NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Karthika Deepam 2 April 20th 2024 Episode: శౌర్య పువ్వులు కొయ్యబోతుంటే బంటు వచ్చి వద్దని అంటాడు. అమ్మమ్మకి చెప్పాను అనేసరికి పారిజాతం వచ్చి ఇంతకుముందు ఒకసారి పూల విషయంలో గొడవ జరిగిందని అంటుంది. ఇప్పుడు ఉన్న గొడవలు చాలు కొత్తవి అవసరం లేదని బంటుని తిడుతుంది. జ్యోత్స్న పుట్టినరోజు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. త్వరగా తన ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలి అని కాంచన అంటుంది. పారు వైపు కార్తీక్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. భవాని తన కోసం ఏ గిఫ్ట్ తీసుకురాలేదా అంటుంది. పారిజాతం ఎవరికీ తెలియకుండా కార్తీక్ చేతిలో ఎర్ర గులాబీ పువ్వు పెడుతుంది. అది జ్యోత్స్న చూసినా బర్తడే కి నీ ప్రేమ గిఫ్ట్ గా ఇస్తున్నావా అని తెగ సంతోషపడుతుంది.

Karthika Deepam 2 April 20th 2024 Episode
Karthika Deepam 2 April 20th 2024 Episode

ఇక సుమిత్రాకు కార్తీక్, దీప పుట్టినరోజు కూడా ఈరోజే అని చెబుతాడు. జ్యోత్స్న తో కేక్ చేద్దాం రమ్మని పారిజాతం పిలుస్తుంది. సుమిత్ర దీపను రమ్మని అంటుంది. తాను ఎందుకులే అందరం ఇక్కడే ఉన్నాం కదాని పారిజాతం అంటే దీప కూడా ఈ ఇంటి మనిషేనని శివ నారాయణ అంటాడు. అదేదో సొంత మనుషులు అయినట్టు అది ఎందుకని పారు తిట్టుకుంటూ ఉంటుంది. దీప రాగానే ఈరోజు జ్యోత్స్న పుట్టినరోజు మాత్రమే కాదు దీప పుట్టినరోజు కూడా అని సుమిత్ర చెబుతుంది. పారిజాతం గతంలో బిడ్డని మార్చినది గుర్తు చేసుకుంటుంది. ఇంట్లో అందరూ దీపకు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తారు. దీప.. కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది.

మా ఊర్లో మా అమ్మ పుట్టినరోజుకి నేను తప్ప ఎవ్వరు శుభాకాంక్షలు తెలియజేయరు. కానీ ఇక్కడ ఎంతమంది చెబుతున్నారో అని శౌర్య ఆశ్చర్యపోతూ చెబుతుంది. ఈ కారణంగానైనా ని జీవితంలోకి సంతోషం తీసుకురావాలనే నా తాపత్రయం అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. కేక్ చూసి పుట్టినరోజుకి ఇది కాదు కదా కట్ చేయాల్సింది అని శౌర్య బన్ తెచ్చి చూపిస్తుంది. బర్తడే కేక్ అంటే ఇతని అమాయకంగా ఉంటుంది. నా పుట్టిన రోజుకి మా అమ్మ నాతో ఇదే కట్ చేస్తుందని చెప్పేసరికి అందరూ తన వైపు జాలిగా చూస్తారు. అమ్మ పుట్టినరోజుకి నేను తప్ప ఎవరూ లేరు కదా అందుకే మా అమ్మ కోసం ఈ బన్ కొని తెచ్చానని చెబుతుంది శౌర్య.

అప్పుడు కార్తీక్ శౌర్య బన్ కొన్న విషయం గుర్తు చేసుకుంటాడు. మీ అమ్మకు ఊర్లో నువ్వు ఒక్కదానివి ఉన్నావు ఏమో ఇక్కడ ఒక కుటుంబమే ఉంది. అనాధలా అవుట్ హౌస్ లో బర్తడే చేసుకుందామని అనుకున్నారా? అని డే పని సుమిత్రా ప్రేమగా పిలుస్తుంది. జ్యోత్స్న తో పాటు కేక్ కట్ చేయమని సుమిత్ర చెబుతుంది. ఎంత ఇద్దరిదీ ఒకే రోజు పుట్టినరోజు అయితే మాత్రం ఒకేసారి కట్ చేయడం ఎందుకని పారిజాతం అంటుంది. తనకి ఇద్దరూ సమానమేనని అంటుంది సుమిత్ర. దీప కూడా తన కూతురేనని దశరథ కూడా చెబుతాడు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. దీప శౌర్య తెచ్చిన వన్ కూడా కట్ చేసి తనకి తినిపిస్తుంది. కార్తీక్ కి కూడా తినిపించమని శౌర్య అనేసరికి అందరూ ఆశ్చర్యపోతూ చూస్తారు. బావకి నేను పెడతానని జ్యోత్స్న అంటుంది. శౌర్యని ఇక్కడ స్కూల్లో చేర్పించాలని అనుకుంటున్నామని దీప అని కూడా ఇక్కడే ఉండిపోమని దశరథ అడుగుతాడు.

Karthika Deepam 2 April 20th 2024 Episode
Karthika Deepam 2 April 20th 2024 Episode

జ్యోత్స్న పుట్టినరోజు అని ఆగాను లేదంటే వెళ్లిపోయేదాన్ని చెబుతుంది దీప. దీపక్క నిన్ను పంపించాలని మేము అనుకోవడం లేదు. నువ్వు ఇక్కడే ఉండి నీకు నచ్చిన పని చేస్తూ ఉండవచ్చు అని జ్యోత్స్న కూడా చెబుతుంది. కానీ దీప మాత్రం వెళ్లాల్సిందేనని అంటుంది. అందరూ కలిసి గుడికి వెళ్తారు. నరసింహ.. దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శోభ తన బతుకు సెకండ్ హ్యాండ్ చేసావని నరసింహాని తిడుతుంది. దీప రాకపోయినా నీ కూతురు వస్తే నా పరిస్థితి ఏంటని నిలదీస్తుంది. దీప ఎక్కడ ఉందో వెతికి దాన్ని ఊరు పంపించి ఇంటికి రా లేదంటే అమ్మని పిలుస్తానని బెదిరిస్తుంది. ఆ బుడ్డది నీ కూతురు కాదని నా అనుమానం పోయి వాడిని అడుగు చెబుతాడు ఏమోనని రెచ్చగొడుతుంది. మల్లేష్ పంచాయితీ పెడతాడు. అప్పు తీరుస్తానని వెళ్లి దీప ఇంకా రాలేదు. అందుకే నీ ఇల్లు జప్తు చేస్తున్నాం దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని ప్రెసిడెంట్ చెబుతాడు. కానీ ఇది తన తమ్ముడు ఇల్లు అమ్మొద్దు అని చెప్పి అనసూయ బాధపడుతుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella