32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam: దుర్గను ఇరికించబోయిన మోనిత.. తన గొయ్యి తానే తోవ్వుకోవడం అంటే ఇదేనేమో..!

Share

Karthikadeepam  October 20 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1487వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 20 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. శివ మోనితకి నిజం చెప్పేస్తాడు.దాంతో మోనిత షాక్ అవుతుంది. ‘అంటే.. కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా?’ అని అనుమానిస్తుంది. లేదులే గుర్తొస్తే నాతో ఎందుకు అలా ఉంటాడు అని అనుకుంటుంది. ఇక కార్తీక్ దీప దగ్గర ఉండడం చూసి మోనిత షాక్ అవుతుంది. ఈ క్రమంలోనే నేటి. ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి..ఇక కార్తీక్ వంట పూర్తి చేసి సరిగ్గా తినమని దీప ముందు పెట్టే సరికి.. మోనిత ఆవేశంగా వచ్చేస్తుంది. ‘కార్తీక్ ఏంటిది? ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నావేంటీ?’ అంటూ నిలదీస్తుంది.

మోనిత అనుమానంచిన కార్తీక్ :

Karthik, monitha, deepa

అది సరే కానీ.. నన్ను ఎందుకు రమ్మంటున్నావ్.. మీ దుర్గాగారు లేరా?’ అంటాడు అనుమానంగా మోనితని కార్తీక్ కావాలనే రెచ్చగొడుతూ.అవును డాక్టరమ్మా మొన్నోరోజు శివతో డాక్టర్ బాబుని రెండు గంటలు బయటకి తిప్పమని చెప్పారట కదా నువ్వు దుర్గసార్? అందుకే నువ్వు చెప్పకముందే బయటికి వచ్చేసారు అంటుంది డాక్టర్ బాబు’ అంటూ చురకలు వేస్తుంది దీప. మోనిత రగిలిపోతుంది. ‘ఆ దుర్గాగాడి అంతు చూస్తా ఆ తర్వాత వాళ్ల సంగతి చెబుతాను’ అని మనసులో అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది.

దీపకు ప్రేమగా భోజనం వడ్డించిన కార్తీక్ :

Deepa, karthikఇక కార్తీక్ మాత్రం నువ్వు తిని దీపా అది ఎప్పుడూ ఉండే రచ్చే కదా అంటూ దీపకు ప్రేమగా వడ్డిస్తాడు. ఇక మరోవైపు దుర్గ దగ్గరకు వెళ్లిన మోనిత.. ‘నీ అంత తేలుస్తా ఇక మీ కథ ముగిస్తాను’ అని డైరెక్ట్‌గా పొగరుగా వార్నింగ్ ఇస్తుంది.మోనిత అలా వార్నింగ్ ఇవ్వడంతో దుర్గ కాస్త భయపడి జరిగిన విషయం దీపకు చెబుతాడు.సరే జాగ్రత్తగా ఉండు అంటుంది దీప.

శివకు మరొక పని అప్పగించిన కార్తీక్ :

Karthik, siva


మరోవైపు కార్తీక్ శివ దగ్గరకు వెళ్లి సౌర్యను వెతికావా?’ అంటూ ఆరా తీస్తాడు. ‘వెతికాను.. వెతుకుతూనే ఉన్నాను’ అంటూ బిల్డప్ కొడతాడు శివ. ‘సరే శివా.. నాకు మరో సాయం చెయ్యాలి నువ్వు’ అంటాడు కార్తీక్. ‘చెప్పండి సార్ అంటే ఈ రోజు రాత్రి నుంచి నువ్వు ఆ వంటలక్క ఇంటి ముందే నిద్రపోవాలి’ అంటాడు కార్తీక్. బిత్తరపోతాడు శివ. అది కష్టమే సార్ అంటాడు కానీ కార్తీక్.ఎలాగోలా శివని ఒప్పిస్తాడు. శివ ఒప్పుకోవడంతో కార్తీక్ లోపలికి వెళ్లిపోతాడు.

నీ అంతూచూస్తా అని దుర్గకు వార్నింగ్ ఇచ్చిన మోనిత :

Durga, monitha


మరోవైపు దీప, దుర్గలు వేరువేరుగా మోనిత ఏం చేయబోతుందోనని భయపడుతూ కంగారుపడుతూ గడుపుతారు. మోనిత మాత్రం ఎక్కడికో వెళ్తుంది. అక్కడ కూడా మోనిత చాలా నమ్మకంగా ధైర్యంగా ఉంటుంది. ‘ఈ రోజుతో వాళ్ల గొడవ వదిలిపోతుంది. కార్తీక్‌ని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లిపోతాను’ అని ఫిక్స్ అవుతుంది.కాసేపటికి దీప కంగారుగా కార్తీక్ దగ్గరకు వస్తుంది. డాక్టర్ బాబు మోనిత ఎక్కడుంది? తను దుర్గని నన్ను లేకుండా చేస్తానని దుర్గతో ఛాలెంజ్ చేసిందట.అలాగే మిమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్లిపోతుందేమో అంటూ కంగారుపడుతూ ఉంటుంది దీప.

దుర్గను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు :

Durga arrest

ఇంతలోనే మోనిత కారు ఇంటి ముందు ఆగుతుంది. ఆ వెనుకే పోలీసుల కారు కూడా ఆగుతుంది. అందులోంచి పోలీసులు దిగుతారు. వెంటనే మోనిత.రండి సార్ అంటూ వాళ్లని తీసుకొస్తుంది. దుర్గను చూపించి అదిగో వాడే.. అరెస్ట్ చేయండి అంటుంది మోనిత. అంతా షాక్ అవుతారు.వెంటనే కానిస్టేబుల్స్ పరుగున వెళ్లి దుర్గని అక్కడికి బలవంతంగా లాక్కొస్తారు. నేనేం తప్పు చేశాను అంటే ఆ వచ్చిన ఎస్‌ఐ వీడియో చూపిస్తాడు. అది మోనిత తీసిన వీడియోనే. ‘రేయ్ ఎందుకురా ఆ కేసు గురించి భయపడతున్నావ్? ఆధారాలు లేకుండా పోలీసులు మనల్నే ఏం పీకలేరు.. నువ్వు మాత్రం ఆ బ్యాంక్ వైపు వెళ్లకు. మిగిలింది నేను చూసుకుంటాను అని దుర్గ ఎవరితోనే మాట్లాడుతున్న వీడియో అది..ఇక ఆ వీడియోతో దుర్గ ఏదో పెద్ద నేరమే చేశాడని తేలిపోవడంతో.. ‘పదరా అసలు ఏం చేశావో స్టేషన్‌లో రప్పిస్తాను’ అంటూ దుర్గని తీసుకుని బయలుదేరతాడు ఎస్‌ఐ.

మోనితకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్ :

Monitha plan rivers


అప్పుడే ‘ఒక్కనిమిషం ఆగండి ఎస్ఐ గారు అంటాడు కార్తీక్. ‘మోనితా.. మరి దుర్గ క్రిమినల్ అయితే.. అలాంటి క్రిమినల్‌ని స్నేహితుడు, బంధువు అని ఎందుకు చెప్పావ్‌ ఇన్నిరోజులు?’ అంటాడు. మోనిత బిత్తరపోతుంది. ‘ఎస్‌ఐ గారు.. ఎందుకైనా మంచిదని దుర్గ వచ్చిన రోజే నేనో వీడియో రికార్డ్ చేశాను. అది చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది’ అంటూ వీడియో చూపిస్తాడు. అందులో దుర్గ ‘మోనిత నేను బెస్ట్ ఫ్రెండ్స్, బంధువులం కూడా తను నేను కలిసే ఏ పని అయినా చేసేవాళ్లంఅంటూ ఉంటుంది. అది చూసిన పోలీస్ ఆఫీసర్ ఏంటి మేడమ్ అంటే వీడు చేసిన పనుల్లో మీకు భాగం ఉందా? ఇద్దరూ కలిసే నేరాలు చేస్తున్నారా’ అంటాడు ఎస్ఐ కోపంగా.అయ్యో ఒక్కనిమిషం సార్.. వీళ్లు నేరం చేశారని నేను అనడంలేదు. తను గతం మరిచిపోయింది ఒకరోజు దుర్గ మంచివాడు అంటుంది. మరో రోజు దుర్గ చెడ్డవాడు అంటుంది.. తనకి ఏం గుర్తుండదు అంటూ సమాధానం ఇస్తాడు కార్తీక్. ఆ మాటలకు మోనిత షాక్ అయి ఏంటి నా ప్లాన్ నాకే రివర్స్ లో చెబుతున్నాడు అనుకుంటుంది.దీప, దుర్గ కూడా షాక్ అవుతారు. ‘డాక్టర్ బాబు ఏంటి మోనితకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు’ అనుకుంటారు దీప, దుర్గలు మనసులో. ‘అవునా.. మరి ఈ వీడియో సంగతేంటీ’ అంటాడు పోలీస్ కోపంగా. ‘సార్ దీని గురించి నేను చెబుతాను అంటూ దుర్గా ఏదోలా కవర్ చేస్తాడు.

వంటలక్కకు ప్రాణహాని:

Karthik saves durga, deepa


ఏంటి మేడమ్ మా టైమ్ వేస్ట్ చేశారు అంటూ మోనితని తిట్టి పోలీసులు వెనుదిరగబోతుంటే కార్తీక్ వాళ్లని ఆగమంటాడు. ‘సార్ ఈవిడ పేరు వంటలక్క.. ఈవిడకు ప్రాణహాని ఉంది. తన కోసం మీరే రక్షణ కల్పించాలి’ అంటాడు కార్తీక్. మోనిత షాక్ అవుతుంది. ‘గతం గుర్తొచ్చిందా?’ అని అనుమానిస్తుంది. దీప ఆనందానికి అవధులే ఉండవు. ‘ఆ మాత్రానికి రక్షణ కల్పించడం ఎందుకు? ఎవరి వల్ల ప్రమాదమో చెప్పండి.. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను’ అంటాడు పోలీస్. దాంతో కార్తీక్ తల పట్టుకుని ఏదో గుర్తు చేసుకుంటున్నట్లుగా నటిస్తాడు. మోనిత కంగారు పడడంతో సీరియల్ అయిపోతుంది.


Share

Related posts

సినిమా ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో ఇలియానా కీల‌క నిర్ణ‌యం.. అదైనా క‌లిసొచ్చేనా?

kavya N

Chiranjeevi Pruthviraj: ప్రజెంట్ చిరంజీవి సినిమా నేను డైరెక్ట్ చేయాల్సింది…పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్..!!

sekhar

Devatha Serial: దేవత సీరియల్ హవా కొనసాగుతోంది..! మళ్ళీ అదే స్థానంలో..!

bharani jella