Janaki Kalaganaledu ఆగస్టు 8 ఎపిసోడ్ 653: అమ్మా జానకి, లోపలికి రావచ్చా… అని జానకి వాళ్ళ మామయ్య గారు అడుగుతారు.అయ్యో అదేంటి మావయ్య రండి అని జానకి అంటుంది.ఆ ఇంటికి ఇస్తే వెన్నెల సుఖ పడుతుంది చాలా మంచి సంబంధం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న సంబంధం అని వాళ్ళ మామయ్య గారు అంటారు.సుఖం సంతోషం అంటే ఏంటి మామయ్య గారు అది శరీరానికి సంబంధించిందా మనసుకు సంబంధించిందా అని జానకి అడుగుతుంది.అంటే ఇప్పుడు నేను చూసిన సంబంధం చేసుకుంటే వెన్నెల సుఖ పడదంటావా అని వాళ్ళ మామయ్య గారు అంటారు.ఈపాటికి మీకు అర్థమై ఉండాలి మామయ్య గారు అని జానకి అంటుంది.

అనుమానం వచ్చే నిన్ను అడగాలని వచ్చానమ్మా సంబంధం గురించి మాట్లాడుతుంటే వెన్నెల మొహం ముడుచుకొని వెళ్లిపోయింది నువ్వు కూడా అదోలా ఉన్నావు వచ్చింది జ్ఞానాంబ తరపున వాళ్లు వాళ్లే ఏరి కోరి చేసుకుంటామని వచ్చారు అని వాళ్ళ మామయ్య గారు అంటారు.కానీ మావయ్య గారు వెన్నెల కోరుకున్నది వేరొకరిని తను కోరుకున్న వాడితోనే తన జీవితం సంతోషంగా ఉంటుందని వెన్నెల అనుకుంటుంది ఈ విషయం చెబుదామని ఇంతకు ముందు నేను మీ గదిలోకి వచ్చాను నాకు అవకాశం దొరకలేదు అని జానకి అంటుంది.వెన్నెల ఇంత పెద్దది అయిందా మన అవసరం మన ప్రేమ ఏం లేకుండానే తన జీవిత భాగస్వామిని ఎంచుకుందా అని వాళ్ళ మామయ్య గారు అంటారు వెన్నెల ఎంపికని అనుమాన పడుతున్నారా అని జానకి వాళ్ళ మామయ్య గారిని అడిగింది.

ప్రేమ పెళ్లిళ్లు మీ అత్తయ్యకు అసలు నచ్చవు నీకు తెలిసిన విషయమే కదా అని వాళ్ళ మామయ్య గారు అంటాడు.ఇప్పుడు మనం చేయాల్సింది ఎదురయ్యే సమస్యలకు ఎదురుకోవడం మామయ్య వెన్నెల ప్రేమించిన వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాళ్లతో మాట్లాడాను మంచివాళ్లు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన పని లేదు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తాడు జాబ్ చేయడం అతనికి ఇష్టం లేదు సంఘ సేవకుడు ఆ విషయంలో నాకు బాగా నచ్చాడు సంఘాన్ని సంఘంలో ప్రజల్ని ప్రేమించేవాడు భార్యని ప్రేమిస్తాడు అని జానకి వాళ్ళ మామయ్య గారితో అంటుంది.

,
కానీ జీవనాధారం ఏదమ్మా అని వాళ్ళ మామయ్య గారు జానకిని అడుగుతాడు.వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ చేయాలని ప్లాన్ లో ఉన్నాడట ఇప్పుడు వెన్నెల సంతోషం మీ చేతుల్లోనే ఉంది మామయ్య గారు ప్రేమ విషయం బయటపడకుండా ఈ సంబంధం గురించి మీరే అందరిని ఒప్పించాలి అని జానకి అంటుంది.నా ప్రయత్నం నేను చేస్తాను ఆపైన వెన్నెల అదృష్టం అని వాళ్ళ మామయ్య గారు వెళ్ళిపోతారు.కట్ చేస్తే జ్ఞానాంబని ఎలా ఒప్పించాల అని వాళ్ళ ఆయన ఆలోచిస్తూ జ్ఞానం దగ్గరికి వస్తాడు.ఎక్కడికి వెళ్లారండి చూస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది అని జ్ఞానాంబ అంటుంది.అది కాదు జ్ఞానం ఇది ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న సంబంధం అని వాళ్ళ ఆయన అంటాడు.

అదేంటి కొత్తగా మాట్లాడుతున్నారు ఇది ఎప్పటినుంచి అనుకుంటున్న సంబంధం ముందు పంతులు గారికి ఫోన్ చేయండి మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం అని జ్ఞానంబ అంటుంది. అది కాదు జ్ఞానం నాకు తెలిసిన వాళ్ళు ఒక మంచి సంబంధం గురించి చెప్పమని అడిగాను వాళ్ళకి అక్కా చెల్లెలు లేరట బాగుంటుంది అని వాళ్ళ ఆయన అంటారు.అది సరేనండీ మా వాళ్లకి ఏం చెప్తారు తాంబూలాలు దాకా వెళ్ళాము అని జ్ఞానం అంటుంది.ఆ సంగతి నేను చూసుకుంటాలే జ్ఞానం అని వాళ్ళ ఆయన అంటాడు.అది కాదండి రామాకి జానకికి కూడా ఒక మాట చెప్పాలి కదా అని జ్ఞానం అంటుంది.వెన్నెల సంతోషం కోసం అంటే ఎవరు మాత్రం ఒప్పుకోరు చెప్పు ముందు నువ్వు చెప్పు అని జ్ఞానాంబ వాళ్ళ ఆయన అంటాడు.బాధ్యతలు అన్ని భుజాన వేసుకుంటానంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను నేను వెన్నెలకు అమ్మనండి శత్రువుని కాదు కదా అని జ్ఞానంబ అంటుంది.ఆ మాట అన్నావు బాగుంది రేపే మగ పెళ్లి వాళ్ళని ఇంటికి రమ్మని చెబుతాను అని వాళ్ళ ఆయన అంటాడు.వచ్చే సంబంధం అందరికీ నచ్చి సరే అంటేనే పెళ్లి కుదురుతుంది లేకపోతే క్యాన్సిల్ అని జ్ఞానాంబ అంటుంది.సరే జ్ఞానం అని వాళ్ళ ఆయన వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే మీ అత్తయ్యను ఎలాగో అలా పెళ్లికి ఒప్పించాను కానీ వెన్నెలకి ఏదైనా జరిగితే మీ అత్తయ్య నాకు చేస్తుంది పెళ్లి అని వాళ్ళ మామయ్య గారు అంటారు.ఆ విషయంలో నాది గ్యారెంటీ మామయ్య గారు అని జానకి అంటుంది.అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని జానకిని వాళ్ళ మామయ్య గారు అడుగుతారు.ఈరోజు వాళ అమ్మ నాన్నని పిలిపిద్దాం అని జానకి అంటుంది.సరే అమ్మ అలాగే చేద్దాం అని వాళ్ళ మామయ్య గారు వెళ్ళిపోతారు.ఆ మాటలు విన్న వెన్నెల థాంక్స్ వదినా అని చెబుతోంది సరేలే పెళ్లి కొడుకు వాళ్ళని ఇక్కడికి రమ్మందాం ఫోన్ చెయ్ అని జానకి అంటుంది.

వెన్నెల కిషోర్ కి ఫోన్ చేస్తుంది కిషోర్ ఫోన్ ఎత్తి హాయ్ స్వీట్ హార్ట్ అని అంటాడు ఇది వెన్నెల కాదండి నేను వాళ్ళ వదినను అని జానకి అంటుంది సారీ సిస్టర్ నేను వెన్నెల అనుకున్నాను అని కిషోర్ అంటాడు నేను ఫోన్ చేసే లోపే నీకు కాబోయే భార్య తన ఫోన్లో నుంచి ఫోన్ చేసింది రేపు మా ఇంటికి పెళ్లి వారిలా కాకుండా తెలిసిన వారిలా రండి అని జానకి చెబుతుంది.సరే సిస్టర్ అని ఫోన్ కట్ చేస్తాడు కిషోర్. కట్ చేస్తే పెళ్లి వారి కోసం జానకి వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో పెళ్ళికొడుకు వాళ్లు రానే వచ్చేస్తారు రండి రండి ఇదేనండి మా ఇల్లు అని వెన్నెల వాళ్ళ నాన్న గారు అంటాడు.
జ్ఞానాంబ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది అబ్బాయి ఎంత వరకు చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు అని జ్ఞానం అడుగుతుంది.మా అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు కానీ అది మానేసి బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాడు అని వాళ్ళ అమ్మ అంటుంది.మా అమ్మాయి గురించి మీరు ఏమైనా
తెలుసుకోవాలనుకుంటున్నారా అని జ్ఞానంబ అడుగుతుంది .అదేంటమ్మా అన్ని తెలిసిన విషయాలే కదా అని కిషోర్ వాళ్ళ డాడీ అంటారు.అదేంటి అన్ని తెలిసిన విషయాలేనా అని జ్ఞానం షాక్ అవుతుంది.దీంతో ఈరోజు ఎపిసోడ్ మూవ్ వస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం