Kantara: భారతీయ చలనచిత్ర రంగంలో కన్నడ ఇండస్ట్రీ నుండి వస్తున్న సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. దేశంలోనే అతి చిన్న ఫిలిం ఇండస్ట్రీగా పేరొందిన కన్నడ ఇండస్ట్రీ నుండి కేజిఎఫ్, కేజిఎఫ్ 2 అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ముఖ్యంగా “కేజిఎఫ్ 2” ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలయ్యి దేశవ్యాప్తంగా ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో 400 కోట్లకు పైగా కలెక్షన్ రావడం విశేషం. Kgf 2 దేశవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుండి రిలీజ్ అయిన “కాంతార” మోత మోగిస్తోంది.
“కేజిఎఫ్ 2″… నిర్మించిన హోంబలే నిర్మాణ సంస్థ నుండి ఈ సినిమా విడుదల కావడం జరిగింది. “కాంతార” అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇటువంటి తరుణంలో కర్ణాటకలో హోంబలే నిర్మించిన సినిమాలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా “కాంతార” రికార్డు క్రియేట్ చేసింది. యాష్ నటించిన “కేజిఎఫ్ 2″ టికెట్లు 75 లక్షలు అమ్ముడువగా…”కాంతార” సినిమా 77 లక్షలు టికెట్లు అమ్ముడు అయ్యాయి. దీంతో కలెక్షన్ పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. పూర్తి రన్ టైంలో “కాంతార” మరిని రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. చాలా వైవిధ్యమైన సినిమాలతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా సంచలనాలకు మరియు రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మరోపక్క ప్రేక్షకులు కూడా మంచి కంటెంట్ ఉంటే అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. భాషతో మరియు హీరోలతో సంబంధం లేకుండా.. సినిమాలో స్టఫ్ ఉంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి మరి చూస్తున్నారు.