NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

NTR: మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఎన్ని కోట్లంటే?

NTR: సినీ తారల్లో చాలా మందికి లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువ‌గా ఉంటుంది. తమ గ్యారేజ్ ఎన్ని కార్లు ఉన్నప్పటికీ.. కొత్త కార్లు కొంటూనే ఉంటారు. ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆల్రెడీ ఎన్టీఆర్ గ్యారేజ్ లో లంబోర్ఘిని ఉరస్, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే 718 కేమన్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్‌ 350డి, బీఎమ్‌బ్లూ 720 ఎల్‌డీ వంటి కార్లు ఉన్నాయి. వీటి విలువ కొన్ని కోట్లు ఉంటాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ మ‌రో ల‌గ్జ‌రీ కారును త‌న‌ ఇంటికి తెచ్చుకున్నాడు.

విలాసవంతమైన మరియు స్టైలిష్ బ్లాక్ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ S-క్లాస్ S 580 కారును ఎన్టీఆర్ కొనుగోలు చేశాడు. తన బ్రాండ్-న్యూ కారు రిజిస్ట్రేషన్ కోసం నేడు ఎన్టీఆర్‌ ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ఈ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఎన్టీఆర్ ను అక్క‌డే ఉన్న కొంద‌రు మీడియా వారు ఫోటోలు, వీడియోలు తీయ‌గా.. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఆర్టీఓ ఆఫీస్ వ‌ద్ద బ్లాక్ టి-షర్ట్ మ‌రియు కూలింగ్ గ్లాస్సెస్ ధ‌రించి ఎన్టీఆర్ స్టైలిష్ గా ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఎన్టీఆర్ కొన్న కొత్త కారు విష‌యానికి వ‌స్తే.. మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ S-క్లాస్ S 580 చాలా ల‌గ్జ‌రీగా ఉంటుంది. మార్కెట్ లో ఈ కారు విలువ దాదాపు రూ.2.72 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది. కాగా, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్‌.. ప్ర‌స్తుతం దేవ‌ర మూవీతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ ప్రాజెక్ట్ ఇది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నాడు.

అలాగే ఈ సినిమాలో అల‌నాటి తార శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సైఫ్ అలీ ఖాన్‌, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దేవ‌ర చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న దేవ‌ర ఫ‌స్ట్ పార్ట్ 2024 అక్టోబ‌ర్ 10న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. విడుద‌ల తేదీని ఇటీవ‌ల అఫీషియ‌ల్ గా అనౌన్స్ కూడా చేశారు.

ఇక దేవ‌ర‌తో పాటు ఎన్టీఆర్ చేతిలో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే వార్ 2. ఎన్టీఆర్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ఇది. యష్ రాజ్ ఫిలిమ్స్ యొక్క బ్లాక్ బ‌స్ట‌ర్ యాక్షన్-థ్రిల్లర్ వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2 రాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయ‌బోతున్న వార్ 2 మూవీపై ఇప్ప‌టికే అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

author avatar
kavya N

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu