NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam November 28 Today Episode:విషమించిన దీప ఆరోగ్యం.. కొడుకు, కోడలు బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య..!

Karthikadeepam serial today episode review November 28:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1521వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 28న ప్రసారం కానున్న Karthika Deepam serial,1521వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1521వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లో దీప ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు తీసుకుని వెళ్తుంది. తనకి ఆరోగ్యం బాలేదని దీపకు ఎలా చెప్పాలో అని అనుమానంగా ఇంట్లోకి వస్తాడు కార్తీక్. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కార్తీక్ దీప పనుకుని ఉండడం చూస్తాడు.

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన దీప :

Deepa karthik

దీప మనం హాస్పిటల్ లో రెండు రోజులు ఎడ్మిట్ అవ్వవలసి ఉంటుంది అంటాడు కార్తీక్. ఎందుకు దీప అని అడిగితె నువ్వు బాగా నీరసంగా ఉన్నావు కదా రెండు రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ అయితే తగ్గిపోతుంది అంటాడు.నేను రాను అని దీప అంటే నీకు ఒక విషయం చెప్పాలి.నాకు గతం గుర్తుకొచ్చి చాలా రోజులైంది. గుర్తొచ్చిన వెంటనే నీకు చెబుదాం అనుకున్నా కానీ మోనిత మళ్లీ మనల్ని వేరు చేస్తుందేమో అని భయపడ్డాను అంటాడు. సౌర్యను చూసాను కానీ నేను తనని గుర్తుపట్టలేదు అంటాడు. ఇప్పుడు శౌర్య ఎక్కడుందో తెలిసింది కాబట్టి దాన్ని మనం ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అని వెనక్కి తిరిగి చూసేసరికి దీప స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది దీప.

నిజం తెలుసుకున్న సౌందర్య:

Soundarya

వెంటనే దీప ను తీసుకుని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు కార్తీక్..మీరు ఎలాగో హార్ట్ స్పెషలిస్ట్ అంటున్నారు కదా మీ భార్యకి మీరే ట్రీట్మెంట్ చేయండి అంటాడు అక్కడ డాక్టర్..సరే అని చెప్పి దీప రూమ్ లోకి వెళ్తాడు డాక్టర్.మరోవైపు ఆనంద రావుకి ఆనందంగా ఫోన్ చేసి కార్తీక్, దీప బతికే ఉన్నారు అనే విషయం చెబుతుంది సౌందర్య. అలాగే మన కొడుకు కోడలు బ్రతికే ఉన్నారు వాళ్లు కూడా శౌర్య కోసమే వెతుకుతున్నారు. వాళ్లకు భయపడే ఇంద్రుడు ఊరు వదిలి వెళ్ళిపోయారు అంట అని సౌందర్య చెబుతుంది.వెంటనే హిమని, ఆనంద్ ని తీసుకొని ఇక్కడికి వచ్చేయండి అంటుంది సౌందర్య మళ్ళీ సీన్ దీప దగ్గర ఓపెన్ అవుతుంది.అప్పుడే మెలకువ వచ్చిన దీప నాకేమైంది అని అడుగుతుంది. ఏమీ లేదు హార్ట్ లో చిన్న ప్రాబ్లం అంట. చిన్న ఆపరేషన్ చేస్తే సరిపోతుంది అంట అంటాడు కార్తీక్.

దీప బతుకుతుందా..?

Deepa

నిజం చెప్పండి డాక్టర్ బాబు నేను బతుకుతానా అంటుంది దీప.ఏమీ కాదు, రేపు సర్జరీ అయిపోయిన తర్వాత నయం అయిపోతుంది అంటాడు కార్తీక్. నేను బ్రతకననిపిస్తోంది డాక్టర్ బాబు అంటుంది నువ్వు ఇవన్నీ ఆలోచించకు ప్రశాంతంగా ఉండు అంటాడు కార్తీక్. నా జీవితానికి ప్రశాంతత కూడానా? పక్కనే ఉన్న మీ భార్య గా మీరు గుర్తించరు. బిడ్డ ఎక్కడ ఉందో తెలీదు. భార్యగా తల్లిగా నేను ఏం సాధించాను డాక్టర్ బాబు అని ఏడుస్తుంది దీప. శౌర్య దొరుకుతుంది. నీకు అంతా మంచే జరుగుతుంది నీకు అన్యాయం జరగదు అంతవరకు కాసేపు పడుకో అంటాడు కార్తీక్.

మోనిత కి అబద్ధం చెప్పిన శివ..

Monitha siva

మరోవైపు కార్తీక్ నిన్నటి నుంచి కనిపించలేదని కంగారుగా అటు ఇటు తిరుగుతుంది మోనిత. అవును శివని, సంగారెడ్డి పంపించాను కదా అక్కడ ఏం జరిగిందో అని శివకి ఫోన్ చేస్తుంది.అక్కడే ఉన్న శివ నేను ఇక్కడే ఉన్నాను కదా మేడం ఎందుకు ఫోన్ చేయడం అని ఆమె దగ్గరికి వస్తాడు. నిన్ను సంగారెడ్డి పంపించాను కదా అక్కడ ఏం జరిగింది అంటుంది మోనిత. అక్కడ లేదు మేడం గడప.. గడప వెతికాం అంటాడు శివ. వాళ్ళిద్దరు భార్య భర్తలు అని శివలత చెప్పింది వాళ్ళని విడదీసి పాపము చుట్టూకోవడం ఎందుకని నేనే వాళ్ళని వెతకలేదు అనుకుంటాడు శివ.దీపను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావని కంగారు పడుతుంది మోనిత.

దీపకు గుండె ఆపరేషన్ చేయనున్న కార్తీక్ :

ఇక దీప మళ్ళీ సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మన బిడ్డను మనకి ఇవ్వడం ఇష్టం లేకే ఇంద్రుడు అలా చేశాడు అంటాడు కార్తీక్. మనం ఫోన్ చేసి వెళ్తే వాడు జాగ్రత్త పడిపోతాడు అందుకే నేరుగా నేను వెళ్తాను అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు ఒకవేళ నాకేమైనా అయితే శౌర్య ను వెతుకుతారు కదా అంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri