21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial today episode review November 23:సీరియల్లో మరో ట్విస్ట్..కార్తీక్ ఫోటోకి దండ పడింది..!

Share

Karthikadeepam serial today episode review November 23 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1517వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 23న ప్రసారం కానున్న Karthika Deepam serial,1517వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1517వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లో దుర్గ దుర్గ మోనిత ఇంటికి ఒకవైపు తాళం వేసి.. మరోవైపు గడియ పెట్టుకుని లోపలకి వెళ్తాడు. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది.

కార్తీక్ దగ్గర మోనితను ఇరికించిన దుర్గ:

Karthik, durga, monitha
Karthik, durga, monitha

 

తలుపులకు తాళాలు వేసి.. కీస్ కూడా తన దగ్గరే ఉంచుకుంటాడు దుర్గ. తలుపు తియ్యాలన్నా.. కీస్ ఇవ్వాలన్నా.. ఆ రోజు ఎవరి తల పగలగొట్టావో చెప్పు చాలు’ అంటూ బెదిరిస్తాడు. ‘నేను నిజం చెబితే కార్తీక్ నా తల పగలగొడతాడు’ అని మనసులో అనుకున్న మోనిత.. అసలు నిజం చెప్పదు. నోరు తెరవదు. ఇంతలో కార్తీక్ వస్తాడు.దుర్గని కిటికీలోంచి లోపల ఉండటం చూస్తాడు కార్తీక్. ఇక కార్తీక్ రావడం చూసి వెంటనే కార్తీక్ సార్.. వచ్చారా? ఎందుకో మరి.. నన్ను లోపలే ఉండు.. కార్తీక్ వచ్చినా వంటలక్క ఇంటికి వెళ్లిపోతాడు.. ఆ తర్వాత నేను లోపలికి వచ్చేస్తానని చెప్పి.. ఈ మోనిత తాళం వేసి లోపల పెట్టింది నన్ను. తాళం కూడా నా చేతికే ఇచ్చింది సార్’ అంటాడు కావాలనే. దాంతో కార్తీక్ దొరికిందే ఛాన్స్ అనుకుంటూ.. ‘ఛా మోనితా.. నువ్వు మారవా? ఇంత నీతి తప్పి ఎలా బతుకుతున్నావ్’ అంటూ తిట్టి వెళ్లిపోబోతాడు. ‘కార్తీక్.. ఈ దుర్గ ఆ వంటలక్క మనిషి కార్తీక్.. నన్ను నమ్ము’ అంటూ అరుస్తుంది మోనిత.అయినా కార్తీక్ వినకుండా వెళ్ళిపోతాడు. సరే పనైపోయిందిగా బంగారం అంటూ తాళాలు తియ్’ అంటూ కీస్ మోనిత చేతికి ఇస్తాడు. చేసేది లేక తాళం తీస్తుంది.

తల్లి తండ్రుల కోసం సౌర్య ఆవేదన :

Sourya

సీన్ కట్ చేస్తే.. సౌర్య ఇంట్లో సోఫాలో కూర్చుని ఓ ఫోస్టర్ పట్టుకుని బాగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మానాన్న మీరు నా దగ్గరకు వచ్చేయండి అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో చంద్రమ్మ, ఇంద్రుడు వచ్చి భోజనానికి రమ్మంటారు. నాకు ఆకలిగా లేదు.. నేను తినను మీరు తినండి అంటుంది సౌర్య.అప్పుడే చంద్రమ్మ, ఇంద్రుడు.. సౌర్యని ఓదారుస్తారు.అప్పుడే చంద్రమ్మ.. ‘అమ్మా జ్వాలమ్మా.. త్వరగా తింటే గుడికి వెళ్లాలి తల్లీ.. మాకో బిడ్డ పుట్టి, చనిపోయిందని చెప్పాం కదా. ఆ పాప పుట్టిన రోజు రేపు.. ప్రతి ఏడాది గుడికి వెళ్తాం. అమ్మా జ్వాలమ్మా నాదో కోరిక తీరుస్తావా తల్లీ?’ అంటుంది చంద్రమ్మ. ‘ఏంటి పిన్నీ?’ అంటుంది సౌర్య. ‘మా బిడ్డ బతికే ఉంటే నీ అంత పాప అయ్యేది.. దేవుడే నిన్ను పంపించాడని మేము అనుకుంటున్నాం.. నన్ను అమ్మా అని పిలుస్తావా?’ అంటుంది ఎమోషనల్‌గా. సౌర్య బాధగా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కార్తీక్ మాట వినని దీప :

Karthik, deepw

సౌర్యను వెతకడం కోసం దీప బట్టలు సర్థుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ఎక్కడికి దీపా అంటాడు. ‘సంగారెడ్డి వెళ్తున్నాను డాక్టర్ బాబు అంటుంది.దీపా ప్లీజ్.. అది చాలా పెద్ద ఊరు కదా? ఎక్కడని వెతుకుతావ్.. పైగా నీకు ఆరోగ్యం కూడా బాలేదు కదా?’ అంటాడు కార్తీక్. ‘ఈ ఊరుకంటే పెద్దది కాదు కదా డాక్టర్ బాబు.. ఈ ఊరిలో ఏ నమ్మకంతో వెతికానో ఆ ఊరిలోనూ అదే నమ్మకంతో వెతుకుతాను’ అంటుంది దీప. ‘పోనీ ఈ రోజుకి ఉండిపో.. రేపు నేను వస్తాను అన్నా దీప వద్దు అంటుంది.. ఆ మాటలు మోనిత చెవినపడతాయి.‘నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే గతం గుర్తొస్తుందనే భయం.. నువ్వు పోతే నాలుగు రోజుల్లో నిన్ను మరిచిపోయేలా చేస్తాను.. ఇక్కడి నుంచి తీసుకునిపోతాను’ అని ఫిక్స్ అయ్యి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.సరే దీపా జాగ్రత్తగా వెళ్లు అని కొంత డబ్బులు ఇస్తాడు.

మోనిత అంతు చుడడానికి బయలుదేరిన సౌందర్య:

Soundarya

ఇక మరోవైపు సౌందర్య బ్యాగ్ సర్థుకుంటుంది. ‘డాక్టర్ వెళ్లమని చెప్పాకే మోనిత ఇంటికి వెళ్తాను.. ఈలోపు బట్టలు సర్థుకుంటున్నా అంతే’ అంటుంది భర్త ఆనందరావుతో సౌందర్య. ఇంతలో హిమ వచ్చి.. ‘నేను వస్తాను నాన్నమ్మా’ అంటుంది. ‘వద్దు నేను ఒక్కదాన్నే వెళ్లొస్తాను.. మీకు వండి పెట్టడానికి.. బాబుని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టే వెళ్తాను’ అని ఒప్పిస్తుంది.

కార్తీక్ ఫోటోకి దండ వేసింది ఎవరు..?

Karthik

ఇక మరునాడు ఉదయానికి.. సంగారెడ్డిలో ఓ ఇంటి ముందు.. ఆటోలోంచి దిగుతుంది దీప. ఆ ఇంటిముందు ఒకావిడ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీప వెళ్లగానే మీ గురించి ‘రాజ్యలక్ష్మీ పిన్నీ చెప్పింది.ఇదిగో ఇదే ఇల్లు తాళాలు ఇవిగో అని లోపలికి వెళ్ళమని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది.దీప తాళం తీసుకుని లోపలికి వెళ్తుంది. కాస్త ముందుకు వెళ్లేసరికి.. కార్తీక్ ఫొటోకి దండ వేసి కనిపిస్తుంది. షాక్ అయిపోతుంది దీప.బ్యాగ్ అక్కడే పడేసి.. ఇంటి గేట్ దాకా పరుగున వెళ్లి చూస్తుంది దీప. ‘ఆవిడ ఎక్కడా? ఈ ఇల్లు ఎవరిది?’ అంటూ మళ్లీ పరుగున ఫొటో దాకా వస్తుంది. ఫొటో ముందు ఉన్న పూల రేకలు, అగరొత్తుల స్టాండ్, పూల దండ అన్నీ విసిరికొట్టి.. కార్తీక్ ఫొటోని ఏడుస్తూ చేతుల్లోకి తీసుకుని మీ ఫొటోకి దండ ఎవరు వేశారు? ఈ ఇల్లు ఎవరిది? ఎందుకిలా చేశారు? ఎవరు చేశారు?అని ఆలోచిస్తూ ఉంటుంది.. మరిన్ని వివరాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ దాక ఆగాలిసిందే..!


Share

Related posts

Adivi Sesh-Ravi Teja: ఊహించ‌ని షాక్ ఇచ్చిన ర‌వితేజ‌.. అడివి శేష్ వెన‌క్కి త‌గ్గుతాడా?

kavya N

Guppedantha Manasu November 11Today Episode: సూపర్ మహేంద్ర… నువ్వు ఇచ్చిన షాక్ కు దేవయాని నోటి వెంట మాట రాలేదుగా..!!

Ram

Intinti Gruhalakshmi: సామ్రాట్ ను పెళ్లి చేసుకోవద్దన్న వాళ్ళ బాబాయి..! తులసి ఆంటీనే కావాలన్న హనీ..!

bharani jella