NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam November 19 Today Episode: కార్తీక్, దీప బతికే ఉన్నారనే అనుమానంతో సౌందర్య ఏమి చేయనుంది..?

Karthikadeepam serial today episode review November 19 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1514వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 19న ప్రసారం కానున్న Karthika Deepam serial,1514వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1514వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది..గత ఎపిసోడ్ లో మోనిత ఎక్కడ కార్తీక్, దీపలను చూస్తుందేమో అని సౌందర్యను రాడ్ పెట్టి తల మీద కొడుతుంది.

సౌర్యను మోసం చేసిన ఇంద్రుడు :

Sourya

ఇక ఈరోజు ఎపిసోడ్ సౌర్య దగ్గర ఓపెన్ అవుతుంది. సౌర్య నానమ్మ కోసం టిఫిన్ చేయకుండా ఎదురుచూస్తుంది. టిఫిన్ చెయ్యమ్మ త్వరగా వెళ్దాం అంటుంది చంద్రమ్మ. లేదు పిన్ని నానమ్మతో మాట్లాడాక వెళ్దాం అంటుంది శౌర్య. ఇంకా ఇంటికి రాని చంద్రుడి కోసం ఇంద్రుడు ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ఇంద్రుడికి సౌర్య వాళ్ళ నానమ్మతో మాట్లాడిన తరువాతనే వస్తా అంటుంది అనే విషయం చెబుతుంది. ఆవిడ వస్తే జ్వాలమ్మ ని తీసుకెళ్లి పోతుంది తనని వదిలేసి ఉండలేం అంటాడు ఇంద్రుడు. మళ్లీ మళ్లీ తనకోసం అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని సౌర్య దగ్గరకు వెళ్లి మీ నానమ్మ రానని చెప్పింది అంటాడు.అదేంటి బాబాయ్ అలా అంటావ్, నన్ను తీసుకెళ్లకుండా తను వెళ్ళదు. తను తప్పకుండా వస్తుంది అంటుంది శౌర్య. కాదు జ్వాలమ్మ మీ నానమ్మ, నాకు దారిలో కనిపించింది మొహం మీదే రాను అని చెప్తే నేను భరించలేను తను ఎప్పుడు వస్తానంటే అప్పుడే మీరు తీసుకొని రండి అని చెప్పింది అని చెప్తాడు.అంటే నానమ్మ వాళ్ళు నన్ను మర్చిపోతున్నారా అని బాధపడుతుంది శౌర్య.

మోనిత ఏదో దాస్తుంది అనే అనుమానంలో సౌందర్య:

Soundarya

సీన్ కట్ చేస్తే తలకు కట్టు కట్టించుకున్న సౌందర్యతో ఆ మోనిత ఇంతకి తెగించిందంటే అది మామూలు ఆడది కాదు అంటాడు ఆనందరావు. ఆ తెగింపు అన్ని విషయాల్లోనూ కాదు ఒక్క కార్తీక్ విషయంలో తప్పితే నాకు ఎందుకో కార్తీక్, దీప వాళ్ళు బ్రతికున్నారేమో అనిపిస్తుంది, శౌర్య కూడా అదే చెప్తుంది. మనమే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్లు బ్రతికే ఉన్నారనిపిస్తుంది అంటుంది సౌందర్య.

మోనితకు చుక్కలు చూపిస్తున్న దుర్గ:

Durga monitha

 
మోనిత దేవుడికి దండం. పెట్టుకుంటూ ఉండగా అక్కడికి దుర్గ వచ్చి నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి దేవుడా తీర్చు అని దండం పెట్టుకుంటాడు. నన్ను టార్చర్ పెట్టకు నన్ను వదిలేయ్ అని కోప్పడుతూ అంటుంది మోనిత. సర్లేగాని నువ్వు ఎవరో తల పగలగొట్టావ్ అంట కదా అది ఎవరిది అని అడుగుతాడు దుర్గ. నేను తల పగల కొట్టేదానిలాగా కనబడుతున్నానా అంటుంది మోనిత. సరే నువ్వు డాక్టర్ బాబు ని వదిలేయ్, అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను లేకపోతే అప్పటివరకు ఇలా టార్చర్ పెడుతూనే ఉంటాను అంటాడు దుర్గ.

మోనిత పనిపడతా అంటున్న సౌందర్య:.

Soundra

కార్తీక్, దీప వాళ్ళు బతికే ఉన్నారేమో అన్న సౌందర్య అనుమానంతో ఆనందరావు నేను వెళ్లి రానా అంటాడు. వద్దు నేను మళ్ళీ వస్తాను అని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటుంది ఆ మోనిత. ఇప్పుడు మీరు వెళ్తే ప్రమాదం. రెండు రోజులు పోయాక నేనే వెళ్తానంటుంది సౌందర్య. సౌందర్య తల బద్దలు కొట్టడం గురించి ఆలోచిస్తూ పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంటుంది మోనిత. అప్పుడే అక్కడికి శివ వస్తాడు. ఆవిడని హైదరాబాదులో వదిలేసావా ఏమి మోనిత అడుగుతుంది.వదిలేసాను కానీ తిరిగి వస్తానని అనుకోలేదు మేడం..ఎక్కడ పోలీసులు పట్టుకుంటారు ఎక్కడ ఆవిడకి మెలకువ వచ్చి నిజం చెప్పేస్తారు అని చాలా టెన్షన్ పడ్డాను.

దీపను చంపడానికి శివకు సుఫారి:

Siva monitha

ఇంతకీ ఆవిడ ఎవరు అనే నిజం చెప్పకపోతే టెన్షన్ తో ఇక్కడ పని చేయలేను అంటాడు శివ. నేను నిజం చెప్తే నువ్వు గుండాగి చస్తావ్. ఈ డబ్బు తీసుకొని ఆ నోరు మూసేయ్ అంటుంది మోనిత. సడన్గా అక్కడికి వచ్చిన కార్తీక్ ఆ డబ్బు అందుకొని ఎందుకు ఇంత డబ్బుకు శివకిస్తున్నావ్ అని అడుగుతాడు.కార్తీక్ మాటలకూ కోపం వచ్చిన మోనిత వంటలక్కని లేపేయమని శివకి సుఫారి ఇస్తున్నాను అని కోపంగా అంటుంది మోనిత.ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu