కాజల్ అగర్వాల్ ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించిన హీరోయిన్. అయితే సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020లో కాజల్ అగర్వాల్ సైలెంట్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు కాజల్ అగర్వాల్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా “ఇండియన్ 2” సినిమాలో ఛాన్స్ అందుకోవటం తెలిసిందే.
అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కొద్ది నెలల క్రితం ఆగిపోయింది. సినిమా నిర్మాతలకు మరియు డైరెక్టర్ శంకర్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో కోర్టు దాకా కూడా నిర్మాతలు వెళ్ళటం జరిగింది. అనంతరం సినిమా షూటింగ్ ఆగిపోయింది. హీరో కమలహాసన్.. నిర్మాతలకి డైరెక్టర్ శంకర్ కి మధ్య సయోధ్య కుదిరించినట్లు.. త్వరలోనే “ఇండియన్ 2” షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఇటీవలే ఓ బిడ్డకు కాజల్ అగర్వాల్ జన్మనివ్వడంతో.. ఇటువంటి పరిస్థితులలో సినిమాలో ఆమెను పెట్టుకోవటం అంత భావ్యం కాదని .. కాజల్ అగర్వాల్ నీ “ఇండియన్ 2” నుండి తీసివేయడం జరిగిందంట. అతిపెద్ద భారీ బడ్జెట్ నా తరకెక్కుతున్నాయి ఈ సినిమాలో కీలకపాత్రలో ప్రారంభంలో కాజల్ అగర్వాల్ సెలెక్ట్ చేసి.. ఇప్పుడు తీసేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం శంకర్ .. చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కమల్ హాసన్ ఇండియన్ 2 మొదలుపెట్టనున్నారు. కమల్ .. నటించిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేయాలని.. నిర్మాతలు రాజీకి వచ్చినట్లు సమాచారం.