21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial November 25 episode : దుర్గ చాప్టర్ క్లోజ్ చేసిన మోనిత..తర్వాత దీపేనా…??

Share

 

Karthikadeepam serial today episode review November 25 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1519వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 25న ప్రసారం కానున్న Karthika Deepam serial,1519వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1519వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్‌లో దీప.. సౌర్యని వెతికే క్రమంలో సౌర్య అతికించిన పోస్టర్స్‌లో ఒక పోస్టర్ దీప కంట పడగా ఆ నెంబర్ కి కాల్ చేసి అతడ్ని కలుస్తుంది దీప.ఆ ఇంద్రుడు మళ్లీ మోసం చేశాడు’ అని కుమిలికుమిలి ఏడుస్తుంది.

మోనిత మళ్ళీ జైలుకు వెళ్లానుందా..?

Monitha

సీన్ కట్ చేస్తే దుర్గకు నిజం చెబుతాడు కార్తీక్. ‘మోనిత సంగతి నువ్వు చూసుకో.. నేను దీప దగ్గరకు వెళ్తాను’ అంటూ డీల్ మాట్లాడుకుంటాడు. దుర్గ ‘మీరు వెళ్లండి సార్ నేను చూసుకుంటాను’ అనడంతో.. కార్తీక్ సంగారెడ్డి బయలుదేరతాడు.
ఇక సౌందర్య, ఆనందరావులు మోనిత గురించి మాట్లాడుకుంటారు.మోనితది చాలా క్రిమినల్ బ్రెయిన్ సౌందర్యా’ అంటాడు ఆనందరావు. ‘క్రిమినల్ అంటే గుర్తొచ్చింది.. అప్పట్లో తను పెరోల్ మీద జైల్ నుంచి బయటికి వచ్చింది కదా.. ఆ తర్వాత మళ్లీ జైల్‌కి వెళ్లలేదట..’ అంటుంది సౌందర్య. ‘అవునా.. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే వేరే రాష్ట్రంలో ఉంది కదండి’ అంటుంది సౌందర్య. రాష్ట్రమే కదా సౌందర్య.. దేశం కాదు కదా.. పోనీ మనకు తను ఎక్కడుందో తెలుసు కాబట్టి.. ఆ సమాచారం పోలీసులకి ఇస్తే ఎలా ఉంటుంది?’ అంటాడు ఆనందరావు. వద్దు అండి ఆ మోనిత మనకు తెలియకుండా ఏదో చేస్తుంది కదా.. అదేంటో తెలుసుకోవాలి అంటుంది సౌందర్య.

దుర్గని జైల్లో పెట్టించిన మోనిత :

Durga

ఇక మోనిత ఎవరో ఒకావిడని కలిసి ఒక ఫైల్ ఇచ్చి ‘తేడా రాకూడదు.నేను చెప్పినట్లు చేయండి’ అనేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఆమె అలా వెళ్లగానే దుర్గకు కాల్ చేసి.. ‘ఇంట్లో కార్తీక్ ముందు కాదురా నీ ప్రతాపం.దమ్ముంటే బయటికి రా చూసుకుందాం అంటూ దుర్గను రెచ్చగొడుతుంది. ‘ఎక్కడికి రావాలో లొకేషన్ పంపించు.. వచ్చే తేల్చుకుంటాను’ అని రెచ్చిపోతాడు దుర్గ.
ఇక కార్తీక్.. మోనిత కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ లేకపోయేసరికి ఏదో ప్లాన్ చేసిందన మాట అంటూ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక మోనిత పంపించిన లొకేషన్‌కి దుర్గ రాగానే.. దుర్గను మరింత రెచ్చగొడుతుంది. దాంతో దుర్గ.. ‘నా నుంచి నిన్ను ఎవడూ కాపాడలేడే.. నేను హైదరాబాద్‌లో చాలా నేరాలు చేశాను పోలీసులు పట్టుకోగలగారా? అంటూ తను చేసిన నేరాల చిట్టా అంతా చెప్పడంతో అప్పుడే పోలీసులు చుట్టుముట్టేస్తారు దుర్గని. షాక్ అవుతాడు దుర్గ.నువ్వు వాగింది మొత్తం ఇప్పుడే పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. నువ్వు చచ్చేదాకా జైల్లోనే’ అంటూ టాటా బైబై చెబుతుంది మోనిత. ఆ సీన్ కార్తీక్ చాటుగా చూస్తాడు. ‘అంటే.. మోనిత నాతో షాపింగ్ అని చెప్పి.. దుర్గ అడ్డు తొలగించుకుందా?అనుకుని ఒంటరిగా ఉన్న దీప దగ్గరకు వెళ్తాడు.

మోనిత అంతు చూడడానికి బయలుదేరిన సౌందర్య:

Soundarya

మరోపక్క సౌందర్య ఆనందరావు, హిమలకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతుంది సౌందర్య. వెళ్తూ వెళ్తూ దండేసి ఉన్న కార్తీక్,దీపల ఫొటోల దగ్గర నుంచుని ఎలాగైనా సౌర్యని తీసుకొస్తాను అందుకే వెళ్తున్నాను’ అని ఫొటోలతో చెప్పి బయలుదేరుతుంది. మరోవైపు మోనిత తన ఇంట్లో.. తాపీగా కూర్చుని అమ్మయ్యా దుర్గ గాడి గొడవ వదిలిపోయింది. ఇక ఆ వంటలక్క కూతుర్ని వెతుక్కోవడానికి పోయింది. ఆ దీప వచ్చేలోపు కార్తీక్‌ని నావైపు తిప్పుకుని ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్లిపోవచ్చు అనుకుంటుంది.ఇంతలో శివ పరుగున వచ్చి సార్‌కి వంటలక్క కాల్ చేసింది.ఆ తర్వాత సార్ కారు వేసుకుని ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్లిపోయారు’ అంటాడు. దాంతో మోనిత రగిలిపోతుంది.

నన్ను నీ భర్తగా అనుకోమని దీపకు చెప్పిన కార్తీక్:

Deepa, karthik

దీపను కలిసిన కార్తీక్ మరునాడు ఉదయాన్నే సౌర్యని వెతుకుతూ ఉంటారు. మరోవైపు అదే సంగారెడ్డిలో సౌందర్య, ఆనందరావు, హిమలు కూడా ఇంద్రుడు ఫొటో పట్టుకుని.. ఇంద్రుడి కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్లకి ఎలా ఆ ఫోటో వచ్చిందో తెలియదు.. ఇక కార్తీక్, దీపలకు ఎక్కడా సౌర్య సమాచారం దొరకదు. దీపకు ఆరోగ్యం బాగోక ఓ చోటకూర్చుని.. ‘నా జీవితం ఏంటో?మీకు గతం గుర్తు రాలేక ఒక కష్టం.బిడ్డ కనిపించక మరో కష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.దీప బాధ చూసి తట్టుకోలేని కార్తీక్ ‘నాకు గతం గుర్తు రాకపోయినా సరే నేను నిన్ను నమ్ముతున్నాను.. నన్నే నీ భర్త అనుకో’ అంటాడు.కార్తీక్ మాటలకు పొంగిపోతూ పైకి లేస్తుంది దీప. అక్కడితో నేటి కథనం ముగిసింది. మరి నెక్స్ట్ ప్రోమోలో మాత్రం కుటుంబం అంతా ఒకచోట కలిసినట్టు చూపిస్తారు.. అదేంటో తెలియాలంటే రాబోయే ఎపిసోడ్ దాక ఆగాలిసిందే..!


Share

Related posts

ఎన్టీఆర్ మూవీని రిజెక్ట్ చేసిన స‌మంత‌.. కార‌ణం అదేన‌ట‌?!

kavya N

నాలుగైదేళ్లుగా హిట్ లేదు.. `ఒకే ఒక జీవితం` స‌క్సెస్‌పై శ‌ర్వా ఎమోష‌న‌ల్‌!

kavya N

Prabhas: మొహం ఎందుకు అలా పెట్టుకున్నావ్ రా అని ప్రభాస్ తిట్టాడు శర్వానంద్ వైరల్ కామెంట్స్..!!

sekhar