జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి- బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అయిన జాన్వీ కపూర్.. `దఢక్` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది.
అనతి కాలంలో బాలీవుడ్లో యువ సెన్షేషన్‌గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల జాన్వీ కపూర్ `గుడ్ లక్ జెర్రీ`తో నార్త్ ప్రేక్షకులను పలకరించింది.
డైరెక్ట్ ఓటీటీ విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇప్పుడు జాన్వీ చేతిలో `దోస్తానా 2`, బోనీ కపూర్ నిర్మిస్తోన్న `మిలీ` అనే చిత్రాలు ఉన్నాయి. ఇకపోతే ఆన్ స్క్రీన్‌పై ఎలా కనిపించినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం నెక్స్ట్ లెవల్ అందాల ఆరబోతలో అల్లాడిస్తుంటుంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్లతో నెటిజన్ల మతిపోగొట్టేస్తుంటుంది. తాజాగా కూడా లైట్ కలర్ శారీలో, చాలీ చాలని బ్రౌజ్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
వాటిని చూస్తే ఎవ్వరికైనా చెమటలు పట్టాల్సిందే. పాపం కుర్రాళ్ల పరిస్థితి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అంత హాట్ గా జాన్వీ దర్శనమిచ్చింది. మరి లేటెందుకు జాన్వీ లేటెస్ట్ పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.