NewOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam: దీప కోసం వంట చేసిన కార్తీక్..అది చూసి కోపంతో రగిలిపోతున్న మోనిత..!!

Share

Karthikadeepam:  October 19 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1486వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 19 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఈరోజు ఎపిసోడ్ లో వారణాసి ఆరోగ్యం గురించి కార్తిక్ అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ను అడుగుతాడు.

అలాగే ఆ డాక్టర్ కార్తీక్ ను గుర్తుపట్టి మీరు హైదరాబాదులో పనిచేసేవారు కదా, మీ ప్రొఫైల్ చూసాను చాలా బాగుంది అంటాడు. అలాంటి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. కొన్ని అనివార్య కారణాలవల్ల కొన్ని నెలలుగా ఇక్కడే ఉండవలసి వచ్చింది అంటాడు ఏమైనా సర్జరీలు ఉంటే చెప్పండి అని కార్తీక్ అంటాడు. సర్జరీలు ఉన్నప్పుడు తప్పనిసరిగా చెప్తాను అని అంటాడు డాక్టర్.సీన్ కట్ చేస్తే దీప జరిగిన విషయాలు అన్ని డాక్టర్ అన్నయ్యకు చెబుతుంది.కార్తీక్ లో మార్పు మొదలయింది అమ్మా.. నీకు మంచి రోజులు వచ్చాయి అని అంటాడు. కార్తీక్ గురించి హైరానా పడుతున్న మోనిత:

Advertisements
Karthik,monitha

ఇక మోనిత మాత్రం కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు…ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ని, ఎక్కడికి వెళ్లావు కార్తీక్ అని అంటుంది.అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతుంది. ఎవరో తెలిసిన వాళ్ళులే అని అంటాడు. ఎవరో చెప్తే నాకు తెలుస్తుందేమో కదా అని అంటుంది మోనిత. ముందు సుబ్బారావు అని చెప్పి తరువాత ఆనందరావు, సౌందర్య పేర్లు చెబుతాడు. ఆ పేర్లు విని మోనిత షాక్ అయి కార్తీక్ గతం గుర్తు వచ్చి మాట్లాడుతున్నాడా లేకపోతే మామూలుగానే మాట్లాడుతున్నాడా అని అనుకుంటుంది.సర్లే కార్తీక్ రెండు రోజుల నుంచి టాబ్లెట్ కూడా వేసుకోలేదు వేసుకో అని చెప్పి టీ పెట్టడానికి వెళుతుంది మౌనిత. ఏం టాబ్లెట్ ఇస్తుంది అని వాటిని చూస్తాడు.టీ తెచ్చిన మోనితతో ఆ టాబ్లెట్ ఎందుకు అని అడుగుతాడు. గతం గుర్తుకు రావడానికి అని అబద్దం చెబుతుంది మోనిత. గతం గుర్తుకు రావడానికి ఉన్న మతి పోవటానికా? అని మనసులో అనుకుంటాడు.

కార్తీక్ లో మార్పు చూసి సంతోషపడిన దీప :

Deepa happy


ఇక దీప,డాక్టర్ అన్నయ్య ఇద్దరు కూడా అస్తవ్యస్తంగా ఉన్న ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇల్లు ఇలా ఉంటే మా డాక్టర్ బాబుకి నచ్చదు అని అంటుంది దీప. అప్పుడు హేమచంద్ర,నువ్వు ఇక్కడ ఎందుకమ్మా డాక్టర్ బాబుతో ఉండొచ్చు కదా అని అంటే అప్పుడే వచ్చిన కార్తీక్ వద్దులేండి దీప ఈ కుటీరంలో ఉంటేనే బాగుంటుంది అంటాడు. మీరు డాక్టర్ హేమ చంద్ర కదా అని అంటాడు కార్తీక్.హ అవును మీకు గుర్తు ఉన్నానా అని అంటే ఈ మధ్య కాస్త గుర్తుకు వస్తున్నాయి అంటాడు కార్తీక్.అయినా ఈ ఇంటి గురించే కదా కంగారు,తలా ఒక చెయ్యి వేద్దామని చెప్పి బూజు దులపడం ప్రారంభిస్తాడు కార్తీక్. ఇక మెల్లగా హేమ చంద్ర అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు.ఇంతలో దీప పొద్దున్న ఎవరు ఫోన్ చేశారు అని అడగగా కార్తీక్ వారణాసి గురించి చెప్పకుండా ఏదో అబద్ధం చెప్పేస్తాడు.సరే డాక్టర్ బాబు నేను వంట చేస్తాను అన్న దీపతో ఎప్పుడు నువ్వే చేస్తావు కదా ఈరోజు నేను చేస్తాను అని అంటాడు కార్తీక్. సరే డాక్టర్ బాబు వంటకు కావలిసినవి అన్ని ఏర్పాటు చేస్తాను అంటుంది దీప.

మోనితకు సౌర్య విషయం చెప్పిన శివ :

Siva

సీన్ కట్ చేస్తే ఇంటికి శివ లేట్ గా వస్తాడు. శివను గమనించిన మోనిత ఎక్కడికి వెళ్లావు ఈ మధ్య ఎక్కడికో వెళ్తున్నావు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఏం లేదు అని శివ అబద్దం చెప్తాడు.సరే నీ ఉద్యోగం పీకేస్తాను అని మోనిత బ్లాక్మెయిల్ చేస్తుంది.అప్పుడు శివ, శౌర్య గురించి నిజం చెప్తాడు. కంగారుపడిన మౌనిక అదేంటి కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చిందా అని అనుకుంటుంది. అలా అయితే ఆ సౌర్యని,దీపని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు కదా అని ఆలోచించుకుంటుంది. అలా జరగకూడదు అని శివకు జీతం పెంచి ఆ పాప గురించి వెతకడం మానేయమని చెబుతుంది.

మోనితను రెచ్చగొట్టిన దుర్గా:

Siva, monitha

సరిగ్గా అప్పుడే దుర్గ వస్తాడు.. ఏంటి ఇలా వచ్చావ్ కార్తీక్ ఉన్నప్పుడే కదా ఏవో నాటకాలు వేస్తావు ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదా ఎందుకు వచ్చావ్ అని దుర్గను అడుగుతుంది. నిన్ను ఏదో చేయాలని రాలేదు అక్కడ వంటలక్కకి డాక్టర్ బాబుకి మధ్యలో డిస్టబెన్స్ గా ఉంటుందని ఇటువైపు వచ్చాను అని అంటాడు. అది విని ఏంటి కార్తీక్ అక్కడ ఉన్నాడా అని కంగారుపడుతు మౌనిత దీప ఇంటికి బయలుదేరుతుంది.అది చూసి వెటకారంగా నవ్వుకుంటాడు దుర్గ .

దీప కోసం వంట చేసిన కార్తీక్… అది చూసి మండిపడిన మోనిత :

Karthik prepare food for deepa

దీప ఇంటికి వచ్చిన మోనిత అక్కడ భోజనం చేయబోతున్న కార్తీక్, దీపలను చూసి కోపంతో ఏం చేస్తున్నారు అని గట్టిగా అడుగుతుంది. రా మోనిత నేనే వంట చేశాను,రిస్క్ లేకపోతే నువ్వు కూడా వచ్చి భోం చెయ్ అని అంటాడు కార్తీక్. ఎప్పుడు వంటలక్క వండడంమేనా అని ఈసారి నేను వంట చేశాను అంటాడు.అయినా నా కార్తీక్ తో వంట చేయిస్తావా వంటలక్కా అని దీప మీద అరుస్తుంది.తనని ఎందుకు అంటావ్ నేనే కావాలని వండాను..అయినా నీ బుద్ధి బాగుంటే నేనెందుకు ఇటువైపు వస్తాను అని అంటాడు కార్తీక్. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది మౌనిత. ఇంటికి వచ్చిన వాళ్ల కోసం కొద్ది సేపు నన్ను అటూ ఇటూ తిప్పి తీసుకుని రమ్మంటే అసహ్యంగా ఉంటుంది కదా అందుకే నీకు ఆ శ్రమ లేకుండా నేనే బయటకు వచ్చేస్తున్నాను అని అంటాడు.అదేంటి అన్న మోనితతో, నిజమే కదా మోనిత…మొన్న దుర్గా వచ్చాడని డాక్టర్ బాబుని తీసుకొని బయట తిప్పి రమ్మని శివతో అన్నావట కదా అది విని డాక్టర్ బాబు చాలా బాధపడ్డారు అని అంటుంది దీప.ఆ మాటకు మోనిత ఒక్కసారిగా అవాక్ అవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

మహిళ కాబ‌ట్టే వ‌దిలేశా.. మ‌గాడైతే మ‌రోలా ఉండేదంటున్న‌ రెజీనా!

kavya N

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

sekhar

Guppedantha Manasu November 22Today Episode: మహేంద్రకు చివరి అవకాశం ఇచ్చిన రిషి.. ఈరోజు దాటితే అంతే సంగతులు..!

Ram