ఆ రూమ‌ర్ నిజ‌మైతే తనంత అదృష్టవంతురాలు ఉండ‌రంటున్న జాన్వీ!

Share

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె అయిన జాన్వీ క‌పూర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` అనే హిందీ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్ప‌టి నుండో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయే `ఎన్టీఆర్ 30`లో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా ఎంపిక అయింద‌ని.. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంద‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఈ వార్త‌ల‌ను జాన్వీ తండ్రి, బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ కపూర్ ఇప్ప‌టికే ఖండించారు.

విజ‌య్ దేర‌కొండ‌తో డేటింగ్ చేస్తాన‌న్న‌ బాలీవుడ్ స్టార్ కిడ్‌.. షాక్‌లో జాన్వీ!

అయినా స‌రే ఈ వార్త‌లు ఆగ‌డం లేదు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. ఈ వార్త‌ల‌పై స్వ‌యంగా స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `తనకు తెలుగులో లేదా ఏదైనా సౌత్ సినిమాలో న‌టించాల‌నే కోరిక ఎప్ప‌టి నుంచో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందనే రూమర్ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండ‌రు.

ఎందుకంటే, ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. కానీ బ్యాడ్‌ లక్‌ ఏంటంటే ఆ సినిమా నుంచి నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్‌ రాలేదు. ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను` అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఇప్ప‌టికైనా ఎన్టీఆర్ జాన్వీకి ఆఫ‌ర్ ఇస్తాడో..లేదో..చూడాలి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

50 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

53 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago