Janaki Kalaganaledu ఆగస్టు 17 ఎపిసోడ్ 660: డబ్బు ఇవ్వడం కంటే నీ నోటి వెంట ఈ మాట వినడం చాలా సంతోషంగా అనిపిస్తుంది రా అని జ్ఞానాంబ అనడం తో మొదలవుతింది జానకి కలగనలేదు ఈ రోజు ఎపిసోడ్. నాన్న ఇంకా మన మధ్య ఆ గీత కనిపిస్తుందా అని రామా అంటాడు.మీ మధ్య మార్పు వస్తుందని నేను అనుకోలేదురా ఇలా జరగడానికి ఆ భగవంతుడే కారణం అయి ఉండాలి అని గోవిందరాజులు అంటాడు.దేవుడే ఎందుకు కావాలి దేవత ఎందుకు కాకూడదు అని రామ అంటాడు. అమ్మ జానకి ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

నాదేముంది అత్తయ్య వాళ్ళ మనసులో కలిసి ఉండాలని ఉండకపోతే నేను ఎంత చెప్పినా వినే వాళ్ళు కాదు కదా అని జానకి అంటుంది.కట్ చేస్తే మల్లిక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని వాళ్ళ ఆయనతో అంటుంది అని బట్టలు సర్దుకుంటుంది… నేను పుట్టింటికి వెళ్ళి పోతున్నాను మళ్ళీ తిరిగి రాను అని మల్లిక అంటుంది.అబ్బా నీ జీవితంలో ఒక మంచి మాట చెప్పావే అని వాళ్ళ ఆయన అంటాడు.నేనేమీ పరాశకం ఆడట్లేదు నిజంగానే వెళ్ళిపోతున్నాను అని మల్లిక అంటుంది.

చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తావ్ నాకేమైనా చెవుడా కానీ ఒకటి నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు మనసు మార్చుకొని వద్దామనుకున్నా నేను రానివ్వను గుమ్మం దగ్గరే కాలు విరగగొడతా అని విష్ణు అంటాడు.నా కాలు ఎందుకు విర గొడతారు అవి ఏమైనా మంచం కోళ్లు అనుకుంటున్నారా అయినా పెళ్ళానికి ఎదురు తిరుగుతున్నారేంటి ఇంకా ఇంతేనా మీకు పెళ్ళాం వద్ద అని మల్లిక అంటుంది.పెళ్ళాం కావాలి కానీ నీలాంటి పెళ్ళాం కాదు నా వెనకాలే నేను చెప్పింది విని తిరిగే పెళ్ళాం కావాలి నేను ఏం చెప్పినా సరే అని చంకన ఎత్తుకునే పెళ్ళాం… నేను ముందు నడుస్తుంటే నా వెనకాలే వచ్చే పెళ్ళాం, నాకు సేవలు చేసే పెళ్ళాం, మా అమ్మ నాన్న దగ్గర ఎదురు మాట్లాడకుండా ఉండే పెళ్ళాం నాకు కావాలి అని విష్ణు అంటాడు.మీకు పెళ్ళాం కాదు కావలసింది పెంపుడు కుక్క అని మల్లిక అంటుంది.

చూడు ఇక నుంచి నేను మొగుడు లాగ కాదు మగాడిలా ఉండాలనుకుంటున్నాను నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళు అని విష్ణు అంటాడు. ఒరేయ్ దేవుడా ఏంటి ఇలా జరుగుతుంది నా మొగుడే నా మాట వినకపోతే ఇక మలయాళం కూడా నాకు ఎదురు తిరుగుతాడు అనుకుంటూ మల్లిక ఏడుస్తుంది.కట్ చేస్తే నేను కిషోర్ ఎవరికో ఫోన్ చేసి నేను చెప్పేది జాగ్రత్తగా విను పోలీసులకి మన గురించి తెలిసిపోయినట్టుంది అలర్ట్ గా ఉండు టీమ్స్ గా ఫామ్ అయ్యి ఆపరేషన్ మొదలుపెట్టారు ఇంతకు ముందే మీటింగ్ కూడా జరిగింది జానకి దగ్గర మనకు సంబంధించిన ఫైల్ ఉంది దాన్ని నేను సంపాదించి తీసుకొస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు కిషోర్.కట్ చేస్తే జానకి గారు చేయాల్సిన పెళ్లి పనులు చాలా ఉన్నాయండి మీరు ఉంటే గాని నాకు అడుగు ముందు పడదు మీరేమో ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నారు ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి గంట అయింది అని రామ అంటాడు.

