Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అంటే తెలియని వారుండరు. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచీ టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈమె.. కెరీర్ డౌన్ అయ్యే స్టేజ్ దగ్గరవుతుండగా ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో పెళ్లి పీటలెక్కేసింది.
2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో వైభవంగా కాజల్-గౌతమ్‌లు వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా నటించిన కాజల్.. గత ఏడాది గర్భం దాల్చడంతో నటకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక రెండు నెలల క్రితం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన కాజల్ దంపతులు.. నీల్ కిచ్లూ అంటూ తమ ముద్దుల కుమారుడికి నామకరణం చేశారు.
ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న కాజల్.. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తనయుడి ఫొటోలను షేర్ చేసింది. కానీ, బిడ్డ ముఖం కనిపించకుండా జగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా కొడుకుతో దిగిన ఓ క్యూట్ పిక్‌తో మరో క్రేజీ పోస్ట్ పెట్టింది.
ఈ పిక్‌లో కొడుకు పక్కనే పడుకొని, అతడిని బుజ్జగిస్తూ కాజల్ కనిపిస్తోంది. `ఎర్లీ మార్నింగ్ స్ట్రాగుల్స్` అనే క్యాన్షన్‌తో ఈ పిక్‌ను ఇన్‌స్టా స్టోరీలో కాజల్ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోలో కూడా చిన్నారి ముఖం పూర్తిగా కనిపించడం లేదు. అయినప్పటికీ క్యూట్, స్వీట్ అంటూ కాజల్ పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…