ప్ర‌భాస్ `స్పిరిట్‌`లో బాలీవుడ్ హీరోయిన్‌.. ఆమె రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

Share

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇప్ప‌టికే `ఆదిపురుష్‌`ను కంప్లీట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `స‌లార్‌`, `ప్రాజెక్ట్-కె` చిత్రాలపై దృష్టి సారించాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీదే ఉండ‌టంతో.. ప్ర‌భాస్ బిజీ షెడ్యూల్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా అయ్యాక‌.. `స్పిరిట్‌` అనే మూవీని ఆయ‌న ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.

`అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత భూష‌ణ్ కుమార్ హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ కెరీర్‌లో తెర‌కెక్క‌బోతున్న 25వ చిత్ర‌మిది. ఇందులో ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని ఎప్ప‌టి నుండో గుస‌గుస‌లు వినిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌టించబోతోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు కరీనా కపూర్. ఇప్ప‌టికే మేక‌ర్స్ క‌రీనా క‌పూర్‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌పోతే `స్పిరిట్` మూవీకి క‌రీనా క‌పూర్ తీసుకోబోయే రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, ఆమె ఏకంగా రూ. 17 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింద‌ట‌. ఓ హీరోకు ఏ మాత్రం తీసిపోని రెమ్యున‌రేష‌న్ అది. అయిన‌ప్ప‌టికీ క‌రీనా క్రేజ్ దృష్ట్యా అంత భారీ మొత్తం ఇచ్చేందుకు మేక‌ర్స్ అంగీక‌రించిన‌ట్లు టాక్ న‌డుస్తోంది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

42 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

45 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago