Janaki Kalaganaledu ఆగస్టు 19 ఎపిసోడ్ 662: రామా దగ్గరుండి జానకిని పంపించాడు ఇప్పుడు చూడండి ఏమైంది అని జ్ఞానంబ అంటుంది. జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు, నువ్వు గట్టిగా మాట్లాడితే రామా బాధపడతాడు అని గోవిందరాజు అంటాడు. అంతేలే నాకు బాధ సంగతి మాత్రం ఎవరికీ పట్టదు అనే జ్ఞానంబ అంటుంది. ఇంతలో జానకి ఫోన్ చేస్తుంది రామా కి. నేను మాట్లాడతాను అని జ్ఞానంబ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తుంది, అత్తయ్య గారు రామా గారు లేరా అని జానకి అంటుంది, ఏ నాతో మాట్లాడవా ఏంటమ్మా ఇది ముహూర్తం టైం వరకు వస్తానని చెప్పావు ఇంకా రాకపోతే ఎలా చెప్పు నువ్వు లేకపోతే ఇల్లు ఎంత బోసిగా ఉందో తెలుసా,అసలు బాలేదు జానకి ప్రతి వాళ్లు నిన్ను వెతికే వాళ్లే ఎక్కడున్నావు నేనైతే నీ గురించి ఆలోచిస్తున్నాను వెంటనే బయలుదేరి వచ్చేయ్ అని జ్ఞానంబ అంటుంది.

దారిలో ఉన్న అత్తయ్య గారు వచ్చేస్తున్నా అని జానకి అంటుంది.ఈ పెళ్లి జరగకూడదు అత్తయ్య అని జానకి విషయం అంత చెప్తుంది. అంటే మా ఇంట్లో ఉన్నవాడు ఉగ్రవాదా అని జ్ఞానంబ అంటుంది. అవును అత్తయ్య గారు మీరు ఎలాగైనా పెళ్లి జరగకుండా చూడండి అని జానకి చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఈ దరిద్రుడు ఎం చేస్తున్నాడో ఏంటో అని జ్ఞానంబ అనుకుంటుంది.

కట్ చేస్తే, కిషోర్ వాళ్ళ మనుషలకి ఫోన్ చేసి మాట్లాడుతాడు,సలీం గాడు నాకు ఫోన్ చేసాడు జానకి ఎటాక్ చేయడానికి వచ్చింది అని చెప్పాను జానకి అక్కడికి వెళ్లిందా నేను ఉగ్రవాదిని అని తెలిసిపోయిందా అని చెప్తుండగా జ్ఞానంబ అక్కడికి వస్తుంది, మొత్తం వినేశావా అని అడుగుతాడు, ఇంత నమ్మకం ద్రోహం చేస్తావా, వెన్నెలని మోసం చేస్తావా అని కొడ్తుంది, కిషోర్ పక్కన ఉన్న రాయి తీస్కొని కిషోర్ తలపైన కొడతాడు, జ్ఞానంబ పడిపోతుంది. కట్ చేస్తే, పెళ్లి పీఠల మీద కూర్చొని ఉంటారు, ఇంతలో పూజారి గారు గోవిందురాజుని జ్ఞానంబ ని పిలుస్తారు, కాని జ్ఞానంబ కనపడలేదు అని వెతుకుతారు. అత్తయ్య లేకుండా తాళి ఎలా కట్టిస్తాము అని మల్లిక అంటుంది.

పంతులు గారు ముహూర్తం దాటి పోతున్నట్టుంది అని కిషోర్ అంటాడు. తాళి కట్టించేయండి అని అంటాడు. పంతులు గారు మీరు అయితే పెళ్లి కానివ్వండి అంటాడు గోవిందరాజు. తాళి కట్టే టైం కి జానకి వచ్చి ఈ పెళ్లి ఆపండి అని అంటుంది. ఎందుకు వదిన పెళ్లి ఆపావు కిషోర్ ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఈ కిషోర్ ఒక ఉగ్రవాది ఎన్నో ఏళ్ళ గా వెతుకుతున్నది వీడి కోసమే అని అంటుంది జానకి. వెన్నెల నన్ను మోసం చేస్తావా అని కొడుతోంది నువ్వు వచ్చి పెళ్లి ఆపక పొతే నా జీవితం నాశనం అయిపోయేది అని అంటుంది.జ్ఞానంబ అక్కడికి వస్తుంది,నీకోసం మొత్తం వెతికాము అమ్మ నువ్వు కనపడలేదని కంగారు పడ్డాం అని రామ అంటాడు.జానకి వాడిని తీసుకొని వెళుతుంది.

ఈరోజు మన ఆత్రేయపురం ప్రజలకి పండుగ చాలా కాలంగా మన జిల్లాని ఉగ్రవాదుల బెడద పీడుస్తుంది, కానీ జానకి ఐపీఎస్ వచ్చాకే ఆ ప్రయత్నాలు ఫలించాయి ఒక విధంగా ఈ క్రెడిట్ మొత్తం ఆమెదే ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి వాళ్లను మట్టు పెట్టిన జానకి ఐపీఎస్ సాహసానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ప్రేవరీ అవార్డ్ ప్రకటించింది, ఈ జిల్లా ఎస్పీగా జానకి ఐపీఎస్ తో పని చేయడం నాకు గర్వంగా ఉంది, జానకి కుటుంబాన్ని కూడా సభాముఖంగా స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అని ఎస్పీ అంటాడు. సభాముఖంగా ఈ ప్రపంచానికి నేను ఒకటి చెప్పాలనుకున్నాను, నన్ను ఇప్పటికీ అందరూ జానికి భర్తగా గుర్తిస్తేనే సంతోషపడతాను అని రామా చెప్తాడు.

నిన్ను నేను పొగడానికి రాలేదమ్మా నాకు అంత శక్తి లేదు పైగా మాటలు కూడా సరిపోవు కేవలం నిన్ను దీవించడానికి మాత్రమే వచ్చాను అని గోవిందరాజు చెప్పి వెళ్ళిపోతాడు. నేనెప్పుడూ కొడుకు పక్షపాతి గాని ఆలోచించాను కానీ కోడల్ని బాధ పెడుతున్నానా అని ఆలోచించలేదు చదువుకో లేని కోడలు కావాలనుకున్నాను నా కోడలు జీవితం నా కొడుక్కి నా కుటుంబానికి అంకితం ఇవ్వాలి అనుకున్నాను జానకి ఆశలను ఆశయాలను నేను పట్టించుకోలేదు అలా పంజరంలో బంధించిన తన గొప్పతనం ఏంటో లోకానికి తెలిసేలా చేసింది నీ కాళ్లకు సంకెళ్లు వేసినందుకు నన్ను క్షమించు, నేను మిమ్మల్ని కోరేది ఒకటే కూతురైన కోడలైనా వాళ్లకి ఇచ్చే స్వేచ్ఛ వాళ్లకి ఇవ్వండి ఇష్టపడ్డ ఉద్యోగం చేసుకోనివ్వండి వాళ్ళ చదువు వాళ్ళని చదువుకోనివ్వండి వాళ్లని కూడా జాతి రత్నాలుగా ఎదగనివ్వండి అని జ్ఞానంబ చెప్తుంది. కుటుంబమా ఐపీఎస్ ఉద్యోగమా అని అడిగితే రెండు రెండు కళ్ళని చెప్తాను, నాకు నా కుటుంబమే ప్రాణం అని జానకి అంటుంది.