NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

NTR: టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ధ‌రించిన గోల్డ్ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెడ‌తారు!

NTR: సినీ తార‌ల్లో ఒక్కొక్క‌రికి ఒక్కో దానిపై మ‌క్కువ ఉంటుంది. కొంద‌రు సెల‌బ్రిటీలు కొత్త కార్ల‌పై మోజు ప‌డితే.. కొంద‌రు ల‌గ్జ‌రీ ఇళ్ల‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వాచ్ ల ప్రేమికుడు. ఇప్పటికే ఎన్నోసార్లు ఖరీదైన వాచ్ లను ధరించి ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం టిల్లు స్క్వేర్‌.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సూర్యదేవర నాగ వంశీ మ‌రియు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స‌తీమ‌ణి సాయి సౌజన్య నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. 2022లో వ‌చ్చిన సూప‌ర్ డూప‌ర్ హిట్ డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ను రూపొందించారు. భారీ అంచ‌నాల న‌డుమ మార్చి 29న విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మ‌రోసారి టిల్లు పాత్ర‌లో సిద్దు వెండితెర‌పై మ్యాజిక్ సృష్టించాడు.

సింపుల్ స్టోరీ అయినా కూడా సిద్ధు త‌న న‌ట‌న‌తో సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. రూ. 100 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంది. ఇటు నిర్మాత‌ల‌కు, అటు బ‌య్య‌ర్ల‌కు భారీ లాభాల‌ను తీసుకొచ్చింది. ఇప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. టిల్లు స్క్వేర్ ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఇటీవ‌ల చిత్ర‌టీమ్ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకకు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌ ముఖ్య అతిథులుగా వ‌చ్చి సంద‌డి చేశాడు.

ఈ ఈవెంట్ లో టిల్లు స్క్వేర్ మ‌రియు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌పై ఎన్టీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు. సినిమా అంటే విపరీతమైన వ్యామోహం ఉండే సిద్ధు వంటి వారు చాలా అరుదుగా ఉంటారని, టిల్లు క్యారెక్టర్ అత‌ను అద‌ర‌గొట్టేశాడ‌ని ఎన్టీఆర్ కొనియాడారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. టిల్లు స్క్వేర్ స‌క్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ధ‌రించిన గోల్డ్ క‌ల‌ర్ వాచ్ ధ‌ర ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. చాలా క్లాసీగా ఉన్న ఎన్టీఆర్ వాచ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజ‌న్ల‌ను కూడా బాగా ఆక‌ర్షించింది.

ఈ క్ర‌మంలోనే ఈ వాచ్ గురించి ఆరాలు తీయ‌గా విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ మోడ‌ల్ వాచ్ ను ఎన్టీఆర్ త‌న చేతికి ధ‌రించాడు. ఈ వాచ్ ఖ‌రీదెంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు. ఎందుకంటే, ఆ వాచ్ ఖ‌రీదు $ 189,000. మ‌న‌ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్ష‌రాల రూ. 1,57,32,455. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కోటిన్నర పైమాటే. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతుంటే.. ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ అంటే ఏ మాత్రం ఉండాలంటూ గ‌ర్వంగా చెప్పుకుంటున్నారు.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju