Karthikadeepam serial today episode review November 30:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1523వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 30న ప్రసారం కానున్న Karthika Deepam serial,1523వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1523వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
కొడుకు, కోడలు బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య :
కార్తీక్, దీప బతికే ఉన్నారని తెలిసి సౌందర్య వాళ్ళు రాజ్యమ్మ ఇంటికి వస్తారు. కానీ ఆమె మాత్రం ఇంద్రుడు గురించి ఏమి తెలియనట్లు మాట్లాడుతుంది. ఇక అందరూ కూడా తీవ్ర నిరాశతో వెనుతిరుగుతారు. ఆనందరావు మాత్రం అసలు మన దీప, కార్తీక్ నిజంగా ప్రాణాలతో లేరేమో? అంటాడు ఆనందరావు అనుమానంగా. ‘ఆ విషయంలో నాకు ఏ అనుమానం లేదండి.. నేను ఇంద్రుడ్ని రాజ్యమ్మ ఇంట్లో కలిసేనాటికే వాళ్లు ఊరు వదిలి పారిపోయారు. అంటే ఎవరికో భయపడి పారిపోయారు. అది కార్తీక్, దీపలే ఎందుకు కాకూడదు?’అంటుంది సౌందర్య చాలా నమ్మకంగా అదే నిజం అయితే బాగుండు అంటాడు ఆనందరావు.నాకు అయితే నమ్మకం ఉంది నాన్నమ్మా అంటుంది హిమ కూడా..సౌర్య ఇంత పంతం పట్టి ఇక్కడే ఉందంటే అమ్మానాన్నలు బతికే ఉన్నారు అంటుంది.
దీపను హాస్పిటల్ కి తీసుకుని వచ్చిన కార్తీక్ :
సీన్ కట్ చేస్తే ఎలాగోలా కార్తీక్ దీపని వెతికి ఆసుపత్రికి తీసుకొస్తాడు. దీప సృహలో ఉండదు. ఆక్సిజన్ పైప్ పెట్టి ట్రీట్మెంట్ అందిస్తూనే ఉంటారు. కార్తీక్ కళ్లనిండా నీళ్లతో తనకి దీపకు పెళ్లి అయిన నాటి నుంచి.. దీప పడిన బాధలు అన్ని తలుచుకుని బాధపడతాడు.నీకు ఏదైనా అయితే నేను ఎలా బతకాలి దీపా?’ అంటూ ఎమోషనల్ అవుతాడు.
బోటిక్ అమ్మేసి హైదరాబాద్ వెళ్తున్న మోనిత :
మరోపక్క మోనిత.. కార్తీక్, దీపల గురించే ఆలోచిస్తుంది. ‘ఎక్కడికి వెళ్లిపోయారు? ఒకవేళ గతం గుర్తొచ్చి సౌర్యతో కలిపి ముగ్గురూ హైదరాబాద్ వెళ్లిపోయారా? వదిలిపెట్టను వాళ్ళను…నేను హైదరాబాద్ వెళ్తాను. వెతుకుతాను’ అని మనసులో అనుకుంటూ హడావుడిగా బట్టలు సర్థుకుంటుంది మోనిత. వెంటనే శివలతకు కాల్ చేసి శివలతా నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఈ బోటిక్ నువ్వే ఎంత ఉంచేసుకో నాకు చాలా చేశావ్ కదా అని అంటుంది.అయినా నేను ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ చేస్తున్నదే కార్తీక్ కోసం.. తనే లేకపోయాక ఈ బిజినెస్‌లు నాకెందుకు? సరే నేను వెళ్తున్నాను నన్ను ప్రశ్నలు వేసి చిరాకు తెప్పించకు అంటుంది.
మోనిత మాటలు విన్న శివలత.. ‘మేడమ్ ఇక్కడే నాలుగురోజలు వెయిట్ చేయండి.. వాళ్లే వచ్చేస్తారు’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ మోనిత వినిపించుకోదు.
సౌందర్య ఎంట్రీతో షాక్ అయిన మోనిత :
బ్యాగ్ తీసుకుని హాల్లోకి రాగానే ఎదురుగా ఉన్న సౌందర్యని చూసి బిత్తరపోతుంది. ఆంటీ మీరా? రండి.. కూర్చోండి అంటూ దొంగ ప్రేమ చూపిస్తుంది.సౌందర్య మాత్రం చాలా కూల్‌గా ఏంటి మోనిత ఎవరితోనే సీరియస్ గా మాట్లాడుతున్నవ్..మొన్ననే నా తల మీద కొట్టి నన్ను చంపాలనుకున్నావ్.. ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నావ్?’ అంటుంది సౌందర్య అలాంటిదేంలేదు ఆంటీ’ అంటుంది మోనిత తడబడుతూ. ‘అసలు నన్ను ఎందుకు తల మీద కొట్టావ్? తాళం పగలగొట్టి లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఇంటి లోపల ఏముంది? ఇప్పుడే తేలుస్తా అంటూ ఇల్లంతా వెతుకుతుంది సౌందర్య.
ఎక్కడా ఏం దొరకదు సౌందర్యకి. ఇంతలో మోనిత ఆంటీ ఇక్కడికి వచ్చిందంటే.. దీప వాళ్లు హైదరాబాద్ వెళ్లలేదా? వాళ్లు బతికి ఉన్న విషయం కూడా సౌందర్య ఆంటీకి తెలియదా? అమ్మయ్యా అనుకుని సౌందర్యని వెనక్కి తోసేసి.. గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది.
సౌందర్యకు గన్ గురిపెట్టిన మోనిత :
వెనుకే పరుగుతీసిన సౌందర్య ‘తలుపు తియ్యవే’ అంటూ గట్టిగానే అరుస్తుంది. మోనిత తలుపు తీస్తుంది కానీ.. చేతిలో గన్ పట్టుకుని ఎక్కడో దూరంగా నా బతుకు నేను బతుకుతుంటే ఏంటీ మీగోలా?’ అంటూ అరుస్తుంది మోనిత. ‘బతుకా? బతుకు అంటారా దీన్నీ? ఎందుకు బతుకుతున్నావో తెలియదు నీకు అననీ కొడుకుని తీసుకుని ఎన్ని రోజులు అయ్యింది? ఎలా ఉన్నాడు అని ఒక్కసారైనా ఫోన్ చేసి కనుక్కున్నావా?’ అంటుంది సౌందర్య కోపంగా. ‘నా కొడుకుని నాకు తెలియకుండా ఎత్తుకుపోయి.. మళ్లీ ఫోన్ చేయట్లేదు అని అంటున్నారా? అసలు మీ అందరి మీద నేను కిడ్నాప్ కేస్ పెట్టాలి’ అంటూ అరుస్తుంది మోనిత.
సౌందర్యనా మజాకానా..?
మొన్న దెబ్బతోనే సరిపెట్టాను.. ఇప్పుడు కాల్చేస్తాను వెళ్లిపొండి. మీ కొడుకు కోడలు ప్రాణాలతో లేరు కదా? ఇప్పుడు ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నారు? అంటూ అరుస్తుంది మోనిత. దాంతో సౌందర్య మనసులో నిజంగానే దీప కార్తీక్ ప్రాణాలతో లేరు అనుకుంటుందా? ఇప్పుడు దీనికి నిజం తెలిస్తే వాళ్లు ఎక్కడున్నా వెతికి వాళ్ల జీవితాలను నాశనం చేస్తుంది.. తెలియనివ్వకూడదు అని మనసులో అనుకుంటూ తెలివిగా మోనిత చేతిలోంచి గన్ లాక్కుని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.