33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Karthikeya 2 Trailer: థ్రిల్లింగ్‌గా `కార్తికేయ 2` ట్రైల‌ర్‌.. నిఖిల్‌కి మ‌రో హిట్ ఖాయ‌మా?

Share

Karthikeya 2 Trailer: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, కలర్స్ స్వాతి జంట‌గా న‌టించిన చిత్రం `కార్తికేయ‌`. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. 2014లో విడుద‌లై ఎంత మంచి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఇప్పుడీ మూవీకి సీక్వెల్‌గా కార్తికేయ 2 రాబోతోంది.

ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తే.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 22న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా `కార్తికేయ 2` ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. `ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు` అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటూ సూప‌ర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగింది. నీటి అడుగున రహస్యమైన ద్వారకానగరం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింద‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

`అసలు కృష్ణుడు ఏంటి? ఈ కథను ఆయన నడిపించడం ఏంటి?` అని నిఖిల్ చెప్పే డైలాగ్ ఆసక్తి పెంచింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువ‌ల్స్ వంటి అంశాలు కూడా బాగుతున్నాయి. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. అంతేకాదు, ట్రైల‌ర్ చూసిన సినీ ప్రియులు నిఖిల్‌కి మ‌రో హిట్ ఖాయ‌మంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి వారి కామెంట్స్ ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో జూలై 22న చుద్దాం కానీ.. ముందైతే కింద ఉన్న ట్రైల‌ర్‌పై లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.


Share

Related posts

`కె.జి.య‌ఫ్ చాప్టర్ 2` అధీర లుక్ విడుద‌ల‌

Siva Prasad

క‌ల్యాణ్ రామ్‌తో బాల‌య్య హీరోయిన్‌

Siva Prasad

NTR- Charan: అరుదైన ఫొటోను షేర్ చేసిన ఎన్టీఆర్‌.. ఫిదా అవుతున్న చెర్రీ ఫ్యాన్స్‌!

kavya N