21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam Today episode review November 24: దీపను మళ్ళీ మోసం చేసిన ఇంద్రుడు.. మోనితపై కార్తీక్ చూపించే ప్రేమ నిజామా..?

Share

Karthikadeepam serial today episode review November 24 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1518వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 24న ప్రసారం కానున్న Karthika Deepam serial,1518వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1518వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లో సౌర్య సంగారెడ్డిలో ఉందనే నమ్మకంతో దీప సంగారెడ్డి బయలుదేరుతుంది. సంగారెడ్డి వచ్చాక రాజ్యలక్ష్మి, హేమచంద్రల సాయంతో.. ఒక ఇంటికి చేరుకుంటుంది.అక్కడ కార్తీక్ ఫొటోకు దండ వేసి ఉండడం చూసి దీప బాగా ఎమోషనల్ అవుతూ ఆ దండ పీకేసీ ఫొటో పట్టుకుని నా డాక్టర్ బాబు ఫొటోకి దండ ఎవరు వేశారు? ఈ ఇల్లు ఎవరిది? ఇందతా కావాలనే చేస్తున్నారా?’ అంటూ తలపట్టుకుంటుంది.మరోవైపు కార్తీక్… దుర్గకు, మోనితకి మధ్య ఉన్న సంబంధం గురించి లేవనెత్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో మోనిత కార్తీక్‌ని కొట్టడానికి చేయి ఎత్తి కొట్టబోతుంది. వెంటనే చేయి దించి సారీ చెబుతుంది. కార్తీక్ ఇంకా రెచ్చిపోతాడు. నాకు ఏదో తేడా కొడుతుంది. ఏదొకరోజు నాకు గతం గుర్తొస్తుంది కదా.. అప్పుడే తేలుతుంది నువ్వు దాస్తున్న నిజాలేంటో అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి వెళ్తాడు కార్తీక్.

కార్తీక్ ఫోటోకి దండ వేసిన ఆవిడ ఎవరంటే..?

Deepa

మరోవైపు దీప.. కార్తీక్ ఫొటో పట్టుకుని సంగారెడ్డిలో ఆ ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంటుంది. ఇంతలో ఒకావిడ.. ఒంటినిండా బంగారంతో.. మంచి చీర కట్టుతో హుందాగా అక్కడికి వస్తుంది.ఆవిడ మరెవరో కాదు గతంలో కార్తీక్ ఒకసారి ఆపరేషన్ చేయగా మోనిత ఇచ్చిన మత్తు మందు వలన ఆ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు తప్పు నాదే అని కార్తీక్ ఒప్పుకుని తన ఆస్థి మొత్తం ఆవిడకు ఇచ్చేస్తాడు. ఆవిడే ఈవిడ.దీప చేతిలో ఉన్న ఫోటో చూసి గతం గుర్తుచేసుకుంటూ ఇదంతా దీపకు చెబుతు ఆవిడ ఎమోషనల్ అవుతూ.. ‘ఈ డాక్టర్ బాబు వల్లే మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం.కానీ మంచివాళ్లని దేవుడు ఎందుకు ముందు తీసుకుని వెళ్తాడో తెలియదు.పాపం కారు యాక్సిడెంట్‌లో..’ అని ఆమె ఏదో చెప్పబోతుంటే.. ‘ఆపండి’అంటుంది దీప.

గతాన్ని తలుచుకున్న దీప :

Deepa

డాక్టర్ బాబు బతికే ఉన్నారు’అంటుంది దీప. ‘ఏంటమ్మా.. మీరు అనేది అంటే ఆ డాక్టర్ బాబు భార్యని నేనే.. మేము ఇద్దరం బతికే ఉన్నాం. క్షేమంగా ఉన్నాం’ అంటుంది దీప.అవునా ఎంత శుభవార్త చెప్పావమ్మా.. మా డాక్టర్ బాబు బతికే ఉన్నారంటే అంతకన్నా కావాల్సిందేముంది అంటుంది ఆమె… సరే కానీ నువ్వేమో మా డాక్టర్ బాబు భార్యని అంటున్నావ్.. కానీ ఇలా ఒంటరిగా నిలువు నీడ లేకుండా మా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటమ్మా?’ అంటుంది ఆవిడ. ‘అదంతా పెద్ద కథ.. తర్వాత చెబుతాను.. నా కూతురు ఇప్పుడు ఈ ఊరిలోనే ఉందని తెలిసి వచ్చాను.. నాకు మీ సహాయం కావాలి’ అంటుంది దీప. ‘తప్పకుండా అని చెప్పి నీకోసం ఒక కారుని డ్రైవర్‌ని పంపిస్తాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి వెతుక్కోమ్మా..’ అంటుంది ఆవిడ.

మోనిత మీద ప్రేమ చూపిస్తున్న కార్తీక్:

Monitha, karthik

సీన్ కట్ చేస్తే.. మోనిత.. బయటికి వెళ్లేందుకు మెట్లు దిగుతుంది. ‘ఎక్కడికి?’ అంటాడు కార్తీక్. ‘వావ్ కార్తీక్.. నువ్వు నా గురించి పట్టించుకుంటున్నావా? అబ్బా.. ఇదే కదా నేను కోరుకున్నది అంటూ తెగ మురిసిపోతుంది.వంటలక్క వచ్చాక నా మీద ప్రేమ తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ వంటలక్క వెళ్ళిపోయాక మొదటలా నన్ను ప్రేమిస్తున్నావ్.. చాలా హ్యాపీగా ఉంది కార్తీక్.. నేను అలా షాపింగ్‌కి వెళ్లి వస్తాను’ అంటూ సంబరంగా వెళ్తుంది.కార్తీక్ మాత్రం మనసులో.. ‘నాకు గతం గుర్తొచ్చింది కాబట్టి సరిపోతుంది. లేదంటే నువ్వు చెప్పేవన్నీ నిజం అని నమ్మేవాడ్ని కదే అని అనుకుంటాడు.

సౌర్య జాడ తెలుసుకున్న దీప :

Deepa

మరోవైపు దీప.. సంగారెడ్డిలో సౌర్య ఫొటో పట్టుకుని.. ఊరంతా వెతకడం మొదలుపెడుతుంది. ఆ సమయంలో దీప చాలా సార్లు నీరసించి కళ్లు తిరిగి పడిపోబోతుంది. అయినా కూడా సౌర్య కోసం. వెతకడం మానదు.అయితే ఆ సమయంలో సౌర్య గోడలపై అతికించిన ఓ పోస్టర్ ఎగురుకుంటూ దీప మీద పడటంతో అది చూస్తుంది. వెంటనే దాన్ని పట్టుకుని.. ‘అమ్మా సౌర్యా.. అత్తమ్మా.. నువ్వు ఇక్కడే ఉన్నావా? నా నమ్మకం నిజమైంది. మేము నీకోసం వెతుకుతుంటే నువ్వు మా కోసం వెతుకుతున్నావా?’ అంటూ పొంగిపోతూ.ఆ పోస్టర్‌ని ముద్దాడుతూ బాగా ఏడుస్తుంది.

మళ్ళీ మోసం చేసిన ఇంద్రుడు :

Deepa, sourya

ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆవిడకి ఆ పోస్టర్ చూపించి.. పొంగిపోతూ ‘ఇదిగో తనే నా కూతురు’ అని ఇచ్చిన ఫోన్ నంబర్‌కి కాల్ చేస్తారు. ఆ వ్యక్తి అడ్రస్ చెబుతాడు. తీరా ఇంటికి వెళ్లి.. ఇంద్రుడు ఎక్కడా? అని దీప అడిగితే.. ‘కాల్ చేసింది నాకే కదా.. ఇంద్రుడు ఎవరో నాకు తెలియదు’ అంటాడు ఆ వ్యక్తి. దాంతో దీపకు అర్థమవుతుంది. ‘ఇంద్రుడు మళ్లీ మోసం చేశాడని అంటూ దీప కుమిలికుమిలి ఏడుస్తుంది.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! .


Share

Related posts

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

Ram

SSMB 28: మహేష్ కోసం మలయాళ బ్యూటీని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్..??

sekhar

Bunny Ramcharan: బన్నీ- రామ్ చరణ్ తో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..??

sekhar