దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ `దఢక్` అనే హిందీ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్గా ఈ అమ్మడు `గుడ్ లక్ జెర్రీ`తో ప్రేక్షకులను పలకరించింది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన `కొలమావు కోకిల`కు రీమేక్ ఇది.
సిద్ధార్థ్ సెంగుప్తా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 29న నేరుగా ఓటీటీలో విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండపై సైతం ఆసక్తికర కామెంట్స్ చేసింది.
`విజయ్ నిజమైన స్టార్.. అతడికి యాక్టింగ్ పుట్టుకతోనే వచ్చింది.. స్టార్‌గా ఎదిగినా, భారీగా ఫాలోయింగ్ ఉన్నా.. అతడు ఇంకా ఏదో సాధించాలని చూస్తున్నాడు. అలాగే విజయ్ వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పది. నటుడిగానే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్నాడు. అందుకే విజయ్ అంటే నాకిష్టం. అతడితో ఖచ్చితంగా నటిస్తా` అంటూ చెప్పుకొచ్చింది.
ఇక గతంలో కూడా ఎన్నో సార్లు జాన్వీ ఇలానే విజయ్ దేవరకొండను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది. దీంతో విజయ్ దేవరకొండ అంటే జాన్వీకి అంత ఇంట్రస్ట్ ఏంటో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ అంటే జాన్వీకి అభిమానమా..? లేక అంతకు మించా..? అన్నది త్వరలోనే తెలియనుంది.