Janaki Kalaganaledu: కొద్దిరోజుల పాటు నేను జాగ్రత్తగా ఉండాలి నన్ను పట్టుకోడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇలా అనుకుంటూ ఒక వృద్ధుడిని గుద్దేసి వెళ్లిపోతాడు కిషోర్. అది రామా చూసి ఆ పెద్దాయనని లేపి కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. కట్ చేస్తే వెన్నెల కంగారు పడుతూ ఉంటుంది పెద్ద వదిన ఇంకా రాలేదు ఏంటి కిషోర్ ని కలిసిందో లేదో అని అనుకుంటుంది. అలా అనుకుంటుండగానే జానకి వచ్చేస్తుంది.వదిన పొద్దున్నుండి మనసు మనసులా లేదు.కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్లావు ఏ సంగతి నాకు ఏం చెప్పలేదు అని అంటుంది వెన్నెల. పొద్దున్నుండి ఒక ఇంపార్టెంట్ కేసులో ఉన్నాను వెన్నెల నీకు ఫోన్ చేయడానికి కూడా కుదరలేదు అని జానకి అంటుంది. ఇంతకీ నీకు కిషోర్ నచ్చాడా లేదా వదిన. బుద్ధిమంతుడు ఎవరికి నచ్చకుండా ఉంటాడమ్మా. ఇప్పుడు నా టెన్షన్ తగ్గింది అని వెన్నెలా అంటుంది.

ఒకవేళ నచ్చకపోయి ఉంటే ఏం చేసేదానివి. నేను అంత దూరం ఆలోచించలేదు వదిన ఇప్పుడు ఆలోచించడానికి కూడా భయమేస్తుంది. ఆలోచించాల్సిన అవసరం లేదు కిషోర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా పద్ధతిగా మాట్లాడారు. మరింకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి నాన్నగారితో చెప్పొచ్చుగా. ఇప్పటికిప్పుడు చెప్పేసి రేపటికి పెళ్లి ముహూర్తాలు పెట్టించేయమంటావా పిల్ల ఎవ్వారం భలే స్పీడ్ గా ఉందే అని అంటుంది జానకి. అలా ఏం లేదు వదిన. ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నాను రేపు ఉదయం తప్పకుండా మాట్లాడుతాను. వదిన అన్నయ్యకి ఇప్పుడే ప్రేమ సంగతి చెప్పొద్దు కోప్పడతాడు అని వెన్నెల అంటుంది. రామ వచ్చి ఏంటి సంగతి అండి అని అడుగుతాడు ఈ మధ్య వదిన మరదలు ఎప్పుడు చూసిన చెవులు కొరుక్కుంటూ ఉన్నారు నాకు కూడా చెప్పొచ్చుగా అని అంటాడు.

పైకి చెప్పేది అయితే చెవులు ఎందుకు కోరుకుంటాం అని జానకి అంటుంది. చెప్పడానికి ఏం లేదు అన్నయ్య అంటుంది వెన్నెల. లేదు వెన్నెల అబద్ధం చెప్తుంది అని జానకి అంటుంది. రామా గారు మీతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా. లేదు అని రామా అంటాడు. చూసావా నాకు అబద్ధం చెప్పే అలవాటు అస్సలు లేదు అని అంటుంది జానకి. మరి మీ ఇద్దరు ఏమనుకున్నారు నిజం చెప్పొచ్చు కదా. చెప్పొద్దు అంటూ వెన్నెల మాట తీసుకుంది. వదిన ఏంటి ఇలా ఏడిపిస్తుంది అని వెన్నెల తనలో తను అనుకుంటుంది. ఈ వరుస చూస్తే ఏదో చాలా సీరియస్ విషయమే అనిపిస్తుంది. అవును సీరియస్ విషయమే కానీ చెప్పాల్సింది నేను కాదు వెన్నెలే. వదిన ఏంటిది అంటుంది వెన్నెల. జానకి నవ్వుకుంటూ వెన్నెల ఆడది ముందు పుట్టి అనుమానం తర్వాత పుట్టింది అన్నది కాదు సామెత దాన్ని మార్చేద్దాం అనుమానం ముందు పుట్టి తర్వాత మీ అన్నయ్య పుట్టాడు లేకపోతే ఏంటి రామ గారు మేము ఏదో సరదాగా మాట్లాడుకుంటుంటే మీ అనుమానాలు ఏంటి.

ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మీరు మాట్లాడుకోండి అని వెన్నెల వెళ్ళిపోతుంది. ఇప్పుడే రావడం అని రామా అడుగుతాడు. సరే రామా గారు లోపలికి వెళ్దాం రండి అని వెళ్తారు.కట్ చేస్తే జానకి దేవుడికి దండం పెట్టుకుంటుంది. వెన్నెల వచ్చి వదిన అమ్మా నాన్న పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారు అంటుంది. ఇంతలో జ్ఞానంబ తన భర్త హాల్లోకి వస్తారు. జానకి వాళ్ళ దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు మీ చీర బాగుంది అంటుంది. అంటే నా పంచ బాలేదా అని అంటాడు వాళ్ల భర్త.

జానకి ఏమైనా చెప్పాలా అని జ్ఞానం కూడా అడుగుతుంది. మా దగ్గర మొహమాటం ఎందుకు. ఏమీ లేదు వెన్నెల పెళ్లి గురించి. ఈ ఇంటి కోడలు అనిపించావమ్మా ఆడపడుచు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చావు. ఇంతలో పెళ్లి వారు వస్తారు. తను మా పెద్ద కోడలు నా తరువాత తనే పెద్దదిక్కు అంటుంది జ్ఞానంబ. అమ్మ ఇప్పటిదాకా జ్ఞానంభకు అన్న వదినలమే ఇక ముందు కాబోయే వియ్యాలవారం. వెన్నెల ఒకసారి ఇలా రా అని జ్ఞానంబ పిలుస్తుంది. వెన్నెల నీకు కాబోయే మొగుడు బుద్ధిమంతుడు అమ్మ బాగా చదువుకున్నాడు.

పైగా ఈడు జోడు అని అంటుంది జ్ఞానంబ. మా వాడితో మాట్లాడతావా ఫోన్ చేసి ఇవ్వనా అమ్మ అంటాడు. ఇప్పుడు కాదు అని వెళ్ళిపోతుంది వెన్నెల. జానకి కొంచెం కాఫీలా సంగతి చూడమ్మా అంటుంది జ్ఞానాంబ. వెన్నెల పక్కకు వచ్చి ఏడుస్తుంది. వెన్నెల తప్పు ఏడవకూడదు అని జానకి అంటుంది. ఇక నా జీవితంలో మిగిలింది ఏడుపే పెద్ద వదిన అంటుంది. వెన్నెల ఇంకా పెళ్లి మాటలు దాకా రాలేదు.రాకపోవడం ఏంటి చిన్నప్పటినుంచి అనుకుంటున్నారు అంట కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు ఇష్టమో కాదో కనుక్కోక్కర్లేదా నా పెళ్ళికి నాకు సంబంధం లేదా. నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నా మాట విను. ఎందుకు వదిన ఈ ఓదార్పు మాటలు అది జరగదు నాకు తెలుసు. అయితే వెంటనే వెళ్లి పెళ్లి వెన్నెల కి ఇష్టం లేదు పెళ్లి చేసుకోదంట అని మా అమ్మకి చెప్పు.

అప్పుడు నీ మాటల్లో నిజాయితీ ఉందని నమ్ముతా.వాళ్ల ముందు ఈ మాట చెప్తే అత్తయ్య పంతానికి పోతుంది. నా శవానికి తాళి కట్టించుకోమను తన పంతం నెగ్గించుకోమను.వాళ్ళు రాకముందుకు అత్తయ్య వాళ్ళకి చెప్పి ఉంటే పరిస్థితి వేరే లాగా ఉండేది. నువ్విలా ముడుచుకొని ఉంటే అమ్మకి కోపం వస్తుంది. వాళ్లు వెళ్లే వరకైనా నార్మల్ గా ఉండు. కళ్ళు తుడుచుకొని బయటికి రా. ఇంతలో రామ వచ్చి వెన్నెల ఎక్కడ అని అడుగుతాడు. తనని కూడా ఒక మాట అడగాలి కదా. సుధీర్ తో మాట్లాడతావ అంటే ఇందాకే సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది అని అంటుంది జ్ఞానంబ. జానకి వెన్నెల వస్తారు. సరే అమ్మ మేం వెళ్తాము అని జ్ఞానంబ వాళ్ళ అన్నయ్య అంటాడు. సరే అని పంపడానికి వెళుతుంది జ్ఞానంబ. వెన్నెల వెళ్ళిపోతుంది అక్కడ నుండి