Janaki Kalaganaledu ఆగష్టు 18 ఎపిసోడ్ 661: పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్తే ఎవరైనా పుట్టింటిని మర్చిపోతారా అని వెన్నెల అంటుంది పెళ్లిఅయిన తరువాత అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్తలో మా అమ్మ మా అన్నయ్య అని మాట్లాడుతావు ఆ తర్వాత కొంతకాలానికి మా ఇంటికి వచ్చాక మా మామగారు మా అత్తగారు అని వాళ్ల కబుర్లే చెప్తావ్ నువ్వే కాదు ఏ ఆడపిల్ల అయినా అలాగే మాట్లాడుతుంది అని జానకి అంటుంది. మల్లికా వెన్నెలకి కాళ్లకు పసుపు పెట్టు అని జ్ఞానాంబ అంటుంది.తనకు పెట్టడం రాదు అమ్మ అని విష్ణు అంటాడు.

తనుకు రాకపోతే నేను నేర్పిస్తాను రా అమ్మ అని జ్ఞానాంబ తీసుకు వెళుతుంది.పువ్వులు ఉండాలి కదా ఎక్కడ అని జానకి వెతుకుతుంది. ఇక్కడ అడ్డంగా ఉన్నాయని మన గదిలో పెట్టాను అని రామా అంటాడు. అవునా అయితే ఉండండి తీసుకొస్తాను అని జానకివెళ్తుంది. రామా మగ పెళ్లి వారు బయలుదేరారో లేదో ఒకసారి కనుక్కో నాన్న అని జ్ఞానం ఉంటుంది. బయలుదేరారు అంట అమ్మ అని రామా అంటాడు. ఇంతలో జానకి ఫోన్ వస్తుంది నువ్వు త్వరగా బయలుదేరి ఆఫీసుకు రా అని అంటాడు సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని జానకి అంటుంది.

ఈ టైంలో ఎక్కడికమ్మ నువ్వే ఇంటికి పెద్ద కోడలివి ఈ టైంలో నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఎలా నువ్వు అయినా చెప్పు రామా అని జ్ఞానం ఉంటుంది. ఇంట్లో నేను ఎంత ముఖ్యమో అక్కడ కూడా నేను అంతే ముఖ్యం అత్తయ్య అని జానకి అంటుంది. నువ్వు ఇంట్లో ఉన్నంతవరకు రామా భార్య గానే ఉంటానని నాకు మాట ఇచ్చావు ఆ ఉగ్రవాదుల్ని తర్వాత అయినా పట్టుకోవచ్చు ఈ పెళ్లి ఇప్పుడు కాకపోతే తర్వాత చేయలేము అని జ్ఞానం బా అంటుంది. అది కాదు అత్తయ్య ఉగ్రవాదులు ఏం చేశారో మీకు తెలిస్తే మీరే నన్ను దగ్గరుండి పంపిస్తారు అని జానకి అంటుంది. అవునమ్మా జానకి గారు ఇక్కడ ఉండి పనిచేస్తున్నారు కానీ మనసంతా ఉగ్రవాదుల మీదే ఉంది అని రామ అంటాడు. నువ్వు కూడా తననే సమర్థిస్తున్నావా అని జ్ఞానాంబ అంటుంది.

సమర్ధించడం కాదమ్మా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అని రామ అంటాడు. మరి నేను ఎవరికి చెప్పుకోను పెద్ద కోడలు ఏది అని నన్ను అడుగుతారు అని జ్ఞానం గా ఉంటుంది. అది కాదమ్మా నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అని రామ అంటాడు. నాకు అదంతా ఏం తెలియదు ముహూర్త టైం కు జానకి ఇక్కడే ఉండాలి అలా అయితే వెళ్ళమను అని జ్ఞానాంబ అంటుంది. అలాగే అత్తయ్య ముహూర్త టైంకి వచ్చేస్తాను అని జానకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదిగో జ్ఞానం పెళ్లి వారు వచ్చారు అని గోవిందరాజులు అంటాడు. రండి కాళ్లు కడుక్కోండి అని రామా నీళ్లు ఇస్తాడు. కాళ్లు కడుక్కుంటూ కిషోర్ అటు ఇటు చూస్తాడు. ఎవరికోసం తమ్ముడు వెతుకుతున్నావు వెన్నెల ఇంక నీకు కనిపించదులే పెళ్లి పీటల మీదే కనబడుతుంది అని మల్లిక అంటుంది.

బావగారు జానకి అక్కగారు ఎక్కడా కనపడటం లేదు వెన్నెల దగ్గర ఉన్నారా అని కిషోర్ అడుగుతాడు. తను ఇంట్లో లేదు డ్యూటీకి వెళ్ళింది అని రామ అంటాడు. ఇంట్లో పెళ్లి పెట్టుకొని డ్యూటీ కి వెళ్లడం ఏంటి అని లీలావతి అంటుంది. ఈ విషయం మావాళ్లకి ఫోన్ చేసి చెప్పాలి అని కిషోర్ అనుకుంటాడు. ఏంటి బావగారు కంగారు పడుతున్నారు అని రామా అంటాడు. కట్ చేస్తే బావగారు కాఫీ తీసుకోండి అని విష్ణు అంటాడు. ఏం ఆలోచిస్తున్నావ్ రా కాఫీ తీసుకోరా కిషోర్ అని వాళ్ళ నాన్న గారు అంటాడు. నువ్వుండు నాన్న అని కిషోర్ అంటాడు. అదేంటి బావగారు అలా అంటారు అని రామ అంటాడు.
ఇవన్నీ నాకు మా నాన్నకి అలవాటే అని కిషోర్ అంటాడు. ఎక్కడికి బావగారు లేచారు వెన్నెల దగ్గరగా అని విష్ణు అంటాడు. కాదు నాకు వాష్ రూమ్ వస్తుంది అని కిషోర్ అంటాడు. ఒరేయ్ అఖిల్ బావ గారిని వాష్ రూమ్ తీసుకెళ్ళు అని గోవిందరాజులు అంటాడు.. ఇదే బావగారు వాష్ రూమ్ మీరు వెళ్ళండి అని అఖిల్ అంటాడు. సరేలే నేను వెళ్లి వస్తాను నువ్వు వెళ్ళు అని కిషోర్ వాళ్ల గ్యాంగ్ కి ఫోన్ చేస్తాడు వాళ్లు ఎంతకీ ఫోన్ ఎత్తడం లేదు ఏంటి ఫోన్ ఎత్తడం లేదు ఐ ఏసీబీ జానకి వచ్చేసరికి వెన్నెల మెడలో తాళి కట్టేయాలి తాళి కట్టేశాక వాళ్ళు ఏమీ చేయలేరు అని కిషోర్ అనుకుంటాడు. కట్ చేస్తే జానకి టెర్రరిస్టులు ఎక్కడ అని కానిస్టేబుల్ ని అడుగుతుంది. వాళ్ళు ఇక్కడే ఉన్నారు మేడం రండి అని కానిస్టేబుల్ అంటాడు. ఆ టెర్రరిస్టుల్ని చూసిన జానకి మీరు లొంగిపోండి నువ్వు ఇంకెక్కడికి తప్పించుకోలేవు అని జానకి అంటుంది. నేను లొంగిపోను అని టెర్రరిస్ట్ తనుకు తాను బుల్లెట్ పేల్చుకొని చచ్చిపోతాడు. చ చేసిందంతా వృధా అయిపోయింది ఈ బాడీని పోస్ట్ మర్డర్ కి పంపించండి అని జానకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

కట్ చేస్తే జానకి టెర్రరిస్ట్ ఫోన్లో తీసుకొని దీంట్లో ఎవరైనా నెంబర్లు ఉన్నాయా అని వెతుకుతుంది ఒక నెంబర్ నుంచి చానా సార్లు ఫోన్ వచ్చినట్టు ఉంది ఈ నెంబర్ ఎవరిదై ఉంటుంది అని చూస్తుందిఈ అది కిషోర్ నెంబర్ కదా అయితే టెర్రరిస్టులకి కిషోర్ కి ఏదో సంబంధం ఉంది ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అని జానకి అక్కడనుండి బయలుదేరుతుంది. కిషోర్ మళ్లీ టెర్రరిస్ట్ కి ఫోన్ ఫోన్ చేస్తాడు ఆ ఫోను ఎవరు ఎత్తకపోయేసరికి ఒకవేళ ఫోన్ ఎత్తడం లేదంటే ఫోన్ మా వాళ్ల దగ్గర లేదు అనుకుంటా నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు ఎంత తొందరగా బయట పెడితే అంత మంచిది లేదంటే జానకి వచ్చి నన్ను అరెస్టు చేస్తుంది కానీ నేను వెన్నెల మెడలో తాళి కడితే క్షేమంగా ఉంటాను ఉంటాను కదాఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెన్నెల మెడలో తాళి కట్టాలి అని కిషోర్ అనుకుంటాడు.
ఇంతలో రామ వచ్చి బావగారు ఇంకా మీరు బట్టలు మార్చుకోలేదా అని అడుగుతాడు.సరే నువ్వు వెళ్ళు నేను తొందరగా బట్టలు వేసుకొని వస్తాను అని కిషోర్ అంటాడు. ఒరే రామ బావగారు ఎక్కడరా ఇంకా రాలేదు అని గోవిందరాజులు అంటాడు. తను రెడీ అయి వస్తానన్నాడు నాన్నగారు అని రామా అంటాడు. కట్ చేస్తే జానకి పెళ్లి ని ఎలాగైనా ఆపాలి తొందరగా పోనీ అని డ్రైవర్ని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్లీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం