NewOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial today episode :. సౌర్య గురించి తెలుసుకున్న మోనిత.. రోజు రోజుకు క్షీణిస్తున్న దీప ఆరోగ్యం..!

Share

Karthikadeepam serial today episode review November 22 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1516వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 22న ప్రసారం కానున్న Karthika Deepam serial,1516వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1516 వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.

పోస్టర్స్ చూసి షాక్ అయిన ఇంద్రుడు :

Advertisements
Sourya

గత ఎపిసోడ్ లో శౌర్య ఎక్కడికి వెళ్లిందో అని ఇంద్రుడు-చంద్రమ్మ ఆలోచిస్తుంటారు..ఇంతలో పోస్టర్స్ తీసుకొచ్చి షాక్ ఇస్తుంది శౌర్య. ఆ పోస్టర్లో సౌర్య ఫోటో వేయించి,కింద ఇంద్రుడు వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి ఉంటుంది. ఆ పేపర్ ఇంద్రుడుకు చూపించి అమ్మ నాన్న ఫోటోలు వేయిద్దాం అంటే నా దగ్గర వాళ్ళ ఫొటోస్ లేవు అందుకే నా ఫోటో వేయించి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను అంటుంది సౌర్య.బాబాయ్ ఈ సంగారెడ్డి మొత్తం ఈ పోస్టర్లు అతికిద్దాం అంటే సరే సరే అమ్మ అని అంటాడు ఇంద్రుడు.

మోనితను తప్పించుకుని హాస్పిటల్ కు చేరుకున్న కార్తీక్ :

Karthik

మరోవైపు హాస్పిటల్లో కార్తీక్..ఓ పేషెంట్ కి ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో కార్తీక్ కి డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఆ డబ్బులు చూసిన కార్తీక్ మొన్న చైన్ అమ్మానని చెప్పాను ఇప్పుడు ఉంగరం అమ్మానని మోనిత కు చెప్పాలి లేకపోతే అనుమానం వస్తుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మోనిత కార్తీక్ ని ఫాలో అవుదాం అనుకుంటే కార్తీక్ మిస్ అయిపోయాడు అనుకుని కార్తీక్ కోసం దీప ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది మోనిత.

మోనిత కంట పడ్డ సౌర్య ఫోటో :

Monitha, deepa

అప్పుడు మోనిత శౌర్య ఇంద్రుడు దంపతులు ఉన్న ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.ఇంతలో దీప అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ మోనిత చేతిలో ఉన్న ఆ ఫోటోని లాక్కుంటుంది. అప్పుడు నీ కూతురు కనిపించిందా వంటలక్క అని అడుగుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి ఇదిగో చూడు కార్తీక్… దీప కూతురు అని అనడంతో వెంటనే కార్తీక్ వంటలక్క కూతురు నీకు కనిపించిందా అని మోనిత ని ఎదురు ప్రశ్నిస్తాడు.సర్లేగాని గాని కార్తీక్ నువ్వెక్కడికి వెళ్లావ్ అని మోనిత అడగడంతో ఉంగరం తాకట్టు పెట్టడానికి వెళ్లానులే అంటాడు. ఈ వంటలక్క కోసమేనా అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. ఈ ఫోటోని మోనిత కంట కనపడకుండా జాగ్రత్తగా ఉంచు అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

సౌర్యను మోసం చేస్తున్న ఇంద్రుడు :

Sourya

సీన్ కట్ చేస్తే ఇంద్రుడు సౌర్య కలసి గోడలకి పోస్టర్స్ అతికిస్తూ ఉంటారు.  చంద్రమ్మ మాత్రం  శౌర్య పోటోలకు రంగులు వేస్తూ ఆ ఫోటోలు నెంబర్లు కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటుంది. అయితే వాటిలో ఓ ఫొటో ఊడి ఎగిరిపోతుంది. దానిని చంద్రమ్మ గమనించదు.మళ్ళీ సీన్ దీప దగ్గర ఓపెన్ అవుతుంది కార్తీక్ వెళ్లేసరికి దీప పడుకుని ఉంటుంది..ఏమైందని అడిగితే ఈ మధ్య నాకు బాగుండడం లేదని చెబుతుంది. హాస్పిటల్ కి వెళదాం అనగానే నా కూతురు కనిపిస్తే నేను బాగా అయిపోతాను డాక్టర్ బాబు అనగానే..ఫస్ట్ శౌర్య గురించి ఆలోచించడం మానేయ్ శౌర్య దొరుకుతుందని దీపకు ధైర్యం చెబుతాడు కార్తీక్.

మోనితను ఏడిపిస్తున్న దుర్గ:

Monitha, durga

ఇక మోనిత ఇంటికెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది…ఎవరు వేశారని ఆలోచిస్తూ కొంపతీసి సౌందర్య ఆంటీ ఏమైనా వచ్చిందా అని అనుమాన పడుతుంది..ఇంతలో కిటికీ లోంచి దుర్గ బంగారం అని పిలుస్తాడు. బయట తాళాలు వేసి లోపల ఏం చేస్తున్నావురా అని అరుస్తుంది మోనిత. అప్పుడు దుర్గ నువ్వు ఇంటి బయట ఎవరి తల పగలగొట్టావో చెబితే తాళం తీస్తానంటాడు. నాకేం తెలియదని మోనిత చెప్పినా దుర్గ అస్సలు వదలడు.ఇక రేపటి ఎపిసోడ్ లో అమ్మా నాన్న గురించి శౌర్య ఆలోచిస్తుంటుంది…మరోవైపు దీప సంగారెడ్డి వెళ్లేందుకు బయలుదేరుతుంది. అక్కడే ఉందని నమ్మకం ఏంటని కార్తీక్ అడిగితే… ఇక్కడ ఏ నమ్మకంతో వెతికానో అక్కడా అదే నమ్మకంతో వెతుకుతాను అని దీప అంటుంది.


Share

Related posts

Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2” విత్ NBK కి సంబంధించి అధికారిక ప్రకటన చేసిన ఆహా..!!

sekhar

టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్ట‌మ‌న్న `లైగ‌ర్‌` బ్యూటీ.. విజ‌య్ ఫ్యాన్స్ హ‌ర్ట్‌!

kavya N

“పుష్ప 2″లో పవన్ కళ్యాణ్ విలన్..!!

sekhar