సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `చంద్రముఖి` ఒకటి. పి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జ్యోతిక, నయనతార, ప్రభు తదితరులు కీలక పాత్రను పోషించారు. 2005లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అయితే ఇప్పుడు ఈ హార్రర్ థ్రిల్లర్‌కు సీక్వెల్ గా `చంద్రముఖి 2` రాబోతోన్న సంగతి తెలిసిందే. సీక్వెల్లో రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ఇటీవల షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అలాగే ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వెల్లడించి సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచారు.
అయితే అసలు చంద్రముఖి ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. లక్ష్మీ మీనన్, త్రిష తదితరాల పేర్లు టైటిల్ పాత్ర కోసం వినిపించాయి. కానీ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కాజల్ అగర్వాల్ చెంతకు చంద్రముఖి 2 ఆఫర్ చేరిందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
చంద్రముఖి 2 టైటిల్ పాత్ర కోసం కాజల్‌ను ఎంపిక చేశారని.. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే కాజల్ చంద్రముఖిగా భయపెట్టనుందా..? లేదా..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
https://newsorbit.com/entertainment-news/kajal-aggarwal-latest-stunning-photos.html