23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam 26 October,1493 Episode: కధలో కీలక మలుపు..ప్రియమణి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుందా..?? ఇక మోనితకు చుక్కలే..!

Share

Karthika Deepam 26 October,1493 Episode:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1493వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 26 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్‌లో మోనిత మనిషి అయిన వాల్తేరు వాణి.. దీపని, దుర్గని చంపెయ్యడానికి టిఫెన్‌లో విషం కలిపింది.సరిగ్గా వాళ్లిద్దరూ తినే సమయానికి కార్తీక్ రావడంతో కధనం మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి. ఇక దుర్గ టిఫిన్ తినబోతుంటే కావాలనే తినకుండా చేత్తో కొట్టి కార్తీక్ అన్న వచ్చాక కలిసి తింటే బాగుంటుంది కదా?’ అంటూ కవర్ చేస్తుంది వాల్తేరు వాణి.

కార్తీక్ ను కాపాడిన మోనిత :

Monitha save karthik


సరిగ్గా కార్తీక్ తినడానికి నోట్లో ఇడ్లీ పెట్టుకునే సమయానికి ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్ చేతిలోని టిఫెన్ ప్లేట్ లాక్కుని విసిరేస్తుంది. ‘ఈ వంటలక్క కొంపను వదిలి రావా నువ్వు? ఎందుకు కార్తీక్ ఇలా చేస్తున్నావ్’ అంటూ గొడవకు దిగుతుంది. దుర్గ షాక్‌లో తినకుండా చేత్తో తన ప్లేట్ పట్టుకుని చూస్తుంటే ఇదే మంచి సమయం అనుకుని వాల్తేరు వాణి ఆ ప్లేట్ కూడా కిందపడేయాలనే ఉద్దేశంతో మోనితతో గొడవ పెట్టుకుని దుర్గ చేతిలోని టిఫిన్ కిందపడేలా చేస్తుంది.కాసేపు ఇద్దరు గొడవ పడతారు. తరువాత మోనిత కార్తీక్ ను తీసుకుని వెళ్ళిపోతుందు.ఇక కార్తీక్.. మోనిత ఇంటి ముందు, దీప తన ఇంటి ముందు కూర్చుని.. వాళ్లల్లో వాళ్లే చాలా ఆలోచిస్తూ ఎన్నాళ్ళు ఇలా ఏమి బాధపడిపోతు ఉంటారు. ఇక కార్తీక్. అయితే ఇంకా లాభం లేదు మోనితకు డోస్ పెంచాలి అని అనుకుంటాడు.

కధలోకి ప్రియమణిని తీసుకుని వచ్చిన కార్తీక్ :

Priyamani entry

మోనిత అయితే తన ఇంటి హాల్లో కూర్చుని ‘క్షణాల్లో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది.. సమయానికి వాణి మెసేజ్ చేసింది కాబట్టి సరిపోయింది. అదే ఆ టిఫెన్ కార్తీక్ తిని ఉంటే.. అమ్మో ఇంకేమన్నా ఉందా అనుకుని అయినా ఈ టిఫెన్స్‌లో, భోజనాల్లో విషం కలపడం ఏంటీ? ఏదైనా చేస్తే డైరెక్ట్‌గా ఎటాక్ చేసుకోవాలి. ఇలా చేయడం ఏంటి అని వాణిని తిట్టుకుంటుంది.ఇంతలో కార్తీక్ మోనిత దగ్గరకు వస్తాడు.‘రా కార్తీక్.. నీ కోసమే ఎదురు చూస్తున్నాను పదా టిఫెన్ చేద్దాం’ అంటూ ప్రేమగా పిలుస్తుంది మోనిత. ‘టిఫెన్ సంగతి తర్వాత కానీ ప్రియమణి ఎవరు?’ అంటాడు కార్తీక్. బిత్తరపోతుంది మోనిత ప్రియమణి ఎవరు కార్తీక్ నాకు తెలియదు అని అబద్దం చెబుతుంది.నిజంగా తెలియదా?’ అంటాడు కార్తీక్. ‘అబద్దం ఎందుకు చెబుతాను కార్తీక్’ అంటుంది మోనిత బిత్తర చూపులు చూస్తూ. ‘మరి నువ్వు తెలుసని నీ దగ్గర పని చేశానని చెప్పింది?’ అంటాడు కార్తీక్. ‘చెప్పిందా? తను నిన్ను కలిసిందా?ఎప్పుడు.. ఎక్కడా అని కంగారు పడుతుంది.అంటే నా దగ్గర చాలా మంది పని చేసి ఉంటారు కదా కార్తీక్.. మరిచిపోయి ఉంటాను అంతే అంటూ కవర్ చేసుకుంటుంది.మన పెళ్లి జరిగింది అని ప్రియమణికి చెబితే.. మీ పెళ్లి ఎప్పుడు జరిగింది అంటుందేంటీ? పెళ్లి అయితే మేడమ్ నన్ను ఎందుకు పిలవకుండా ఉంటోంది అని కూడా అంది తను? అంటే మనకు పెళ్లి కాలేదా?’ అంటాడు కార్తీక్ ‘అయ్యో.. పెళ్లి కాకుండా బాబు ఎలా పుడతాడు కార్తీక్.? అయినా తను నాకు గుర్తు లేదు గుర్తుంటే పెళ్లికి కూడా పిలిచే ఉండేదాన్ని కదా?’ అంటుంది మోనిత తడబడుతూ.అయితే మన పెళ్లి ఎప్పుడు అయ్యింది మోనితా? ఆనంద్‌ని చూస్తే ఏడాది వయసు అంటే పెళ్లి అయ్యి సంవత్సరం పైనే అయ్యింది కదా? అంటే హా అవును కార్తీక్’ అంటుంది.మన పెళ్లి ఆలస్యంగా జరగడానికి కారణం ఏంటి?ఇంట్లో వాళ్లు వద్దు అన్నారా? లేక వేరే కారణం ఏదైనా ఉందా?’ అంటాడు కార్తీక్.అంటే అందరికీ 21 ఏళ్లకే పెళ్లి కావాలని లేదు కదా కార్తీక్.. మనకు ఆలస్యం అయ్యింది అని ఏదోలా కవర్ చేసుకుంటుంది.

నీ అంతు చూస్తా అంటూ మోనితను బెదిరించిన కార్తీక్:

Karthik warns monitha

అయినా కార్తీక్ అది నిన్ను ఎప్పుడు కలిసింది?’ అంటుంది మోనిత. ‘రాత్రి.. వాకింగ్‌కి వెళ్లినప్పుడు కనిపించింది అంటాడు.‘అమ్మో ఆ ప్రియమణి ఇంకేం చెప్పిందో..? దీప గురించి కానీ చెప్పిందా’ అనుకుంటుంది మోనిత మనసులో. సరిగ్గా అప్పుడే ‘ప్రియమణికి దీప కూడా తెలుసా?’ అంటాడు కార్తీక్. మళ్లీ ఉలిక్కిపడుతుంది మోనిత. ఏమో కార్తీక్ నాకు తెలియదు అని అంటుంది.‘మోనితా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ అంటాడు కార్తీక్.లేదు కార్తీక్ అంటుంది మోనిత.నువ్వేదైనా అబద్దం చెబుతున్నావని కానీ, దాస్తున్నావని కానీ నాకు తెలిస్తే నాలో రాక్షసుడ్ని చూస్తావ్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.వెళ్తూ వెళ్తూ కార్తీక్ వెనక్కి తిరిగి మోనిత వైపు చూస్తూ ‘ఇది నీకు శాంపిల్ మాత్రమే.. నీ అంతట నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తాను చూడు’ అనుకుని వెళ్లిపోతాడు. మోనిత మాత్రం కార్తీక్ మాటలు తలుచుకుని వణికిపోతుంది.

Karthika Deepam 26 October,1493 Episode: పుష్పావతి అయిన సౌర్య:

Sourya mature

సీన్ కట్ చేస్తే సౌర్య కోసం ఇంటి బయట ఇంద్రుడు ఆటో దగ్గరే నిలబడి ‘అమ్మా జ్వాలమ్మా బయటకు రా అమ్మా.. రోజు ఈ పాటికే బయటుండేదానివి. ఈ పూటేమైంది తల్లీ’ అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇక చంద్రమ్మ బయటికి వచ్చి పాప ఈరోజు రాదు..మన జ్వాలమ్మ పెద్దమనిషి అయ్యింది.అంటుంది చంద్రమ్మ. ‘అవునా సంతోషం చంద్రమ్మా.. మరి తర్వాత కార్యక్రమాలు చూడాలి కదా అంటే వాటికి ఏదొకటి చేద్దాం గండా నువ్వు వెళ్లి ముందు ఈ సరుకులు తీసుకునిరా అని ఇంద్రుడుని పంపిస్తుంది. ఇంతలో కార్తీక్ గతంలో సౌర్య వినాయకుడి బొమ్మలు అమ్మడానికి వచ్చిన చోటుకు సౌర్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.అప్పుడే ఇంద్రుడు కూడా అటు వైపే వెళ్లడంతో కథనం ఆసక్తిగా మారింది.


Share

Related posts

నాగ‌చైత‌న్య సినిమాతో వంట‌ల‌క్క సినీఎంట్రీ.. ఇదిగో ఫ‌స్ట్ లుక్‌!

kavya N

కృష్ణంరాజు ఆస్తుల లెక్క తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది.. ఎన్ని కోట్లో తెలుసా?

kavya N

`ఆదిపురుష్‌`కు షాకింగ్ ర‌న్ టైమ్‌.. ప్ర‌భాస్ అన్ని గంట‌లు ప్రేక్ష‌కుల‌ను ఆప‌గ‌ల‌డా?

kavya N