NewsOrbit
Entertainment News

Karthika Deepam Serial Today Episode Review October 27: దీప, కార్తీక్ లే సౌర్య అమ్మా నాన్నలు అని తెలుసుకున్న ఇంద్రుడు. రేపటితో దీప కధ ముగిసిపోనుందా?

Karthika Deepam Serial 2022 Today Episode October 27

Karthika Deepam Serial Today Episode Review October 27: కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1494వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు Karthika Deepam October 27 అక్టోబర్ 27న ప్రసారం కానున్న Karthika Deepam  నేటి ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం, Karthika Deepam Today Episode Written Update.

Karthika Deepam Serial Today Episode October 27
Karthika Deepam Serial Today Episode October 27

 

Karthika Deepam Serial Today Episode Review October 27: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1494వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 27న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో కార్తీక్ ప్రియమణి గురించి మోనితను అడిగి మోనితను అయోమయంలో పడేస్తాడు. మరోపక్క సౌర్య పెద్దమనిషి అవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే జ్వాల ఫంక్షన్ చేయడానికి ఎలాగైన డబ్బు కావాలి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్రుడు.అయితే కాస్త దూరంలో కార్తీక్ సౌర్య గురించి ఆరా తీస్తూ ఉంటాడు.ఇక ఇంద్రుడు ఎలాగైనా పాప ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న ఒక వ్యక్తి పర్సు దొంగతనం చేయబోతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి దీప వచ్చి అడ్డుకుంటుంది.

Karthika Deepam Today Episode Review October 27
Karthika Deepam Today Episode Review October 27

 

దొంగతనం చేస్తూ దీపకు దొరికిపోయిన ఇంద్రుడు:

ఇంద్రుడిని చూసిన దీప నువ్వు ఆటో నడుపుకుంటావు కదా మరి దొంగతనం చేస్తున్నావ్ ఎందుకు అని అడుగుతుంది. అది చూసిన డాక్టర్ బాబు ఇతను నీకు తెలుసా? అంటే హ తెలుసు డాక్టర్ బాబు ఆటో నడుపుకుంటూ ఉంటాడు అంటుంది దీప. నేనే కూడా ఇతను దొంగతనం చేయబోతుంటే చూసా..అరుద్దాం అనుకున్నాను ఈ లోపల నువ్వే వచ్చావు అని అంటాడు కార్తీక్. పాపని ఇతని ఆటోలోనే చూశాను అని అంటుంది దీప. సౌర్య గురించి మాట్లాడుకోవడం విన్న ఇంద్రుడు వీళ్ళ పేర్లు ఎక్కడో విన్నాను అనుకుని సౌర్య అమ్మా నాన్న వీళ్లేనా అని అనుకుంటాడు.

Mounitha is doubtful of Karthik in Karthika Deepam Today Episode
Mounitha is doubtful of Karthik in Karthika Deepam Today Episode

 

దీప, కార్తీక్ లే సౌర్య తల్లితండ్రులు అని తెలుసుకున్న ఇంద్రుడు :

మొన్న మనం ఫాలో అయినా ఆటో కూడా ఇదే అని అంటుంది దీప. నా ఆటో ఫాలో అయ్యారా ఎందుకమ్మా నేను ఏమైనా దొంగతనం చేశానా మీ దగ్గర కొంపదీసి ఇప్పుడు.నన్ను పోలీసులకి పట్టిస్తారా అంటాడు ఇంద్రుడు.తెలియక చేసి ఉంటానమ్మ ఇప్పుడు పోలీసులకు పట్టించకండి. రోజు నాతో వచ్చే పాప పెద్దమనిషి అయింది. ఆ పాపకి ఫంక్షన్ చేయడానికి డబ్బులు లేక ఇలా దొంగతనం చేయడానికి సిద్దపడ్డాను అంటాడు.అయినా నేను దొంగతనం మానేసి చాలా రోజులు అయింది నేను దొంగతనం చేయడం జ్వాలమ్మ కి ఇష్టం లేదు.తనే నన్ను ఆటో నడుపుకోమని చెప్పింది అని అంటాడు ఇంద్రుడు.. కానీ ఇప్పుడు అదే పాప కోసం నేను దొంగతనం చేయవలసి వచ్చింది అని అంటాడు.
సరే అని పాపకి అతను అడిగినవన్నీ కొనడానికి తీసుకొని వెళ్తాడు కార్తీక్.

