యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో విడుదలైన `ఆర్ఆర్ఆర్` చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు.
అయితే ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఎన్నో అంచనాల నడుమ జపాన్ లో విడుదల చేశారు. ఇందులో భాగంగానే రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ వెళ్లి ప్రమోషన్స్ నిర్వహించి ఆర్ఆర్ఆర్ కు కావాల్సినంత హైప్‌ను క్రియేట్ చేశారు. అయితే ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ధరించిన ఓ షోస్ రేటు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
`ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ ఎయిర్ జోర్దాన్ బ్రాండ్ కి సంబంధించిన వన్ హై పారిస్ సెయింట్ జెర్మన్ షోస్‌ను వేసుకున్నాడు. ఈ షోస్ అభిమానులను మరియు నెటిజన్లు ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. ఇంకేముంది.. వాటి ధర ఎంతనేది సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
అయితే ఎన్టీఆర్ వేసుకున్న ఆ షోస్ రేటు తెలిస్తే షాక్ అయిపోతారు. ఇంతకీ ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. 35 వేలు. ఈ విషయం తెలిసి అంతా నోరెల్లబెడుతున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ, 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్‌తో ప్రకటించాడు. ఈ చిత్రాలు తర్వలోనే ప్రారంభం కానున్నాయి.