NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial today episode:. మోనితను కొట్టిన కార్తీక్.. డౌట్ లేదు గతం గుర్తుకు వచ్చిందని నమ్మేసిన మోనిత..!!

Karthikadeepam serial today episode review November 10 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1506వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 9న ప్రసారం కానున్న Karthika Deepam serial,1506వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1506 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ మీద అనుమానం పెంచుకుంటుంది.

దీప గురించి ఆందోళన చెందుతున్న కార్తీక్ :

Karthik

ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే.. కార్తీక్ పొద్దు పొద్దునే దీప ఇంటికి వెళ్తాడు. తాళం వేసి ఉండటంతో దీప ఎక్కడికి వెళ్లింది అని కంగారు పడతాడు మరోవైపు దీప గుడిలో తుడుస్తూ కడుగుతూ ఉంటుంది.అదంతా చాటుగా చూస్తున్న మోనిత.. ‘పొద్దున్నే ఎక్కడికిపోతుందా? అని ఫాలో అయితే.. ఇది ఇక్కడికిి వచ్చి గుడి సేవలు చేస్తోంది ఏంటో?అనుకుంటుంది.మోనిత పంతులు దగ్గరకు వెళ్లి.. ‘పంతులు గారు పాపం ఆవిడా చాలా కష్టపడుతోంది.. ఏం కష్టం వచ్చిందట పాపం?’ అంటూ కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. పంతులు చెప్పకుండా నీకు ఎందుకు అన్నట్టు మాట్లాడతాడు. సర్లేగాని పంతులు గారు ఈ రోజు కార్తీకపౌర్ణమి కదా.. రాత్రి 365 ఒత్తులు వెలిగిస్తే మంచిదట కదా?’ అంటుంది మోనిత. ‘అవునమ్మా మంచిదే కానీ భక్తితో వెలిగించాలి అంటాడు. ఇక ఆ పంతులు గారు దీప చేస్తున్న సేవకు మెచ్చి.. ‘అమ్మా ఈ రోజు రాత్రి 365 ఒత్తుల దీపం వెలిగించండి అంతా మంచే జరుగుతుంది’ అంటూ ప్రసాదం అందిస్తాడు.

గుడిలో మెట్లు కడుగుతున్న దీప :

Deepa

మరోపక్క కార్తీక్ దీప ఎక్కడికి వెళ్లింది? అని ఆలోచిస్తూ ఉంటే.. బాబు ఏడుస్తూ ఉంటాడు. శివలత వచ్చి.. ‘మేడమ్ లేదు బయటికి వెళ్లింది’ అని చెబుతుంది. ‘బాబుని వదిలేసి ఎక్కడికి వెళ్లింది?అని అరిచి ఎట్టుకోమని చెప్తాడు.ఇంతలో మోనిత పూజ సామాగ్రి పట్టుకుని ఇంటికి వస్తుంది. ‘కార్తీక్.. ఈ రోజు కార్తీకపౌర్ణమి.. మనిద్దరం పూజ చెయ్యాలి.. రాత్రికి నువ్వు ఏ పనులు పెట్టుకోకు అంటుంది మోనిత.
సరేగాని మోనితా వంటలక్కని.. ఏమైనా చూశావా?’ అంటాడు కార్తీక్. ‘చూశానే.. గుడి దగ్గర చూశాను.. పాపం గుడి దగ్గర ఊడ్చుకుంటూ కనిపించింది.. గుడి మెట్లు కడుక్కుంటూ పాపం చాలా కష్టపడుతుంది అని చెప్పగానే కార్తీక్ మనసులోనే అల్లాడిపోతూ ఉంటాడు. కార్తీక్ ఫీలింగ్స్ గమనించిన మోనిత.. ‘ఏంటి కార్తీక్ అలా అయిపోయావ్?’అంటుంది. వెంటనే కార్తీక్ తనని తాను సముదాయించుకున్నట్లుగా ఏమి లేదు..’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ అడుక్కునే పరిస్థితి అనగానే ఇక్కడ ఈయనగారి ముఖం మడిపోయింది అంటే కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చింది అని అనుకుంటుంది.

సౌర్యను మభ్య పెడుతున్న ఇంద్రుడు, చంద్రమ్మ :

Sourya

మరోవైపు.. ఇంద్రుడు, చంద్రమ్మలు.. ఏవో డబ్బులు లెక్కలు వేసుకుంటూ ఉంటే.. సౌర్య వచ్చి.. ‘బాబాయ్ ఆటో మీద సంగారెడ్డి వెళ్దామా? అమ్మా వాళ్లనివెతకడానికి?’ అంటుంది. ‘ఆటో ఎక్కడిదమ్మా.. అమ్మేశాం కదా బాబాయ్‌కి నడుము నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్తే డాక్టర్ ఆటో నడపొద్దు అన్నాడట.. అందుకే అమ్మేశాం’ అంటుంది చంద్రమ్మ. ‘ఆటో లేకపోతే ఏంటమ్మా.. మనం వారానికి రెండు రోజులు బస్సు మీద సంగారెడ్డి వెళ్లి.. అక్కడంతా వెతికేద్దాం’ అంటాడు ఇంద్రుడు.
మరోవైపు కాసేపటికి దీప ఇంటికి వస్తుంది. వెంటనే కార్తీక్ దీప ఇంటికి వస్తాడు. ‘గుడి మెట్లు కడుగుతున్నావా దీపా’ అంటాడు కార్తీక్ కాస్త కంగారుగా. ‘అవును డాక్టర్ బాబు.. నా బిడ్డ నాకు కనిపించేంత వరకూ అలానే చేస్తానని మొక్కుకున్నాను అంటుంది.

మోనితను కొట్టిన కార్తీక్ :

Monitha karthik

డాక్టర్ బాబు ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా.. గుడిలో మూడివందల అరవైదు ఒత్తులు వెలిగించి పూజ చేస్తే అనుకున్నది జరుగుతుందంట అని చెప్పి డాక్టర్ బాబు నాకు అడగటానికే ఏదోలా ఉంది కానీ నాకు ఒక ఆరు వందల రూపాయలు ఉంటే ఇస్తారా?’ అంటుంది దీప. ఆ మాటలకు కార్తీక్‌కి చాలా బాధేస్తుంది.కంగారుగా పర్స్ బయటికి తీసి ఇంకెప్పుడు నువ్వు డబ్బులు కోసం ఇబ్బంది పడకూడదు.. ప్రస్తుతానికి ఈ డబ్బులు ఉంచు’ అంటూ అందులోని డబ్బులన్నీ దీప చేతికి ఇవ్వబోతాడు. అప్పుడే మోనిత ఎంట్రీ ఇచ్చి ఆ డబ్బులు తను లాక్కుంటుంది.బంగారం తాగట్టు పెట్టి నువ్వు ఈ పని చేస్తున్నావా కార్తీక్’ అంటూ నిలదీస్తుంది.ఇంకా రెచ్చకొడుతుంది కార్తీక్ ను..‘మోనితా..’ అంటూ అరుస్తాడు కార్తీక్. వెంటనే మోనిత మనసులో ‘ఇప్పుడు కొడితే గతం గుర్తొచ్చినట్లే..’ అని మనసులో ఫిక్స్ అయ్యి.. ఇంకా ఇంకా కార్తీక్‌ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. వెంటనే లాగిపెట్టి కొట్టేస్తాడు కార్తీక్. ‘డౌట్ లేదు.. గతం గుర్తొచ్చింది.. గుర్తొచ్చే నా దగ్గర నాటకం ఆడుతున్నావా కార్తీక్?’ అని మనసులో రగిలిపోతుంది మోనిత.దీప కూడా షాక్ అవుతుంది. ‘అలా కొట్టేశారేంటీ? నేనే భార్యనని గుర్తొచ్చిందా?’ అని అనుమానిస్తుంది. వెంటనే కార్తీక్.. కవర్ చేసుకోవడానికి.. ‘కొంచమైనా బుద్ధి ఉందా నీకు? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమేనా? ఈ రోజు నువ్వు పూజ చేస్తున్నావ్ కదా? ఎవరికోసం నీ భర్త కోసం అంటే నా కోసం.. ఏంటి నాకోసం కాదా?’ అంటాడు కార్తీక్ కోపంగా. నీ కోసమే అంటుంది మోనిత.మరి.. నువ్వు ఎలా అయితే నీ భర్త కోసం పూజ చేసుకోవాలని కోరుకుంటున్నావో.. అలాగే వంటలక్క కూడా కోరుకుంటుంది కదా అంటాడు కార్తీక్. పూజ కోసం తన దగ్గర డబ్బులు లేకపోతే.. ఎదురుబొదురు ఉన్నవాళ్లం కదా అని డబ్బులు ఇస్తే సంబంధం అది ఇది అని మాట్లాడతావా? ఏం పూజకోసం ఓ పదివేలు సాయం చేయకూడదా?’ అంటాడు కార్తీక్.

కరెక్ట్ టైం కి వచ్చిన దుర్గ:

Durga entry

ఇక అప్పుడే మోనితా అంటూ ఎంట్రీ ఇస్తాడు దుర్గ రావడంతోనే షూస్ ఎలా ఉన్నాయి? అంటాడు. అప్పటికే తిక్కలో ఉన్న మోనిత.. ‘నీ షూస్ ఎలా ఉంటే నాకెందుకురా?’ అంటుంది.అదేంటి మోనితా అలా అంటావ్. చెప్పులు బాలేదు షూస్ కొనుక్కో అని పదివేలు ఇచ్చావ్ కదా అంటూ ఇరికిస్తాడు దుర్గ. కార్తీక్ మోనితవైపు కోపంగా గుర్రుగా చూస్తూ.. ‘పూజకు పదివేలు ఇస్తే తప్పు.. షూస్‌కి నువ్వు పదివేలు ఇస్తే తప్పుకాదా అంటూ నేను ఇచ్చింది పూజకి విలాసాలకు కాదు అని మోనిత చేతనే దీపకు బలవంతంగా డబ్బుల్ని ఇప్పిస్తాడు కార్తీక్. దాంతో మోనిత రగిలిపోతుంది. అయిష్టంగానే దీప చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu