టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా కట్టప్పగా మారిపోయింది. బుల్లి బాహుబలితో ఓ క్రేజీ పిక్ ను తీసుకుంది. అయితే ఇక్కడ బుల్లి బాహుబలి మరెవరో కాదు కాజల్ ముద్దుల తనయుడు నీల్ కిచ్లూ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎన్నో ఏళ్లు చక్రం తిప్పిన కాజల్ అగర్వాల్ ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో పెళ్లాడింది.
వివాహం అనంతరం కూడా పలు చిత్రాల్లో నటించిన కాజల్.. గత ఏడాది గర్భం దాల్చడంతో నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇక కాజల్ కు 2022 ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డ జన్మించాడు. అతడికి నీల్ కిచ్లూ అని నామకరణం చేసిన కాజల్.. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ తనయుడితో టైమ్ స్పెండ్ చేస్తోంది.
అయితే తాజాగా నీల్ తో కాజల్ బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేసింది. బాహుబలి చిత్రంలో చిన్ననాటి బాహుబలి కాలిని తన తలపై పెట్టుకుంటాడు కట్టప్ప. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా తన కొడుకు నీల్ కాలిని తలపై పెట్టుకుని ఫొటోకు పోజు ఇచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. నేను, నీల్ కలసి రాజమౌళి సర్ కి అంకితం ఇస్తున్నట్లు పోస్ట్ పెట్టింది.
దాంతో కాజల్ షేర్ చేసిన పిక్ క్షణాల్లో వైరల్ అయింది. తల్లీబిడ్డల అనుబంధానికి అద్దం పట్టేలా ఉన్న ఈ పిక్ అభిమానులను, నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే కాజల్ ఇటీవల తన రీఎంట్రీ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. `ఇండియన్ 2` మూవీతో తాను మళ్లీ తెరపై మెరవబోతున్నట్లు కాజల్ స్పష్టం చేసింది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!