NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial today episode review December 1: కార్తీక్ ను కలిసిన డాక్టర్ ఎవరు… ఇంద్రుడు కాలర్ పట్టుకున్న చంద్రమ్మ..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1524వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు డిసెంబర్ 1న ప్రసారం కానున్న Karthika Deepam serial,1524వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1524వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.ఇక ఈరోజు డిసెంబర్ 1 వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

కొత్త డాక్టరమ్మకు కార్తీక్ కు మద్య సంబంధం ఏంటి?

Karthik new doctor

Karthikadeepam serial today episode review November 30:సౌందర్యకు గన్ గురిపెట్టిన మోనిత..మరోపక్క ప్రాణాపాయ స్థితిలో దీప..!
నిన్నటి కథనంలో మోనిత తలకు సౌందర్యకు గన్ గురిపెట్టి తనతో. పాటు కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతుంది..మరోవైపు దీప ఆపరేషన్ గురించి ఓ కొత్త యంగ్ డాక్టర్ కార్తీక్ ను కలుస్తుంది.ఆమె రాకతో సీరియల్ మరింత ఆసక్తిగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఆమె ఎవరు అనేది ఇంకా తెలియలేదు. కార్తీక్‌కి దీప పట్ల ఉన్న ప్రేమని చూసి.. ‘మీ భార్యని చూస్తే.. అసూయగా ఉంది మీ ప్రేమను పొందిన తను చాలా అదృష్టవంతురాలు అని అంటుంది.ఇక కార్తీక్, ఆ యంగ్ డాక్టర్ ఇద్దరూ కలిసి దీపకు ఇంజెక్షన్స్ చేసి.. హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమలోనే కార్తీక్ డాక్టర్ నాకో సాయం చెయ్యాలి మీరు’ అంటాడు కార్తీక్. ‘ఏంటి?’ అని ఆమె అనగానే.. ‘నేనే తనకు ఆపరేషన్ చేస్తున్నాననే విషయం తనకు తెలియనివ్వకండి’ అంటాడు కార్తీక్. ‘అదేంటి డాక్టర్ ఆమెకు ఎందుకు తెలియకూడదు?’ అంటుంది ఆశ్చర్యంగా. ‘మా పరిస్థితి వేరు డాక్టర్.. అదంతా ఇప్పుడు చెప్పలేను. ఈ విషయం తనకు తెలియకూడదు ప్లీజ్’ అంటాడు. ‘సరే, చెప్పను అంటుంది డాక్టర్.

మోనితను గదిలో బంధించిన సౌందర్య:

Soundarya monitha

మరోవైపు మోనితకి గన్ గురిపెట్టి హైదరాబాద్‌లోని తన ఇంటికి తీసుకొస్తుంది సౌందర్య. పైనున్న ఓ గదిలో మోనితను ఉంచి ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి.. నీ బాబుని తీసుకొచ్చినందుకు ఏదో కిడ్నాప్ కేసు పెడతా అన్నావ్ కదా.. ఇప్పుడు పెట్టు చూద్దాం’ అంటుంది సౌందర్య గన్ చేతిలో పెట్టుకుని. ‘ఆంటీ నేను ఏదో సరదాగా అన్నాను.. ప్లీజ్.. నన్ను వదిలేయండి అంటుంది.. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి.. నన్ను పోనివ్వండి’ అంటుంది మోనిత రిక్వస్ట్‌గా. ‘అంత ముఖ్యమైన పనులేంటో? ఏది ఏమైనా.. ఇక నుంచి నువ్వు ఎవరికి ఫోన్ చెయ్యాలన్నా నా కళ్ల ముందే మాట్లాడాలి’ అంటూ వార్నింగ్ ఇచ్చి తలుపు లాక్ చేసుకుని వెళ్లిపోతుంది సౌందర్య.ఇక మోనిత ఆ గదిలోనే ఉండి కోపంతో కేకలు వేస్తుంది.
Karthikadeepam serial today episode review November 29: హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన దీప… సౌందర్యను కూడా మోసం చేసిన ఇంద్రుడు..!
సౌర్య కోసం దీప ఆవేదన.. :

Karthik

మరోవైపు దీపకు మెలుకువ రాగానే అక్కడే కూర్చుని ఉన్న కార్తీక్‌తో.. ‘డాక్టర్ బాబు.. సౌర్య వివరాలు ఏమైనా తెలిశాయా?’ అంటుంది. దీపా ముందు నీ ఆరోగ్యం బాగుపడని’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ.. దీప వినకుండా ఏడుస్తుంది. ‘సౌర్యని వెతికే వరకూ నాకేం ఆరోగ్యం అసవరం లేదు అంటూ ఎమోషనల్ అవుతుంది. ‘సౌర్య దొరికాక నీకు ఏం అయినా ఫర్వాలేదా? అప్పుడే సౌర్య పరిస్థితి ఏంటీ? అని కార్తీక్ దీపకు నచ్చచెబుతాడు.
Karthika Deepam November 28 Today Episode:విషమించిన దీప ఆరోగ్యం.. కొడుకు, కోడలు బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య..!
ఇంద్రుడు కాలర్ పట్టుకున్న చంద్రమ్మ:

Indrudu chandramma

మరోవైపు ఇంటికి వచ్చిన ఇంద్రుడికి దీప రోడ్డు మీద పడిపోయి ఉన్న సీన్‌నే గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ సౌర్యని దాచిపెట్టి తప్పు చేశాను అనుకుంటూ చంద్రమ్మని పక్కకు తీసుకుని వెళ్లి ఆ వంటలక్క, డాక్టర్ బాబులను వెతుకుదాం అంటాడు. దాంతో చంద్రమ్మ ఆవేశంతో ఊగిపోతుంది. ఎందుకు అని అడగగా మన జ్వాలమ్మని.. వాళ్ల సౌర్యగా తిరిగి ఇచ్చెయ్యాలని అనుకుంటున్నా..’ అంటాడు.వెంటనే ఆవేశంగా ఇంద్రుడు కాలర్ పట్టుకుని ఎంతకు అమ్ముడుపోయావ్? నా బిడ్డని వాళ్లకి ఇవ్వడానికి నువ్వు ఎవరు ?’ అంటూ రెచ్చిపోతుంది
దాంతో ఇంద్రుడు ఏడుస్తూ.. జరిగింది అంతా చెబుతాడు. ‘మన జ్వాలమ్మ కోసం వెతికి వెతికి ఆవిడ రోడ్డు మీద పడిపోయింది చంద్రుడు..ఆమెను అలా చూసి నాకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు చంద్రుడు’ అంటూ బాగా ఏడుస్తాడు. ఆ ఏడుపు చూసి.. చంద్రమ్మ కూడా ఏడుస్తుంది. ‘నువ్వు బాధపొద్దు గండా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. బిడ్డని వాళ్లకే ఇచ్చేద్దాం నాకు నువ్వుంటే చాలు గండా..’అంటుంది. ఆ మాటలకు ఇంద్రుడు ఏడుస్తూ చంద్రమ్మని హత్తుకుంటాడు.

కార్తీక్ ను మోసం చేసిన ఇంద్రుడు :

Indrudu Chandramma

మరోవైపు కార్తీక్.. సౌర్య అతికించిన పోస్టర్‌లోని నంబర్ గల వ్యక్తి దగ్గరకు వెళ్లి.. ‘ఈ ఫోన్ నంబర్ నువ్వు ఎంత కాలంగా వాడుతున్నావ్’? అంటాడు. ‘గత మూడేళ్లుగా ఇదే నంబర్ సార్.. మొన్న ఒకావిడ వచ్చి అడిగి వెళ్లారు.. ఇప్పుడు మీరొచ్చారు.. నిజంగా నాకు ఆ నంబర్ ఎవరు వేశారో తెలియదు సార్ అంటూ అబద్దం చెబుతాడు.. మనసులో మాత్రం.. ‘నిజం చెప్పకూడదు చెప్తే ఆ ఇంద్రుడు చంపేస్తాడు’ అనుకుంటూ ఏమి చెప్పాడు. పాపం కార్తీక్ నిరాశగా అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

bharani jella

Padamati Sandhya Ragam: పట్టు చీరలో కొంగు అందాలను ఆరబోసిన ఆద్య… దేవతలాగా ఉన్నారు అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar