ్ఞానం వల్ల అమ్మానాన్నలను ఎంతో బాగా చూసుకోవాలి విమానాలలో తిప్పాలి అనే కోరికలు ఉంటాయి కానీ అవన్నీ జరగనప్పుడు వాళ్లు మాత్రం ఏం చేస్తారు అని గోవిందరాజులు అంటాడు. కానీ రామ ఇల్లు అమ్మనివ్వడండీ రామనే పెళ్లి చేస్తాను అని అంటాడు అని జ్ఞానాంబ అంటుంది.

వాళ్ళిద్దరితో పాటు వాడికి గోరుముద్దలు తినిపించావు జ్ఞానం. కానీ వాడి ఒక్కడి మీదే భారం వేస్తే అన్న తమ్ముళ్ళతో విడిపోతాడు మనకు దగ్గరవుతాడు అలా జరిగితే బాగోదు అని గోవిందరాజులు అంటాడు. రేపు పొద్దున్న పిల్లల్ని పిలిచి ఇల్లు అమ్మేస్తున్నానని వాళ్లతో చెప్పకండి మీ ప్రయత్నం మీరు చేయండి అని జ్ఞానాంబ అంటుంది. ఇంక దీని గురించి నువ్వేమీ ఆలోచించకు వెళ్లి పడుకో అని గోవిందరాజులు అంటాడు. కట్ చేస్తే ఎందుకు అన్నయ్య రమ్మని మెసేజ్ పెట్టావ్ అని వాళ్ళ తమ్ముళ్లు అడుగుతారు. మెసేజ్ పెట్టింది మీ అన్నయ్య కాదు నేనువెన్నెల పెళ్లి గురించి మాట్లాడదామని అని జానకి అంటుంది.
ఇంతకుముందే కదా వదినా అమ్మానాన్నలతో మాట్లాడుకున్నాం ఇందులో కొత్తగా నువ్వు చెప్పడానికి గాని మేము వినడానికి గాని ఏముంది ఎక్కువ మాట్లాడే కొద్ది మనస్పర్ధలు పెరగడం తప్ప లాభం ఉండదు వదిన అని అఖిల్ అంటాడు. అంటే మీ మనసులు ఏమాత్రం అమ్మానాన్నల గురించి ఆలోచించేది ఏమీ లేదా అని జానకి అంటుంది. నీ మనసులో కూడా ఏముందో చెప్పు విష్ణు నీ పక్కన మీ ఆవిడ కూడా లేదు నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పు అని జానకి అంటుంది. నాన్న ఇల్లుమ్మ డానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వదినా అని విష్ణు అంటాడు.

ఏంటి ఇల్లు మీద మీకు ఎలాంటి మమకారం లేదా ఈ ఇల్లు నాలుగు గోడలే కాదు ఆయన ఎంతో శ్రమపడి కట్టిన ఇల్లు మన అందరిని ఒకటి చేసి ఇంట్లో ఉంచాలని అనుకుంటున్నారు అది మీకు పట్టదా లేదాఏంటి ఇల్లు విలువ ఏంటో మీ తమ్ముళ్ళకి తెలిసేలా మీరేనా చెప్పండి రామా గారు అని జానకి అంటుంది. ఇల్లు విలువ తెలియక కాదు జానకి గారు ఒప్పుకుంటే చెల్లెలి పెళ్లి ఎక్కడ చేయాల్సి వస్తుందోనని వీళ్ళ బాధ అని రామ అంటాడు. కుటుంబం అంటే ఎప్పుడు సంతోషాన్ని పంచుకోవడమే కాదు బాధని కూడా పంచుకోవాల్సి ఉంటుంది మనం వెళ్లడానికి ఉంటేనే అది ఇల్లు అంటారు ఈ కుటుంబాన్ని చెల్లా చెదురు చేసుకుని విడిపోదామా చెప్పు విష్ణు చెప్పు అఖిల్ అని జానకి అడిగింది.
మీ వదిన మిమ్మల్ని తప్పు పట్టడం లేదు జరగబోయే నష్టం గురించి చెబుతుంది నేను మీకంటే గొప్పవాడిన నే చెప్పాలనుకోవట్లేదు మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాడిని అనితెలుసుకోవాలని చెల్లెలి పెళ్లి చెయ్యాలని అనుకోవట్లేదు నిజానికి అది నాకు తలకు మించిన భారం కూడా కానీ ఎందుకు ముందడుగు వేస్తున్నానంటే అమ్మా నాన్న కోసం మన చెల్లెలి కోసం రా మనమే ఇలా అనుకుంటే చెల్లెలు ఏమనుకుంటుంది రా అని రామ అంటాడు. చచ్చిపోవాలనుకుంటుంది వదిన నా గురించి అన్నయ్యలు గొడవ పడొద్దు నా వల్ల వాళ్ల మధ్య మనస్పర్ధలు రావద్దు అందుకని నేను చచ్చిపోతాను అని వెన్నెల అంటుంది కానీ నేను తనకి సర్ది చెప్పాను ఈరోజు మనం డబ్బు సంపాదిస్తాం అది ఏదో ఒక రోజు ఖర్చయిపోతుంది జీవితంలో ఏదీ శాశ్వతం కాదు కుటుంబం ఒకటే శాశ్వతం అది ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్ళదు అది రక్త సంబంధానికి ఉండే విలువ అర్థం చేసుకుంటే చేసుకోండి లేదంటే ఇక మీ ఇష్టం అని జానకి అంటుంది.

జానకి అలా అనగానే అఖిల్ విష్ణు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఏదైతే అదే అవనివ్వండి రామ గారు భగవంతుడి మీద భారం వేద్దాం అని జానకి అంటుంది. కట్ చేస్తే అమ్మ మా వల్ల మీరు ఎంత బాధ పడ్డారు రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారని మీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది మా జీవితాలు మీరు పెట్టిన బిక్ష అమ్మ అని రామ అంటాడు.మా సంతోషం కోసం మిమ్మల్ని కన్నా మా బాధ్యతగా మిమ్మల్ని పెంచాం మీలో ఉన్నది కూడా మా రక్తమే కాబట్టి ఆ బంధం జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాం అంతకుమించి మన మధ్య రుణాలు బంధాలు లేవని మీ నాన్నగారు నాకు అర్థం అయ్యేలా చెప్పారు అని జ్ఞానాంబ అంటుంది. ఎందుకమ్మా మన మధ్య ఇలాంటి గీతలు గీస్తున్నారు అని రామా అంటాడు.
ఈ గీత నేను గీసింది కాదురా అలాంటి గీత ఒకటి ఉందని నాకు నిన్ననే తెలిసింది ఆలోచించాను అలాంటి గీత ఒకటి నాకు అవసరం అని అనిపించింది దానివల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు రామ ఎప్పటిలాగే మనం కలిసే ఉందాం అని గోవిందరాజులు అంటాడు. ఈ ఇల్లును అమ్మేశాక అందరం ఒక దగ్గర ఉండడం కుదురుతుందా నాన్న ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పండినాన్న ఈ ఇల్లు అమ్మడానికి వీల్లేదు ఇది ఇల్లు కాదు మాకు గుడి ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా చెల్లి బాధ్యత మీ బాధ్యత నాది అని రామ అంటాడు. మూడు భుజాల మీద మోయవలసిన భారాన్ని ఒక్క భుజం మీద వేయడం కరెక్ట్ కాదురా అని గోవిందరాజులు అంటాడు.

అలా అంటే ఎలా నాన్నా అని రామా అంటాడు.మీ తమ్ముళ్ల గురించి ఈ ఇంటి గురించి ఎన్నో అప్పులు చేశావు ముందు వాటి నుంచి బయటపడు అని జ్ఞానం ఉంటుంది. అదెలా కుదురుతుంది అమ్మ అని రామ అంటాడు. ఒక్క నిమిషం రా మా నీకు అర్థం అయ్యేలా చెప్తాను నాకు ఒక మూడు ఎకరాల పొలం వచ్చింది దాని నీ ఒక్కడికే రాసిస్తాను నువ్వు ఒప్పుకుంటావా అని గోవిందరాజులు అంటాడు. అలా ఎలా కుదురుతుంది బావగారు ఒప్పుకున్న మేము ఎలా ఒప్పుకుంటాం కుదరకపోతే కోర్టు దాకా వెళతాం అని మల్లికా అంటుంది. మరి నీ సమాధానం చెప్పలేదు ఏంటి రామా అని వాళ్ళ నాన్నగారు అడుగుతారు. అందరికీ సమానంగా పంచల్సిందే అని రామ అంటాడు.
ఆస్తులు కాదురా బాధ్యతలు కూడా పంచుకోవాలి ముందు కోర్టుకు వెళ్తాను అన్న వాళ్లకు చెప్పు అని గోవిందరాజులు అంటాడు. విష్ణు మావయ్య గారు చెప్పిన మాటలు విన్నారుగా నువ్వు అఖిల్ ఒక నిర్ణయానికి వస్తే మనం కలిసి ఉండడమా విడిపోవడం అనేది తెలుస్తుంది అని జానకి అంటుంది.నేను మాట్లాడతాను నువ్వు విను నీకు నచ్చిన నచ్చకపోయినా నోరు మూసుకొని ఉండు అన్నయ్య నేను నీతో కలిసి చెల్లెలు పెళ్లి చేస్తాను నేను ఇంట్లో మనిషిని అనిలెక్కలు వేసుకోండి అని విష్ణు అంటాడు. నేను కూడా బాధ్యతలు పంచుకోవడానికి వెనకాడనమ్మ కాకపోతే ఇప్పటికిప్పుడు డబ్బులు పుట్టించడం కష్టమమ్మ ముందు నా దగ్గర ఉన్నది ఇస్తాను ఆ తరువాత మిగతాది సర్దుబాటు చేస్తాను అమ్మఅని అఖిల్ అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం