టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రను పోషించారు.
ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చేసి లాభాల భాట పట్టిన ఈ చిత్రం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో వసూళ్లను రాబట్టిందో పరిశీలిస్తే..
నైజాం: 7.02 కోట్లు
సీడెడ్: 2.91 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.59 కోట్లు
తూర్పు: 1.54 కోట్లు
పశ్చిమ: 1.03 కోట్లు
గుంటూరు: 1.65 కోట్లు
కృష్ణ: 1.36 కోట్లు
నెల్లూరు: 0.59 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ= 18.69 కోట్లు(29.55కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటఖ+రెస్టాఫ్ ఇండియా: 1.64 కోట్లు
ఓవర్సీస్: 3.25 కోట్లు
నార్త్ ఇండియా: 4.45 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 28.03 కోట్లు(50.55 కోట్లు~ గ్రాస్)
——————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 12.80 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే మూడొవ రోజు సాధించిన కలెక్షన్స్‌తోనే బ్రేక్ ఈవెట్ టార్గెట్‌కు క్రాస్ చేసిన ఈ సినిమా.. 7వ రోజు వసూళ్లతో రూ. 14.73 కోట్ల లాభాలతో సూపర్ స్టడీగా ముందుకు సాగుతోంది.