Entertainment News సినిమా

కాజ‌ల్ ఈజ్ బ్యాక్‌.. గుర్రపు స్వారీతో అద‌ర‌గొట్టిన చంద‌మామ‌!

Share

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణించిన కాజల్.. 2020లో ముంబైలో స్థిర‌ప‌డ్డ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన మన చందమామ.. గత ఏడాది గర్భం దాల్చింది.

అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్న కాజ‌ల్‌.. ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. `ఇండియన్ 2` సినిమాతో ఈమె మళ్లీ తెరపై మెరవబోతోంది. ఈ నేపథ్యంలోనే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కాజల్ తాజాగా గుర్రపు స్వారీ కూడా చేసి అద‌ర‌గొట్టింది.

kajal aggarwal horse riding video
kajal aggarwal horse riding video

ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న కాజల్.. ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `ప్ర‌స‌వం అయిన నాలుగు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ ప‌నిలోకి దిగాను. ఇది నాకు కొత్త ఆరంభంలా ఉంది. ప్ర‌స‌వం అనంత‌రం నా ఎనర్జీ లెవెల్స్‌ని తిరిగి పొందడం చాలా కష్టమైంది. గుర్రాన్ని ఎక్క‌డం, స్వారీ చేయడం పెద్ద పనిలా అనిపించింది.

అయితే నా శరీరం లో మార్పు రావచ్చు. కానీ, నా యొక్క ఆత్మ విశ్వసం మాత్రం తగ్గలేదు.` అంటూ కాజ‌ల్ ఈ పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఇక కాజ‌ల్ గుర్ర‌పు స్వారీ చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు కాజ‌ల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.


Share

Related posts

Devatha Serial: రాధను నువ్వు మా అమ్మవేనా అన్న దేవి..!? భాగ్యమ్మా దేవుడమ్మకి రుక్మిణీ సంగతి చేప్పేసిందా.. 

bharani jella

Prabhas : ప్రభాస్ సలార్ లో కూడా దీపిక పదుకొణె.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ అదిరింది ..?

GRK

Gunasekhar: బర్త్ డే స్పెషల్: ‘గుణశేఖర్’.. సినిమా సొగసు చూపే ఒక్కడు

Muraliak