NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam November 21 Today Episode: క్షీణించిన డీప ఆరోగ్యం… మోనిత పని పడతా అంటున్న సౌందర్య..!

Karthikadeepam serial today episode review November 21 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1515వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 21న ప్రసారం కానున్న Karthika Deepam serial,1515వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1515వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.

దీపను చంపమని శివకు డబ్బులు ఇచ్చిన మోనిత :

Karthik monitha

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత శివకి డబ్బులు ఇస్తుండగా అనుకోకుండా కార్తీక్ వస్తాడు. ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నావ్ అని మోనితను అడుగుతాడు. దీపని చంపటానికి సుఫారీ ఇస్తున్నానులే అని వెటకారంగా అంటుంది.శివ, కార్తీక్ ఇద్దరు షాక్ అయిపోతారు.నీకు ఇదే సమాధానం కావాలి కదా నేను ఏం చెప్పినా నువ్వు ఇలాగే ఆలోచిస్తావ్ అయినా నేను నిన్ను అనుమానించాలి. బంగారం అమ్మి వంటలక్క అవసరాలు తీరుస్తున్నావ్. ముందు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నావో నిజం చెప్పు అంటాడు కార్తీక్. బట్టల బిజినెస్ కి మెటీరియల్ కోసం ఇస్తున్నాను అని డబ్బులు చేతిలో పెట్టి శివని వెళ్ళమంటుంది. వెళ్తున్న శివని ఆపి నిజం చెప్పమంటాడు. మోనిత మీద ఒట్టేసి శివ అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు.

కార్తీక్ ను ఫాలో అయిన మోనిత :

Karthik

ఇక కారులో వెళ్తున్న కార్తీక్ శౌర్య గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. మీరు అన్ని రెడీ చేయండి నేను వచ్చేస్తున్నాను అంటాడు కార్తీక్.డాక్టర్ నై ఉండి దొంగచాటుగా ఆపరేషన్ చేయవలసి వస్తుంది అంతా మోనిత వల్లే అనుకుంటాడు కార్తీక్. ఇంతలో వెనకన ఫాలో అవుతున్న మోనితని చూసి కంగారుపడుతాడు కార్తీక్. ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే నిజం తెలిసిపోతుంది అని దారి మళ్లించేస్తాడు కార్తీక్.

క్షీణించిన దీప ఆరోగ్యం :

Deepa

సీన్ మళ్ళీ దీప దగ్గర ఓపెన్ అవుతుంది . దీప ఇంటికి వచ్చిన దుర్గ దీప పడుకోవటం చూసి కంగారుపడుతాడు. ఏంది దీపమ్మ ఒంట్లో బాలేదా అంటాడు. అవును దుర్గ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు.తల తిరుగుతుంది, ఊపిరి కూడా తీసుకోవడం కష్టంగా ఉంది అంటుంది.ఇక కాసేపు అయ్యాక ఇద్దరూ మోనిత గురించి మాట్లాడుకుంటారు. తను ఎవర్నో కొట్టింది దుర్గ అని అంటుంది దీప.పొద్దున్న అడిగాను దీపమ్మ కానీ తనకేం తెలియదంటుంది అంటాడు దుర్గ. లేదు దుర్గ బయట తనొక్కతే ఉంది దానికి తెలియకుండా ఉండదు.ఆ కొట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళు పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తుంది.

మోనిత అంతు చూస్తా అంటున్న సౌందర్య:

Soundarya

ఇక సౌందర్య మాత్రం మోనిత గురించి ఆలోచిస్తూ ఉంటుంది.తను కచ్చితంగా ఏదో దాస్తుంది అని అనుకుంటుంది. బాబు ఏం చేస్తున్నాడు అని ఆనంద్ దగ్గరికి వెళ్తుంది సౌందర్య. మీ అమ్మ చాలా దురదృష్టవంతురాలు నీ అలనా పాలన చూసుకోలేకపోతుంది అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనందరావుతో వీడిని తీసుకువచ్చిన తర్వాత ఒకసారి కూడా ఆ మోనిత ఫోన్ చేయలేదు చూసారా అంటుంది.ఒకవేళ కార్తీక్ బ్రతికే ఉన్నాడేమో, తన దగ్గరే ఉన్నాడేమో, ఆనంద్ అవసరం తనకి లేదేమో అంటాడు ఆనందరావు.

సౌర్య గురించిన ఆలోచనలో ఇంద్రుడు :

Sourya

ఇంటికి వచ్చిన ఇంద్రుడుకు శౌర్య కనిపించక పోవడంతో చాలా కంగారుగా వెతుకుతాడు. బయట ఉంది అంటుంది చంద్రమ్మ. లేదు తను బయటికి వెళ్లిందట ఎదురు షాప్ అతను చెప్పాడు అయినా పాపని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని మందలిస్తాడు. ఒకవేళ పాప మనల్ని వదిలి వెళ్ళిపోయిందంటావా అంటుంది చంద్రమ్మ. ఎక్కడికి వెళ్లినా తన అమ్మానాన్నకు కనిపించకుండా ఉంటే చాలు అంటాడు ఇంద్రుడు.ఇంతలో ఇంటికి వచ్చిన శౌర్యని చూసి ఆనందపడతారు ఇద్దరు.ఎక్కడికి వెళ్లావు అని ఆత్రంగా అడుగుతారు. అంత కంగారు ఎందుకు బాబాయ్ జిరాక్స్ తీయించడానికి వెళ్లాను అని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri