సరైన హిట్ పడక చాలా రోజుల నుండి సతమతం అవుతున్న టాలీవుడ్ కు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన `బింబిసార` మూవీ కొత్త ఉత్సాహాన్ని అందించింది. కొత్త దర్శకుడు శ్రీ వశిష్ఠ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించారు. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రలను పోషించి.. తనదైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అలాగే టాక్ బాగుండటంతో ఈ మూవీ ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఇక విడుదలై పది రోజులు గడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద స్టడీగా దూసుకెళ్లోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు కూడా రూ. 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా బింబిసార 10 డేస్ టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 9.27 కోట్లు
సీడెడ్: 6.02 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.93 కోట్లు
తూర్పు: 1.60 కోట్లు
పశ్చిమ: 1.20 కోట్లు
గుంటూరు: 1.87 కోట్లు
కృష్ణ: 1.36 కోట్లు
నెల్లూరు: 0.79 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ= 26.04 కోట్లు(40.92కోట్లు~ గ్రాస్)
———————————–
కార్ణాటక+రెస్టాఫ్ ఇండియా= 1.70 కోట్లు
ఓవర్సీస్ – 2,02 కోట్లు
———————————–
టోటల్ వరల్డ్ వైడ్: 29.76 కోట్లు(49.15 కోట్లు~ గ్రాస్)
———————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 15.6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే విడుదలైన మూడు రోజుల్లోనే టార్గెట్‌ను బ్రేక్ చేసిన ఈ చిత్రం.. పది రోజుల్లో రూ. 13.56 కోట్ల లాభాలతో దూసుకెళ్తోంది.