దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని గత ఏడాదే ప్రకటించారు.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితం కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కావడం లేదు.
కొరటాల స్క్రిప్ట్‌ను పూర్తి చేయకపోవడం వల్లే షూటింగ్ ఆలస్యం అవుతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ, అసలు నిజం అది కాదంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. దాని ప్రకారం.. కొరటాల ఎప్పుడో స్క్రిప్ట్‌ను కంప్లీట్ చేశాడట. అయితే షూటింగ్ డిలే అవ్వడానికి ఎన్టీఆరే కారణమట.
ఎన్టీఆర్ గత కొద్ది రోజుల నుండీ భుజం నొప్పితో బాధపడుతున్నారట. నొప్పితో ఇబ్బంది పడుతున్నా.. ఇటీవల బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కాదనలేక హాజరయ్యారట. అయితే డాక్టర్స్ ఆయనను కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. దాంతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారట. అందుకే `ఎన్టీఆర్ 30` షూటింగ్ లేట్ అవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతున్నారా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది.