NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial November 9 episode: ఛీ.. ఛీ మోనిత ఇదేమి పాడు పని..దీప ఇంట్లో కార్తీక్ కు అడ్డంగా బుక్ అయిన దుర్గ, మోనిత.

Karthikadeepam serial today episode review November 9 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1505వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 9న ప్రసారం కానున్న Karthika Deepam serial,1505వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1505 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లోఇంద్రుడు, చంద్రమ్మలు ఖాళీ చేసిన ఇంట్లో దొరికిన ఫొటో ఆధారంగా సౌర్య వాళ్ల దగ్గరే ఉందనే విషయాన్ని దీప, కార్తీక్ ఇద్దరూ తెలుసుకుని చాలా బాధపడతారు.అయితే దీప బయటకు ఏడుస్తుంది కానీ కార్తీక్ మాత్రం మనసులోనే అల్లాడిపోతున్నాడు.ఈ క్రమంలోనే నేటి కథనం ఉత్కంఠగా సాగింది.

ఇంద్రుడు మీద సౌర్యకు వచ్చిన అనుమానం:

sourya with indurdu
sourya with indurdu

సౌర్యను తీసుకుని వెళ్లిన ఇంద్రుడు ప్రవర్తన,మాటల మీద సౌర్యకు అనుమానం కలుగుతుంది. తన తల్లిదండ్రుల పేర్లు చెబుతున్న సౌర్యకు అడ్డుపడి ఇంద్రుడు కావాలనే.. సౌర్య తల్లిదండ్రుల పేర్లుగా ఇంద్రుడు, చంద్రమ్మ అని చెప్పడంతో సౌర్య షాక్ అవుతుంది. అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మా జ్వాలమ్మా.. నువ్వు ఆలోచించేది మీ అమ్మానాన్నలుగా మా పేర్లు చెప్పుకున్నందుకేనా? మేము అలా ఎందుకు చెప్పామంటే.. రేపు ఎప్పుడైనా మీ నాన్నమ్మవాళ్లు ఈ గుడికి వచ్చినప్పుడు పంతులు కానీ వాళ్లకి మీ అమ్మానాన్నల పేర్లు చెబితే.. వాళ్లకు మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది కదమ్మా.. అందుకే అలా చేశాను.. ఈ ఊరిలో నువ్వు కూడా ఎవరికీ మీ అమ్మానాన్నల పేర్లు చెప్పొద్దు అని చెప్పడంతో. సౌర్య నమ్మేస్తుంది.వెంటనే బాబాయ్ మనం సంగారెడ్డి ఎప్పుడు వెళ్దాం?’ అంటుంది సౌర్య. ‘ఎందుకు జ్వాలమ్మా’ అనేస్తాడు పొరబాటున. ‘అదేంటి బాబాయ్.. అమ్మానాన్నలని వెతకడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది అంటుంది సౌర్య..అది గుర్తుందమ్మా.. కానీ ఇప్పుడు మనం మీ అమ్మా నాన్నలని ఎంత జాగ్రత్తగా వెతుకుతామో.. అంతే జాగ్రత్తగా ఉండాలమ్మా అని సౌర్య నమ్మేలాగా ఇద్దరు తన మైండ్ ని డైవర్ట్ చేస్తారు.

రెడ్ హ్యాండెడ్ గా కార్తీక్ కు దొరికిపోయిన మోనిత, దుర్గా :

durga with mounitha
durga with mounitha

మరోవైపు మోనిత కార్తీక్, దీప ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ దీప ఇంటి ముందు నిలబడి ఆలోచిస్తుంది. ఇంతలో దుర్గ వచ్చి.. ‘రా మోనితా.. కూర్చుని మాట్లాడుకుందాం’ అంటూ బలవంతంగా లోపలికి తీసుకుని వెళ్తాడు.అప్పుడే కార్తీక్, దీప ఇద్దరు కూడా వస్తారు.దుర్గను చూసిన కార్తీక్ ‘ఏంటి దుర్గగారు ఇక్కడున్నారు? అంటాడు అదే కార్తీక్ సార్.. దీప ఇంట్లో ఎవ్వరూ లేరు.. రా మాట్లాడుకుందాం అని ఇక్కడికి పిలిచింది. లేదు కార్తీక్ సార్ దీపమ్మ ఇంటికే ముందొస్తాడు.. అక్కడైతే మనకు ఇబ్బంది అని ముందే చెప్పాను.మోనిత వినలేదు అంటూ మోనితను అడ్డంగా ఇరికించేసి వెళ్తాడు దుర్గ. మోనిత అయోమయంగా కార్తీక్ వైపు చూస్తుంది ‘మీకు ఆ ఇల్లు సరిపోవట్లేదా మోనితా? ఈ ఇంట్లోకి కూడా వచ్చారు?’ అంటూ తప్పుగా మాట్లాడతాడు కార్తీక్. దాంతో మోనిత రెచ్చిపోతుంది. ‘ముందు మీ సంగతి తేల్చండి.. పొద్దున్నుంచి ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు?’ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది మోనిత.ఇక దీప అప్పటికే బాధలో ఉండడంతో ‘ఈ రచ్చ నా వల్ల కాదు డాక్టర్ బాబు తనని తీసుకుని వెళ్లిపోండి డాక్టర్ బాబు’ అంటుంది. దాంతో కార్తీక్ మోనితనే తిట్టి.. అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు.

ఆనంద్ ను తెచ్చుకుందాం అన్న హిమ :

karthik with mounitha
karthik with mounitha

మరోవైపు హైదరాబాద్ చేరుకున్న హిమ, ఆనందరావులు.. సౌర్యని వెతకడం గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో దారిలో వాళ్లకి అనుకోకుండా లక్ష్మణ్ కనిపిస్తే.. మోనిత కొడుకు ఆనంద్ ఎక్కడున్నాడు అంటూ అడుగుతుంది హిమ. మోనిత దగ్గరే ఉన్నాడు అని చెప్పి లక్ష్మణ్ వెళ్లిపోతాడు. దాంతో ఆనంద్‌ని మనం తెచ్చేసుకుందాం తాతయ్యా అంటుంది హిమ. ‘సరే మోనిత దగ్గరకు వెళ్లి.. ముందు ఆనంద్‌ని తెచ్చుకుందాం.. ఆ తర్వాత సౌర్య గురించి కూడా ఆలోచిద్దాం అంటాడు ఆనందరావు

మోనితకు అడ్డంగా దొరికిన కార్తీక్ :

mounitha reaction
mounitha reaction

ఇక మోనితకి కార్తీక్ మీద అనుమానం వచ్చి.. కబోర్డ్స్‌లో ఉన్న కార్తీక్ షర్ట్ జేబులు వెతుకగా ఓ పర్స్ దొరుకుతుంది. అందులో చాలా డబ్బులు ఉంటాయి. ‘ఇన్ని డబ్బులు కార్తీక్‌కి ఎక్కడివి?’ అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ వచ్చేస్తాడు. దాంతో మోనిత ఎలాగోలా కవర్ చేస్తుంది. కానీ కార్తీక్ మాత్రం చిల్లరి వేషాలు వేయొద్దు మోనితా.. నీకేదో డౌట్ వచ్చిందని నాకు అర్థమైంది. డైరెక్ట్‌గా అడుగు అంటాడు కార్తీక్. వెంటనే మోనిత ఇంత డబ్బు ఎక్కడిది నీకు?’అంటుంది . ఆ ప్రశ్నకు కార్తీక్ కంగారు పడకుండా మోనితకి నా మీద డౌట్ వచ్చింది..ఏదోలా బయటపడాలి అనుకుని మెడలో ఉన్న చైన్ తాకట్టు పెట్టాను అంటాడు.అవునా..? అంత అవసరం ఏమొచ్చింది? నన్ను అడిగితే లేవు అన్నానా? నన్ను అడిగితే ఏమైంది?’ అంటూ నిలదీస్తుంది మోనిత.
ఎందుకంటే నీ మీద బతకడం నాకు ఇష్టం లేదు కాబట్టి..’ అంటాడు కార్తీక్.

టైమ్ చూసి కార్తీక్ దగ్గర మోనితను ఇరికించిన దుర్గ:

miunitha fire
miunitha fire

ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్.. ఇదంతా మన డబ్బు.. మనది నన్ను వేరు చేసి చూడకు అని మోనిత అనగా సరిగ్గా అప్పుడే దుర్గవచ్చి మోనితా ఈ గొలుసు ఎలా ఉంది?’ అంటాడు మెడలోని గొలుసు చూపిస్తూ. ‘నాకేం తెలుసురా? నన్ను అడుగుతావ్’ అంటుంది మోనిత.అదేంటి మోనిత.. ఇచ్చింది నువ్వే కదా అంటాడు దుర్గ.నా మెడలో గొలుసు లేకపోతే ఏంటీ నువ్వు అభిమానించే వాళ్ల దగ్గర ఉంది కదా?’ అంటాడు కార్తీక్ కావాలనే. ‘కార్తీక్ నాకు దానికీ ఏ సంబంధం లేదు.. వాడు అబద్దం చెబుతున్నాడు’ అంటుంది మోనిత. కార్తీక్ కావాలనే మోనితను తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత ఆ డబ్బులు పర్స్ పక్కనే పెట్టి… దుర్గ కాలర్ పట్టుకుంటుంది. ‘ఇలా తగులుకున్నావేంట్రా? నన్ను వదిలిపెట్టవా? అంటుంది.ఇక దుర్గ మాత్రం అదెంత పని బంగారం.. నువ్వు కార్తీక్ సార్‌ని వదిలిపెట్టెయ్.. నేను నిన్ను వదిలేస్తాను’ అంటాడు దుర్గ. ‘వదలను.. కార్తీక్‌ని వదిలే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటుంది మోనిత రగిలిపోతూ. దుర్గ వెళ్ళగానే మోనిత మాత్రం కోపంగా అసలు కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా లేదా? గుర్తొచ్చే నాటకం ఆడుతున్నాడా?’అని ఆలోచిస్తూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri