కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. కాజల్ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న టైమ్‌లోనే `ఏమైంది ఈవేళ` మూవీతో నిషా అగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. `సోలో`, `సుకుమారుడు` వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళం, మలయాళంలోనూ ఆమె పలు సినిమాల్లో నటించింది.
అక్క మాదిరిగానే చెల్లెలు కూడా ఇండస్ట్రీని ఏలేస్తుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు.2013 డిసెంబర్‌లో ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త కరణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పిన నిషా.. ఓ బాబుకు జన్మనిచ్చింది.
అయితే ఓ బిడ్డకు తల్లైన తన అందాన్ని మాత్రం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తోన్న నిషా అగర్వాల్.. తర్వలోనే రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె స్వయంగా వెల్లడించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసిన నిషా.. `తిరోగమనం కంటే పునరాగమనం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది.. బ్యాక్ టో వర్క్` అంటూ రాసుకొచ్చింది.
దీంతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోందని స్పష్టమైంది. అయితే తాను ఏ ప్రాజెక్ట్‌తో రీఎంట్రీ ఇవ్వబోతోంది అన్న వివరాలను మాత్రం నిషా తెలపలేదు. కానీ, త్వరలోనే ఈ వివరాలు బటయకు రానున్నాయని తెలుస్తోంది. మొత్తానికి నిషా అగర్వాల్ మళ్లీ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధం అవుతుండటంతో.. ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
https://www.instagram.com/p/CgMAP5iM78U/?utm_source=ig_web_copy_link
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…