కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సర్దార్`. ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ స్పై థ్రిల్లర్ లో రాశి ఖన్నా, రజిష విజయన్ హీరోయిన్లుగా నటించారు. చుంకీ పాండే ఈ చిత్రంలో విలన్ గా చేశాడు.
దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటిక్ టాక్‌ను సొంతం చేసుకుంది. తండ్రి కొడుకులగా కార్తి ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టేశాడు. టాక్ అనుకూలంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టింది.
అయితే రెండో రోజు కార్తి మరింత జోరు పెంచాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. 2వ రోజు రూ. 1.05 కోట్ల రేంజ్‌ను షేర్‌ను దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం- 0.87 కోట్లు
సీడెడ్- 0.23 కోట్లు
ఆంధ్ర- 0.90 కోట్లు
—————————————–
ఏపి+ తెలంగాణ= రూ. 2.00కోట్లు(రూ. 3.55కోట్లు~ గ్రాస్)
—————————————–
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 5 కోట్ల రేంజ్ లో థియేటర్ బిజినెస్ జరిగింది. రూ. 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన వసూళ్లు కాకుండా ఇంకా రూ. 3.50 కోట్ల రేంజ్ లో షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!