NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇటు ప్రధాన మీడియాతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో అంతే గొప్ప మనసున్న వ్యక్తి. ముఖ్యంగా ఎదుటి వారికి సాయం చేసే విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు.

అయితే చాలా మంది చిన్న సాయం చేసిన ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా భిన్నం. అందుకు ఇప్పుడు చెప్పబోయే సంఘటనే నిదర్శనం. ఎన్టీఆర్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని మొగలికుదురు అనే ఊరిలో శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి భారీ విరాళాన్ని అందించాడు. చిన్న ఆలయానికి ఏకంగా ఆయన రూ. 12.5 లక్షలు విరాళం ఇచ్చారు. కానీ ఈ విషయం ఇంతవరకు పెద్దగా బయటకు రాలేదు.

అయితే ఊరి పెద్దలు ఆలయం బయట విరాళం ఇచ్చిన దాతల పేర్లను రాళ్లపై రాయించారు. ఆ రాళ్లపై జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి శాలిని, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లు ఉండడం చూసిన నెటిజన్లు వెంటనే ఫోటోలు తీశారు. ఆపై శిలాఫలకానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి ఎన్టీఆర్ గొప్ప మనసును నలుగురికి తెలిసేలా చేశారు. దీంతో అభిమానులు మరియు నెటిజ‌న్లు ఎన్టీఆర్ ఉదారతను మెచ్చుకుంటున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో దేవర మరియు వార్ 2 చిత్రాలు ఉన్నాయి. దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న దేవర పార్ట్ 1 అక్టోబర్ లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

వార్ 2 విషయానికి వస్తే.. బాలీవుడ్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ సైన్ చేసిన డెబ్యూ మూవీ ఇది. యశ్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్ పై స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకుంటున్న వార్ 2లో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా కూడా సెట్స్ మీదే ఉండ‌టంతో.. ఎన్టీఆర్ హైద‌రాబాద్ టూ ముంబై, ముంబై టూ హైద‌రాబాద్ తిరుగుతూ ఒకేసారి వార్ 2 మ‌రియు దేవ‌ర ప్రాజెక్ట్ ల‌ను కంప్లీట్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. ఇక మే 20న తేదీని ఎన్టీఆర్ బ‌ర్త్ డే. ఆ రోజు దేవ‌ర, వార్ 2 చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్స్ రావడం ఖాయంగా క‌నిపిస్తోంది.

https://x.com/Sai_Mohan_999/status/1790428802725695551

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N