రామ గారు ఎందుకు టెన్షన్ గా ఉన్నారు అని జానకి అడిగింది.వారం రోజుల్లో పెళ్లి అండి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి కంగారు పడకుండా ఎలా ఉంటాం అని రామ అంటాడు.రామ గారు నాకు ఆ విషయం తెలుసండి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి పెళ్లి పనులన్నీ పూర్తయ్యే వరకు మీరు నాకు నాలుగడుగుల దూరంలో ఉండాలి అని జానకి అంటుంది. అంతేనా అవేంటండీ పెళ్ళికొడుకుల ఫోటోల్లా ఉన్నాయి అని రామ అంటాడు.నేను వెన్నెలకి ఉగ్రవాదులతో పెళ్లి చేస్తానా ఇవి టెర్రరిస్ట్ ఫోటోలు కానీ ఒక్క టెర్రరిస్ట్ ఫోటో మాత్రం ఇందులో లేదు అని జానకి అంటుంది.కానీ వాడు దొరుకుతాడు అని అంటారా అని రామా అంటాడు .కచ్చితంగా దొరుకుతాడు ఇలాంటి టాటూ వాడి గుండె మీద కూడా ఉంటుంది దీన్ని ఆధారంగా చేసుకొని వాడిని పట్టుకోవాలి ఇంకో ఆధారం లేదు అని జానకి అంటుంది.మీరు చెప్పింది నిజమేనండి పైకి మీరు ప్రశాంతంగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవాలని టెన్షన్తో ఉన్నారు తెలియక మాట జారేసానండి నాకు కూడా మీరు శిక్ష వేస్తారా అని రామ అంటాడు.

వేయాల్సిందేగా మరి మీరు నాలుగు అడుగుల దూరంలో ఉండడమే మీకు శిక్ష అది సరే రామ గారు ఏం చేయాలో మీరు చెప్పండి అని జానకి అంటుంది. కట్ చేస్తే కిషోర్ జానకి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఫైల్ ఎలాగైనా కొట్టేయాలి అని జానకి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి జానకి గారు పడుకొని ఉన్న రూంలోకి వెళ్లి ఆ ఫైల్ ఇదే నాకు కావాలి అని ఫైలు తీసే ప్రయత్నంలో ఆ ఫైలు జారీ కింద పడుతుంది ఇంతలో జానకికి మెలకువ వస్తుంది ఏ ఆగు అని అంటుంది జానకి కిషోర్ వెనకకు తిరిగి చూస్తాడు మీరా కిషోర్ ఇంత రాత్రిపూట రావలసిన అవసరం ఏముంది అని జానకి అడిగింది.అది వెన్నెల కోసం అండి అని కిషోర్ అంటాడు.

అయినా ఈ టైంలో వెన్నెల కోసం రావడం ఏంటి ఇంట్లో వాళ్లకి తెలిస్తే మీ పెళ్లి ఆగిపోతుంది మీరిద్దరు ప్రేమించుకున్న సంగతి ఇంట్లో వాళ్లకి తెలియదు ఇప్పుడు అత్తయ్య గారు నిన్ను చూస్తే ఏం జరుగుతుందో తెలుసా త్వరగా వెళ్లిపో కిషోర్ అని జానకి అంటుంది.సరే అని కిషోర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.జానకి అక్కడ నుండి తన రూమ్ లోకి వస్తుంది అక్కడ ఫైల్ పడిపోయి ఉంటుంది ఇదేంటి ఫైలు కింద పడిపోయింది అని తీసి టేబుల్ మీద పెట్టి తను వెళ్లి పడుకుంటుంది.కట్ చేస్తే బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాను పోనీలే నేను తప్పించుకొని బయటపడ్డాను నేనే తను వెతుకుతున్న ఉగ్రవాదిని జానకికి తెలిసిపోయి ఉంటే అమ్మో నా కథ ఇక్కడితో ముగిసిపోయి ఉండేది జాగ్రత్తగా ఉండాలి మా వాళ్ళందర్నీ అలర్ట్ చేయాలి అని కిషోర్ అనుకుంటాడు.

కట్ చేస్తే అబ్బో అందరూ ఇక్కడే ఉన్నారా పెళ్లి పనులు కానివ్వండి అని గోవిందరాజులు అంటాడు.మేము అందరం పెళ్లి పనులు చేస్తున్న వెన్నెల మాత్రం వాళ్ళ అత్తగారి మీదే ఉంటుంది మామయ్య గారు అని జెస్సి అంటుంది.పెళ్లి కాకముందు మీరు కూడా అలాగే ఉండుంటారులే మాకేం తెలుసు అని జ్ఞానంబ అంటుంది.మేము ఏమి మరి అలా అనుకోలేదులే అత్తయ్య అని జెస్సి అంటుంది.ఇప్పుడు అదంతా ఎందుకు ముందు అన్నయ్యని అడిగి తెలుసుకుందాం చిన్నన్నయ్య నువ్వు చెప్పు అని వెన్నెల అంటుంది.ఇంతలో మలయాళం కాఫీ తీసుకొచ్చి తాగండి పెద్దయ్య గారు అని గోవిందరాజుకి ఇస్తాడు.అదేంట్రా నీ మొహం అలా పెట్టావు అని గోవిందరాజులు అంటాడు.ఏమీ లేదు నాన్న వాడికి పెళ్లి కావాలంట మొన్నే ఒక పూజారి గారికి చూపించాను కానీ వీడికి నలుగురు పిల్లలు అంట అని రామ అంటాడు.

అయ్య బాబోయ్ ముందే నేను పెళ్లి కాక చస్తున్నాను. ఇలాంటివన్నీ ప్రచారం చేస్తే నాకు పిల్లని ఎవరు ఇయ్యరు అయ్యా అని మలయాళం తల కొట్టుకుంటాడు.ఊరుకోరా వాళ్ళు ఏదో సరదాకి అంటున్నారు వెన్నెల పెళ్లి అయిపోగానే నీకు కూడా పెళ్లి చేసేస్తాం అని జ్ఞానాంబ అంటుంది. అమ్మ కిషోర్ వాళ్ళ ఇంట్లో మంగళ స్నానాలు మొదలు పెట్టారంట అని వెన్నెల అంటుంది.మాకు కదా చెప్పాల్సింది అని జ్ఞానాంబ అంటుంది.ఎవరో ఒకరికి చెప్పారు కదా అమ్మ మనం మొదలు పెడదాం పదండి అని రామా అంటాడు. కట్ చేస్తే ఏంటి వెన్నెల్ని పెళ్లికూతురు చేస్తున్నారా అని జెస్సి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది.వదిన నా ఫోన్ నాకు ఇచ్చేయ్ అని వెన్నెల అడుగుతుంది.ఎలాగో పెళ్లయిన తర్వాత మమ్మల్ని మర్చిపోతావ్ కదా కొద్ది రోజులైనా మాతో మాట్లాడు అని విష్ణు అంటాడు.చూశారా నాన్న అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు అని వెన్నెల అంటుంది.దాన్ని అలా ఏడిపించకండిరా అని జ్ఞానాంబ అంటుంది. ఇన్ని రోజులు మీ మధ్య పెరిగి అత్తారింటికి వెళ్ళగానే ఎలా మర్చిపోతాను అని వెన్నెల అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం.