Shobha: శోభ శెట్టి ఈ పేరు పెద్దగా పరిచయం ఉండదు కానీ.. కార్తీకదీపం లో మోనిత పేరు అయితే మాత్రం అందరికీ సుపరిచితమే.. డాక్టర్ బాబు వంటలక్క ఏ రేంజ్ లో అయితే పాపులర్ అయ్యారో.. మోనిత కూడా అదే రేంజ్ లో సంపాదించుకుంది.. ఇక ఈ సీరియల్ లో విలన్ గా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా ఆక్టివ్ గా ఉంటుంది.

కార్తీకదీపం సీరియల్ మొదట్లో మోనిత కాస్త బొద్దుగా ఉండేది. కానీ రాను రాను సన్నజాజి తీగలాగా తయారైంది. కన్నడలో కూడా శోభ పలు సీరియల్స్ లో నటిస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు సినిమాల్లో కూడా చేస్తుంది. అందుకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది..
శోభా శెట్టి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ తో తన ఫ్యాన్సును పలకరిస్తూనే ఉంటుంది తాజాగా జీరో సైజ్ వర్కౌట్ అంటూ.. బ్లూ కలర్ వర్కౌట్ వేర్లు ట్రెండీ లుక్స్ ఇచ్చింది క్రేజీ బ్యూటీ.. ఈ క్లిక్స్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.