21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam 21 October,1489 Episode: మోనిత దగ్గర అడ్డంగా బుక్ అయిన కార్తీక్..నెక్స్ట్ ప్లాన్ ఏంటో మరి..!

Share

Karthika Deepam 21October,1489 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1489వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 21 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్‌లో దుర్గని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని మోనిత తీసుకొస్తే.. పోలీసుల దగ్గర కార్తీక్ మోనితని ఇరికిస్తాడు. దాంతో మోనిత బిత్తరపోతుంది.అలాగే వంటలక్కకు కూడా ప్రాణహాని ఉంది అని రక్షణ కల్పించండి’ అని కార్తీక్ పోలీసుల్ని కోరతాడు.అదే సీన్ నేటి కథనంలో కూడా కంటిన్యూ అవుతుంది.ప్రాణ హాని. ఉంది అని అంటున్నారు కదా ఎవరివల్లనో చెప్పండి అని పోలీసులు అంటే కార్తీక్ వెంటనే మోనితవైపు వేలు చూపించి షాకిస్తాడు. వెంటనే హ …మోనితా ఆ రోజు దీప మీద దాడి జరగడం నీకు తెలుసు కదా? వాళ్లని నువ్వు గుర్తుపట్టగలవా?’ అంటాడు కార్తీక్. మోనిత షాక్‌లో ఉండగానే ‘అదేలే చీకటి కదా నువ్వు కూడా గుర్తుపట్టలేవులే అని అంటాడు కార్తీక్. సరే అయితే మా దగ్గర రౌడీల లిస్ట్ ఉంది. వాళ్లని పిలిపించి విచారణ జరిపిస్తానులే ఆ తర్వాత అసలు కారకులు బయటికి వస్తారు’ అనేసి కానిస్టేబుల్స్‌ని తీసుకుని వెళ్లిపోతాడు ఎస్ఐ.ఇక. దీప, దుర్గలు కార్తీక్‌కి థాంక్స్ చెప్పి వెళ్లిపోతారు.

కార్తీక్ ను నిలదీసిన మోనిత :

Karthikadeepam highlights


వెంటనే మోనిత కోపంగా కార్తీక్ ఏం చేస్తున్నావ్ నువ్వు? ఇలా ప్రవర్తిస్తావేంటీ?’ అని నిలదీస్తుంది. ‘అదే నా డౌట్ కూడా.. ఎందుకు ఇలా చేస్తున్నావ్ మోనితా మొన్నేమో దుర్గ బంధువు, స్నేహితుడు అని చెప్పి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావ్.. ఇప్పుడు క్రిమినల్ అని జైల్లో వేయిస్తే తర్వాత ఎంక్వయిరీలో తన స్నేహితురాలిగా నిన్ను కూడా జైలికి తీసుకుని వెళ్తే పోయేది నా పరువే. పైగా నువ్వు లేకపోతే నేను ఒంటరివాడ్ని అయిపోతాను కదా? అందుకే అలా చేశాను’ అంటాడు కార్తీక్.అవునా.. మరి వంటలక్క విషయంలో ఎందుకు అలా మాట్లాడావ్’ అంటుంది మోనిత.అది కూడా సేమ్ మోనితా.. తీరా ఆ వంటలక్కకి ఏదైనా అయితే ఇరుక్కునేది నువ్వే కదా? అందుకే అలా చేశాను..’అంటాడు కార్తీక్. ‘ఏంటో కార్తీక్ నీకు అన్నీ ఈ మధ్య బాగానే గుర్తుంటున్నాయి’ అంటుంది మోనిత.తలకు దెబ్బ తగిలినప్పటి నుంచి బాగానే గుర్తుంటుంది అంటాడు కార్తీక్.

కార్తీక్ ను పూజిస్తున్న దుర్గ:

Monitha, durga

సీన్ కట్ చేస్తే కార్తీక్ ఫొటో పెట్టుకుని దుర్గ పూజలు చేస్తూ ‘నన్ను కాపాడాడిన దేవుడు’ అంటూ ఉంటాడు. మోనిత వచ్చి.. ‘రేయ్ సేఫ్ అయ్యానని సంబరాలు చేసుకోకు.. నేనేంటో త్వరలోనే చూపిస్తాను’ అంటుంది. ‘అది సరే కానీ.. నా విషయంలో కార్తీక్ సార్‌కి పూర్తిగా అనుమానం వచ్చేసింది. నిన్ను వదిలించుకోవాలనే కార్తీక్ సార్ ప్లాన్.ఆలోచించుకో.. లేదంటే నన్ను ఎందుకు కాపాడతారు? నీ పని ఫినిష్ అయినట్లే మోనితా’ అంటూ నవ్వుతాడు దుర్గ.

Karthika Deepam 21October,1489 Episode highlets: కార్తీక్ టాబ్లెట్స్ వేసుకోవడం లేదు అని తెలుసుకున్న మోనిత :

Monitha

మోనిత ఆలోచనలో పడుతుంది. ఇంతలో ఇంట్లో పని చేసే శివలత చీపురతో ఇళ్లంతా తుడుస్తుంటే సోఫో కింద నుంచి టాబ్లెట్స్ వస్తూ ఉంటాయి. వాటిని చేతిలోకి తీసుకుని మోనితకి చూపిస్తుంది. వాటిని చూసి షాక్ అవుతుంది మోనిత. మేడం మీరు ఇచ్చిన టాబ్లెట్స్ ను సార్ వేసుకోవట్లేదనుకుంటా అంటుంది శివలత. మోనిత బిత్తరపోతుంది. ‘ఏంటి కార్తీక్ ఇలా ప్రవర్తిస్తున్నాడు.. కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా? దుర్గ విషయంలో కార్తీక్ నన్ను నమ్మడం లేదా? ముందు దుర్గాని, దీపని తప్పించాలి’ అనుకుంటూ ఆలోచించు కుంటూ కార్తీక్ కోసం ఇంట్లో చూస్తే కనిపించడు.

మోనితకు చెమటలు పట్టించిన దీప :

Monitha, deepa

కార్తీక్ దీప దగ్గర ఉన్నాడేమో అనుకుని దీప దగ్గరకు వెళ్తుంది మోనిత. అక్కడ కార్తీక్ లేడని తెలిసి.. ‘నీ మొగుడు నాకే సొంతం.. కార్తీక్ నావాడు.. నీ అంతు చూస్తాను అంటూ మొత్తం తను చేసిన నేరాలన్నీ చెప్పుకుంటూ వస్తుంది మోనిత. అప్పుడే దీప కూల్‌గా అంతా విన్నారుగా డాక్టర్ బాబు.. రండి బయటికి’ అంటుంది కావాలనే.కార్తీక్ విన్నాడా అంటూ షాక్ లో ఉంటుంది మోనిత. ‘అయ్యో కార్తీక్.. ఆవేశంలో దీపని రెచ్చగొట్టడానికి అన్న మాటలు ఇవి నిజం కాదు.. నమ్మకు’ అంటూ కార్తీక్ ఎటు నుంచి వస్తాడో అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటుంది. దీప పడి పడి నవ్వుతుంది. ఇక్కడ డాక్టర్ బాబు లేడు.కావాలనే నిన్ను బయపెట్టాను అని నిదానంగా చెబుతుంది దీప.

సౌర్య కోసం కార్తీక్ వెతుకులాట :

Karthik searching sourya

మరోపక్క కార్తీక్ రాత్రి పూట సౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే సౌర్య చంద్రుడుతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వస్తుంది బాబాయ్ ఒకసారి మౌనిత ఆంటీ ఇంటికి వెళ్ళాలి అని అంటే ఎందుకమ్మా అంటాడు. లేదు బాబాయ్ ఒకసారి చూసి దానికి ఎలా అయినా బుద్ది చెప్పి వస్తాను అని గట్టిగట్టిగా నవ్వుతు ఉంటుంది. ఆ నవ్వు విని ఇది శౌర్య నవ్వే… శౌర్య ఇక్కడే ఉన్నావా… సౌర్య సౌర్య అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు కార్తీక్. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో దీప శౌర్యని ఆటో తోలడం చూస్తుంది. అదే విషయం డాక్టర్ బాబుకు చెప్పి సౌర్య ఆటోలో వెళుతుంది అని చెప్పటంతో కార్తీక్ దీపా ఇద్దరూ కలిసి కారులో ఆ ఆటోని ఫాలో అవుతూ ఉంటారు

    


Share

Related posts

పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..!!

sekhar

ఆక‌ట్టుకుంటున్న `ఓరి దేవుడా` ట్రైలర్‌.. వెంకీ అండ‌తో విశ్వ‌క్ హిట్ కొడ‌తాడా?

kavya N

Devatha 23August: కమల బిడ్డకు రుక్మిణీ అని నామకరణం.. రుక్మిణీని చూసి షాక్ అయిన ఆదిత్య..!

bharani jella