Karthika Deepam Daily Telugu Serial Today's Episode Review with Pictures
Karthika Deepam Daily Telugu Serial Todays Episode Review with Pictures

 

కార్తీక్ గురించి ఆలోచిస్తున్న మోనిత. రేపటితో వంటలక్క చాప్టర్ క్లోజ్ అంటున్న వాణి :

సీన్ కట్ చేస్తే కార్తీక్ గురించి ఆలోచిస్తు ఉంటుంది మోనిత.నిజంగానే ప్రియమణి…కార్తీక్ ను కలిసిందా? కలిస్తే ఒక్క నా గురించి మాత్రమే ఎందుకు అడుగుతుంది.దీప గురించి కూడా అడగాలి కదా, కార్తీక్ నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా? కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చి నా దగ్గర నాటకం ఆడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి వాల్తేర్ వాణి వస్తుంది. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు కార్తీక్ చూస్తే ఇబ్బంది అవుతుంది అని కంగారు పడుతుంది మోనిత. కంగారు పడకండి మేడం వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్లారు అని అంటుంది. ఇంకా ఆ దీప బాధ మీకు ఉండదు లెండి.రేపటితో దాని కథ ఫినిష్ అయిపోతుంది. ఈ ఒక్క రాత్రే ఓపిక పడితే చాలు రేపటికల్లా మీ పని అయిపోతుంది. క్యాష్ రెడీ చేసుకోండి చాలు అని అంటుంది వాణి.సరే ఇక్కడ నుండి వెళ్ళిపో ఆ దుర్గ చూస్తే దొరికిపోతాం అంటుంది మోనిత.. లేదు మేడం వాడు పూర్తిగా నా మాయలో పడిపోయాడు అంటుంది వాణి.

Karthika and Deepa from Today's Karthika Deepam Episode October 27
Karthika and Deepa from Todays Karthika Deepam Episode October 27

 

Karthika Deepam Serial Today Episode Review October 27: కూతురు కోసం వస్తువులు కొన్న కార్తీక్, దీపలు :

ఇక కార్తీక్, దీప ఇద్దరు కలిసి ఇంద్రుడుకు కావలసినవన్నీ కొని ఇచ్చి పద నీతో పాటు మేము ఇంటి వరకు వస్తాము అని అంటుంది దీప. పాపని చూడ్డానికి మీరెందుకు వద్దు అంటాడు ఇంద్రుడు. వీళ్ళను సౌర్య దగ్గరకు తీసుకుని వెళితే సౌర్యా వీళ్ళే కూతురే అని తెలిసిపోతుంది అనుకుని వద్దు అంటాడు.అదేమిటి అయ్యా పాపని చూస్తాను అంటే వద్దంటున్నావు అని అంటాడు కార్తీక్. అంటే ఇంట్లో ఫంక్షన్ కదండి ఇల్లంతా చండాలంగా ఉంటుంది. ఎలాగూ రేపు ఫంక్షన్ కదా రేపు ఒద్దురుగాని అని అంటాడు ఇంద్రుడు.

Karthika Deepam Serial Yesterday’s Episode October 26 Review: Read Full Written Update and Review

పాపను చూడడానికి రావద్దు అన్న ఇంద్రుడు :

ఇక దీప మాత్రం ఇల్లు ఎలాగ ఉంటే ఏమి నేను పాపని చూసి వచ్చేస్తాను అని అంటుంది. వద్దమ్మా మేము చుట్టాలనే రమ్మని పిలవలేదు. రేపు రండి అని కంగారు పడతాడు.ఇతని ఏమిటి ఇలా అంటున్నాడు అని అనుకుంటాడు కార్తీక్. సరే మీ ఇంటికి రాములే కానీ పాప ఫోటో ఒకటి చూపించు అని అంటాడు కార్తీక్..ఫోన్లో సౌర్య ఫోటోలు. అన్నీ డిలీట్ చేసేసి లేవు అని చెబుతాడు.అయినా రేపే కదా ఫంక్షన్ రేపు పొద్దుగాల రండి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటాడు ఇంద్రుడు. మాకు ఈ ఊరు తెలియదు రేపు పొద్దున్న మేము ఇక్కడికి వస్తాం మమ్మల్ని నువ్వే తీసుకువెళ్లాలి అని అంటుంది దీప.సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంద్రుడు.

Karthika Deepam October 27 Episode Review with HD Pictures from Hotstar
Karthika Deepam October 27 Episode Review with HD Pictures from Hotstar

అమ్మా నాన్నల గురించి బాధపడుతున్న సౌర్య:

ఇక పాపం సౌర్య చాప మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.పొద్దున్న అనగా వెళ్లిన మనిషి ఇంకా రాలేదు అని కంగారు పడుతుంది చంద్రమ్మ. ఇంకా ఎన్నిరోజులు ఇలా కూర్చోవాలి పిన్ని నేను మా అమ్మానాన్నలని వెతకటానికి వెళ్ళాలి అని బాధపడుతూ అంటుంది శౌర్య.ఈ ఒక్క రాత్రి ఆగు రేపు ఫంక్షన్ అయిపోతుంది కదా తర్వాత వెల్దువు గాని అని అంటుంది చంద్రమ్మ. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని తెలిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది పిన్ని అని ఏడుస్తుంది శౌర్య. మేము నీకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేము కానీ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం తల్లి..సంతోషంగా ఉండవలసిన టైంలో ఇలా బాధపడకు నా కోసమైనా సంతోషంగా ఉండు అని అంటుంది చంద్రమ్మ. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏమి జరిగిద్దో చూడాలి.

Karthika Deepam Serial Yesterday’s Episode Review: Read Full Written Update and Review






author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu